Juvainal Home
-
జువనైల్ హోం నుంచి యువకుల పరారీ
సాక్షి దినపత్రిక వాహనం డ్రై వర్‌పై దౌర్జన్యం పారిపోతూ పట్టుబడిన వైనం మంగళగిరి : చిన్నతనంలోనే పలు నేరాలు చేసిన యువకులు జువనైల్ హోమ్ నుంచి తప్పించుకుని మళ్లీ నేరం చేసి పారిపోతూ పోలీసులకు పట్టుబడిన ఘటన ఇది. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జువనైల్ హోమ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు యువకులు మంగళవారం అర్ధరాత్రి హోం తాళాలు పగులకొట్టి తప్పించుకున్నారు. వారు గుంటూరులోనే ఒక ద్విచక్రవాహనాన్ని దొంగలించి దానిపై విజయవాడ బయలుదేరారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో వినుకొండ వెళుతున్న సాక్షి పత్రిక ఆటోను చినకాకాని ఎన్ఆర్ఐ ఆస్పత్రి వద్ద నిలిపి ఆటో డ్రై వర్‌పై దాడి చేసి అతడి వద్ద ఉన్న రూ. వెయ్యి నగదు, సెల్‌ఫోన్ తీసుకున్నా. ఫోన్లో సిమ్ తీసిపడేసి మళ్లీ గుంటూరు వైపు వెళ్లారు.ఇంతలో ఆటో డ్రై వర్కు తెలిసిన వ్యక్తి అటుగా రావడంతో ఇద్దరు కలిసి వారిని వెంబడించారు. పోలీసులు అభి భావించిన యువకులు గుంటూరు వెళ్లి ద్విచక్రవాహనం అక్కడ వదిలేశారు. మళ్లీ ఆటోలో విజయవాడ బయలుదేరారు. హోం నుంచి తప్పించుకున్న విషయాన్ని పోలీసులు సెట్ ద్వారా అన్ని పోలీస్స్టేషన్లకు తెలపడంతో అప్రమత్తమైన తాడేపల్లి పోలీసులు వారధి వద్ద ఆటోను ఆపగా ఐదుగురు యువకుల ప్రవర్తన అనుమానస్పదంగా ఉండడంతో స్టేషన్‌కు తరలించారు. ఆటోడ్రై వర్ తన్నీరు శ్రీనివాస్ మంగళగిరి రూరల్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఆటోడ్రై వర్‌పై దాడి చేసింది తాడేపల్లి పోలీసుల అదుపులో ఉన్న యువకులేనని గుర్తించి వారిని మంగళగిరి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జువైనల్ హోమ్‌లో బాలుడి అనుమానాస్పద మృతి
కడప: కడప జువైనల్ హోమ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు అనుమానాస్పదస్ధితిలో మృతి చెందాడు. షేక్ ముస్తఫా(16) అనే బాలుడు హోమ్‌లో ఉన్న ఓ బాత్రూం నిర్జీవ స్థితిలో పడి ఉండటం గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియ జేశారు. అధికారులు పరిశీలించి చూడగా బాలుడి అప్పటికే మృతిచెందాడు. షేక్ ముస్తఫా స్వస్థలం ప్రొద్దుటూరు. నాలుగు నెలల క్రితం బంధువుల ఇంట్లో దొంగతనం చేయడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు. -
తల్లి పనిచేసే ఇంట్లో చోరీ..
తల్లి పని చేసే ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఓ మైనర్ బాలికను కంచన్‌బాగ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 26 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎన్.శంకర్ కేసు వివరాలను వెల్లడించారు. సంతోష్‌నగర్ యాదగిరినగర్ రోడ్డు నంబర్ 12 ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగులు రాజు, దయావతిలు దంపతులు. రాజు ఇంట్లో చంపాపేట్ చిలకల బస్తీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పని చేస్తోంది. దయావతి మూడు రోజుల క్రితం బీహెచ్ఈఎల్లోని బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం వచ్చి చూడగా అల్మారాలో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పని మనిషితో పాటు ఆమె కూతురు(15)ని అదుపులోకి విచారించగా దొంగతనం విషయం బయట పడింది. దయావతి భర్త పని మనిషిని నమ్మి బయటికి వెళ్లడం....తల్లి ఇంటి పనిలో నిమగ్నమై ఉండడాన్ని గమనించిన సదరు బాలిక అల్మారాలో ఉన్న బంగారు నగలను తస్కరించింది. దర్యాప్తులో బాలికే దొంగతనానికి పాల్పడిందని తేలడంతో బాలికను జూవైనల్లో హోమ్‌కు తరలించారు. -
జువైనల్‌హోం నుంచి బాలుడు పరార్
సైదాబాద్(హైదరాబాద్): రాష్ట్ర బాలుర సంస్కరణల, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సైదాబాద్‌లో కొనసాగుతున్న బాలుర పరిశీలన గృహం నుంచి ఓ బాలుడు తప్పించుకున్నాడు. ఈ సంఘటన గత ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం బూర్లపాడుకు చెందిన ఓ బాలుడు(16) ఘర్షణలో పాల్గొన్నందుకు గాను అక్కడి పోలీసులు సైదాబాద్ జువైనల్‌హోంకు అప్పగించారు. కాగా, గత నెల 30న పరిశీలన గృహం బాలురు భోజనం చేయడానికి గాను ఆవరణలోకి వచ్చారు. ఆ సమయంలో అదను చూసుకుని సదరు బాలుడు అక్కడి గోడ దూకి పరారయ్యాడు. దీనిపై పరిశీలన గృహం సూపరింటెండెంట్ రామచంద్రమూర్తి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర బాలుర సంస్కరణల, సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. -
అవును..మా అబ్బాయే
ఏడేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడిని గుర్తించిన తల్లిదండ్రులు బహదూర్‌పురా: ఏడేళ్ల క్రితం కన్పించకుండా పోయిన ఆంజనేయులు తమ కుమారుడేనంటూ అంబర్‌పేటకు చెందిన శివ, అంజమ్మ దంపతులు మంగళవారం చార్మినార్ పోలీసులను సంప్రదించారు. పోలీసుల కథనం ప్రకారం... 2003లో చార్మినార్ వద్ద తప్పిపోయిన ఆంజనేయులు అనే బాలుడు రెలైక్కి చెన్నై చేరుకొన్నాడు. అక్కడ అనుకోని విధంగా ఓ కేసులో ఇరుక్కొని జువైనల్ హోంలో మూడేళ్లు శిక్ష అనుభవించాడు. ఆత ర్వాత బయటకు వచ్చాక..ఎటు వెళ్లాలో తెలియక తనకు ఎవరూ లేరని చెప్పడంతో అధికారులు జువైనల్ హోంలోనే మరో నాలుగేళ్లు ఉంచారు. శిక్ష పూర్తయినా నాలుగేళ్లవరకు తల్లిదండ్రులు ఎవరూ రాకపోవడంతో స్పందించిన జడ్జి స్థానికంగా ఉన్న స్కోప్ ఇండియా స్వచ్ఛంద సంస్థ డిప్యూటీ డెరైక్టర్ సత్తిబాబుకు ఆ బాలుడి కుటుంబ వివరాలు తెలుసుకొని అప్పగించాలని పురమాయించారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థ డిప్యూటీ డెరైక్టర్ స్పందించారు. బాలుడు ఆంజనేయులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి చేరుకొని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆతర్వాత ఆయన చుట్టుపక్క ప్రాంతాల్లో ఆరా తీసినా ఏమీ తెలియకపోవడంతో ఆంజనేయులుని తీసుకొని చెన్నైకి వెళ్లి పోయాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల కోసం తపిస్తున్న బాలుడి ఫొటో పత్రికల్లో ప్రచురితం కావడంతో దాన్ని చూసిన శివ, అంజమ్మ దంపతులు మంగళవారం చార్మినార్ పోలీసులను సంప్రదించారు. 2003లో తమ కుమారుడు ఆంజనేయులు తప్పిపోయినట్లు అప్పట్లో చార్మినార్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు (ఎఫ్ఐఆర్) కాపీని చూపడంతో పాటు బాలుడి చేతిపై ‘శ్రీ’ పచ్చబొట్టు గుర్తు ఉన్నట్లు చెప్పారు. ఆనవాళ్లన్నీ సరిగ్గా సరిపోవడంతో నిర్థారించుకొన్న పోలీసులు విషయాన్ని చెన్నైలోని స్కోప్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు. దీంతో ఆ సంస్థ డిప్యూటీ డెరైక్టర్ సత్తిబాబు ఈ నెల 11న ఆంజేయులును తీసుకొని హైదరాబాద్ వస్తున్నటు తెలిపారని చార్మినార్ ఇన్స్పెక్టర్ యాదగిరి వెల్లడించారు. -
జువైనల్ హోంలో విద్యార్థికి చిత్రహింసలు..
వరంగల్: జువైనల్ హోంలో హాస్టల్ డిప్యూటీ సూపరింటెండెంట్ దారుణానికి ఒడిగట్టాడు. విచక్షణ లేకుండా ఆరవ తరగతి చదువుతున్న అనిల్ అనే విద్యార్థిని హాస్టల్ డిప్యూటీ సూపరింటెండెంట్ సాల్వాకం చితకబాది చిత్రహింసలకు గురిచేశాడు. దాంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అనిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. లీగల్ మెట్రాలజీ అధికారిని ఎదుట హాస్టల్ ఆహారం విషయంపై ఫిర్యాదు చేయడమే విద్యార్థిని తీవ్రంగా హింసించడానికి కారణమని తెలిసింది. -
జువైనల్ హోం వార్డెన్ల సస్పెన్షన్
నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలోని జువైనల్ హోమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు వార్డెన్లు సస్పెండయ్యారు. వివరాలు.. జువైనల్ హోమ్ లోని నలుగురు బాల నేరస్తులు ఈనెల 2వ తేదీన పరారయ్యారు. వారు పారిపోయి నాలుగు రోజులైనా ఆచూకి లభించకపోవటంతో హోమ్ వార్డెన్లు నాగేంద్ర, ప్రభాకర్‌లను ఉన్నతాధికారులు గురువారం సస్పెండ్ చేశారు. -
రెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు...
ఏడాదిగా జువైనల్ హోంలో ఉంటున్న బాలుడు అనుమానంతో హోంకు వచ్చిన తండ్రి.. కనిపించిన కుమారుడు సైదాబాద్: రెండేళ్ల క్రితం తప్పిపోయాడనుకున్న బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయింది. పాతబస్తీలో పోలీసులు ఇటీవల చేపట్టిన కార్డన్ సర్చ్‌లో బాలకార్మికులు పట్టుబడిన విషయం తెలిసి ఓ బాలుడి తండ్రి తన కొడుకు వారిలో ఉన్నాడేమోనని సైదాబాద్‌లోని జువైనల్ హోంకు వచ్చాడు. అక్కడ తమ కుమారుడు కనిపించడంతో ఆనందభాష్పాలు రాల్చాడు. వివరాలు.. బీహార్‌కు చెందిన కాలురాం, శీలదేవి దంపతులు పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. కాటేదాన్‌లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లాలుబాబురాం(8) రెండేళ్ల క్రితం కాటేదాన్‌లోని తన ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు. కొడుకు కోసం స్థానికంగాను, బంధు,మిత్రుల ఇళ్లలోనూ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు (405/2013) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి నుంచి కుమారుడి ఆచూకీ కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. కాగా, తప్పిపోయిన వీరి కుమారుడు లాలుబాబురాం ప్రకాశజిల్లా ఒంగోలులో రోడ్లపై తిరుగుతుండగా అక్కడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు 2014లో సైదాబాద్‌లోని వీధి బాలుర సదనానికి తీసుకొచ్చి అప్పగించారు. అప్పటి నుంచి సైదాబాద్ బాలుర సదనంలోనే అతడు ఉంటున్నాడు. అయితే బీహార్‌కు చెందిన ఈ బాలుడి భాష అర్థం కాకపోవడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అతడి తల్లిదండ్రుల సమాచారం తెలుసుకోలేకపోయారు. -
ఎన్నో ఏళ్ల తర్వాత కన్నవారిని కలుసుకున్న చిన్నారులు
ఉద్వేగం..ఉద్విగ్నం కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు, పిల్లలు జువైనల్ హోంలో పలువురిని తల్లిదండ్రులకు అప్పగించిన అధికారులు సైదాబాద్: చెడు వ్యసనాలకు బానిసై ఇంటినుంచి పారిపోయి వచ్చిన వారు కొందరు...తల్లిదండ్రులు పనికి పంపిస్తున్నారని మరికొందరు..ఇంట్లో కొడుతున్నారని ఇంకొందరు.. ఇలా పలు కారణాలతో తల్లిదండ్రులకు దూరమై రైల్వే ఫ్లాట్‌ఫాంలపై జీవించి, చివరకు జువైనల్ హోంకు వచ్చిన బాలలు పలువురు బుధవారం తల్లిదండ్రుల చెంతకు చేరారు. ఎన్నో ఏళ్ల తరువాత పిల్లలను కలుసుకున్న తల్లిదండ్రులు ఉద్వేగానికిలోనై బోరున ఏడ్చేశారు. పిల్లలు సైతం ఏడుస్తూ తల్లిదండ్రులను చుట్టేశారు. ఈ భావోద్వేగ సంఘటనలు చూసి అధికారులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. సైదాబాద్‌లోని బాలల సదనంలో సాథీ, ఆశ్రీత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బుధవారం చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ సందర్భంగా సదనం నుంచి బయటకు వెళ్తున్న బాలలందరికీ ప్రముఖ వ్యాపారవేత్త శశికాంత్ అగర్వాల్ కొత్త దుస్తులు అందించారు. చెడుదారి పట్టిన తమను మార్చి, విద్యాబుద్ధులు చెప్పించిన బాలల సదనం అధికారుల మేలు ఎప్పటికీ మర్చి పోలేమని కొంతమంది చిన్నారులు రోదిస్తూ చెప్పారు. అనంతరం జరిగిన సమావేశంలో జువైనల్‌హోం డెరైక్టర్ వి. భాస్కరాచారి మాట్లాడుతూ మొత్తం 32 మంది బాలలను తల్లిదండ్రుల వద్దకు పంపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారి శ్రీనివాస్, చైల్డ్వెల్ఫేర్ కమిటీ మెంబర్ శ్యామలాదేవి, డిప్యూటీ డెరైక్టర్ కుమారస్వామి, డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస్, అశ్రీత సంస్థ డెరైక్టర్ నాగరాజు, సాథీ సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అవుతా: శివ మాది ఈసీఐఎల్ నాగారం. చిన్నప్పుడు మా మవయ్య కొట్టాడని ఇంట్లోంచి పారిపోయి రైల్వేస్టేషన్ చేరుకున్నాను. ఒక రోజు రైల్వే స్టేషన్లో షార్ట్‌సర్క్యూట్‌తో పెద్ద గాయం అయింది. దీంతో పోలీసులు సైదాబాద్ బాలల సదనంలో చేర్పించారు. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆరేళ్ల తర్వాత కన్నవారిని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను బాగా చదువకుని పోలీస్ అవుతా.