రోజు మాదిరిగానే.. సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరుతుండగా.. | - | Sakshi
Sakshi News home page

రోజు మాదిరిగానే.. సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరుతుండగా..

Published Fri, Apr 5 2024 1:25 AM | Last Updated on Fri, Apr 5 2024 2:00 PM

- - Sakshi

ట్రాక్టర్‌ ఢీకొని విద్యార్థి దుర్మరణం

మహబూబ్‌నగర్‌: సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరిన ఓ విద్యార్థిని ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈవిషాదకర ఘటన కృష్ణా మండలం ఆలంపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఆలంపల్లికి చెందిన కావలి హన్వేష్‌ కుమారుడు ప్రకాష్‌ (14) కున్సి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.

రోజు మాదిరిగానే గురువారం సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరగా.. గ్రామ సమీపంలో పత్తి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రకాష్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘట నా స్థలానికి చేరుకొని కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థులకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని గ్రామస్తులు వాపోయారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి చదవండి: హడలెత్తిస్తున్న ఏనుగు.. దాడిలో ఇద్దరి రైతుల విషాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement