దేవరకొండ రూరల్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెండ్లిపాకల గ్రామంలో గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సైదయ్య, లక్ష్మమ్మ ఇంటి వద్ద బంధువుల పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంటి ముందున్న పందిరికి కట్టిన ఊయల వద్ద బంధువుల పిల్లలు కార్తీక్(2), అశ్విని(5) ఉండగా పందిరిపై ఉన్న కరెంటు తీగలు షార్ట్‌సర్క్యూట్ అయ్యి మంటలు లేచాయి.
ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చిన్నారులపై పడటంతో వారు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. స్థానికులు రక్షించటానికి యత్నించినా వీలుకాలేదు. సంఘటన స్థలాన్ని సీఐ గట్టుమల్లు, తహశీల్దార్ గణేష్‌నాయక్ పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.
ఇద్దరు చిన్నారులు సజీవ దహనం
Published Thu, May 12 2016 5:19 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement