సైదాబాద్(హైదరాబాద్): రాష్ట్ర బాలుర సంస్కరణల, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సైదాబాద్‌లో కొనసాగుతున్న బాలుర పరిశీలన గృహం నుంచి ఓ బాలుడు తప్పించుకున్నాడు. ఈ సంఘటన గత ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం బూర్లపాడుకు చెందిన ఓ బాలుడు(16) ఘర్షణలో పాల్గొన్నందుకు గాను అక్కడి పోలీసులు సైదాబాద్ జువైనల్‌హోంకు అప్పగించారు.
కాగా, గత నెల 30న పరిశీలన గృహం బాలురు భోజనం చేయడానికి గాను ఆవరణలోకి వచ్చారు. ఆ సమయంలో అదను చూసుకుని సదరు బాలుడు అక్కడి గోడ దూకి పరారయ్యాడు. దీనిపై పరిశీలన గృహం సూపరింటెండెంట్ రామచంద్రమూర్తి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర బాలుర సంస్కరణల, సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు.
జువైనల్‌హోం నుంచి బాలుడు పరార్
Published Wed, Sep 2 2015 7:44 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement