భర్త వేధింపులు తాళలేక భార్య విషాదం! | - | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు తాళలేక భార్య విషాదం!

Published Thu, Mar 14 2024 1:00 AM | Last Updated on Thu, Mar 14 2024 11:53 AM

- - Sakshi

సరిత(ఫైల్‌)

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముమ్మళ్లపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి కథనం మేరకు.. పాన్‌గల్‌ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన కృష్ణయ్య కుమార్తె సరిత (25)ను కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లికి చెందిన నాయిని మారుతికిచ్చి ఆరేళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మారుతి జిల్లాకేంద్రంలోని మార్కెట్‌యార్డులో కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవారు.

బుధవారం ఉదయం భర్త, పిల్లలు బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న సరిత ఇంట్లో ఉరేసుకుంది. ఇంటికి వచ్చిన మారుతి తలుపులు తెరిచి చూడగా సరిత ఉరేసుకొని కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సరిత తల్లిదండ్రులతో వివరాలు సేకరించారు. కొంతకాలంగా మారుతి అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడని తండ్రి వాపోయాడు. కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

ఇవి చదవండి: భర్త, అత్త వేధింపులతో వివాహిత తీవ్ర నిర్ణయం..! చివరికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement