కాలిపోయిన చెరుకుతోటను పరిశీలిస్తున్నసంగం నాయకులు
అమరచింత: పట్టణానికి చెందిన నారాయణ రెడ్డి, చంద్రన్నలకు చెందిన ఏడు ఎకరాల చెరుకు తోట షార్ట్‌సర్క్యూట్ కారణంగా దగ్ధం కాగా.. రూ.3.50 లక్షల నష్టం వాటిల్లింది. ప్రమాదవశాత్తు చెరుకుతోటలో మంటలు వ్యాపించడంతో సమీప రైతులు నీటిని పిచికారి చేసి మంటలను ఆర్పివేశారు. అప్పటికే డ్రిప్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయని బాధిత రైతులు వాపోయారు.
కాలిన పంటను కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే కటింగ్ చేసి ఫ్యాక్టరీకి తరలించాలని చెరుకు సంగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. సోమ వారం కాలిన చెరుకు తోటను ఫ్యాక్టరీ సిబ్బందితో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఏఓ ఆశీఫ్, ఫీల్డ్‌మెన్ రాజుతో పాటు పలువురు ఉన్నారు.
ప్రమాదవశాత్తు నదిలో పడి యువకుడి మృతి
కొల్లాపూర్ రూరల్: మండల పరిధిలోని సోమశిల సమీపంలో ఉన్న కృష్ణానదిలో ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన కౌషిక్ (22)ఏడాదిగా హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం నూతన సంవత్సర వేడుకలను సోమశిలలో నిర్వహించేందుకు 20మంది తన స్నేహితులతో కలిసి వచ్చాడు.
రాత్రి ఉత్సాహంగా వేడుకలు చేసుకొని.. రాత్రి అక్కడే బస చేశాడు. సోమవారం ఉదయం కౌషిక్ ఒక్కడే నదిలోకి స్నానం చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నదిలో ఉన్న బురుదలో ఇరుక్కొని చనిపోయాడు. అక్కడే ఉన్న మత్స్యకారులు అలివి వలలు వేసి బయటి తీశారు. పోలీసులు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment