జువైనల్ హోమ్‌లో బాలుడి అనుమానాస్పద మృతి
Published Thu, Oct 20 2016 11:22 AM | Last Updated on Fri, Jul 12 2019 3:31 PM
కడప: కడప జువైనల్ హోమ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు అనుమానాస్పదస్ధితిలో మృతి చెందాడు. షేక్ ముస్తఫా(16) అనే బాలుడు హోమ్‌లో ఉన్న ఓ బాత్రూం నిర్జీవ స్థితిలో పడి ఉండటం గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియ జేశారు. అధికారులు పరిశీలించి చూడగా బాలుడి అప్పటికే మృతిచెందాడు. షేక్ ముస్తఫా స్వస్థలం ప్రొద్దుటూరు. నాలుగు నెలల క్రితం బంధువుల ఇంట్లో దొంగతనం చేయడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు.
Advertisement
Advertisement