జువనైల్ హోం నుంచి యువకుల పరారీ
Published Wed, Oct 26 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
సాక్షి దినపత్రిక వాహనం డ్రై వర్‌పై దౌర్జన్యం
పారిపోతూ పట్టుబడిన వైనం
మంగళగిరి : చిన్నతనంలోనే పలు నేరాలు చేసిన యువకులు జువనైల్ హోమ్ నుంచి తప్పించుకుని మళ్లీ నేరం చేసి పారిపోతూ పోలీసులకు పట్టుబడిన ఘటన ఇది. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జువనైల్ హోమ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు యువకులు మంగళవారం అర్ధరాత్రి హోం తాళాలు పగులకొట్టి తప్పించుకున్నారు. వారు గుంటూరులోనే ఒక ద్విచక్రవాహనాన్ని దొంగలించి దానిపై విజయవాడ బయలుదేరారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో వినుకొండ వెళుతున్న సాక్షి పత్రిక ఆటోను చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి వద్ద నిలిపి ఆటో డ్రై వర్‌పై దాడి చేసి అతడి వద్ద ఉన్న రూ. వెయ్యి నగదు, సెల్‌ఫోన్ తీసుకున్నా. ఫోన్‌లో సిమ్ తీసిపడేసి మళ్లీ గుంటూరు వైపు వెళ్లారు.ఇంతలో ఆటో డ్రై వర్‌కు తెలిసిన వ్యక్తి అటుగా రావడంతో ఇద్దరు కలిసి వారిని వెంబడించారు. పోలీసులు అభి భావించిన యువకులు గుంటూరు వెళ్లి ద్విచక్రవాహనం అక్కడ వదిలేశారు. మళ్లీ ఆటోలో విజయవాడ బయలుదేరారు. హోం నుంచి తప్పించుకున్న విషయాన్ని పోలీసులు సెట్ ద్వారా అన్ని పోలీస్‌స్టేషన్లకు తెలపడంతో అప్రమత్తమైన తాడేపల్లి పోలీసులు వారధి వద్ద ఆటోను ఆపగా ఐదుగురు యువకుల ప్రవర్తన అనుమానస్పదంగా ఉండడంతో స్టేషన్‌కు తరలించారు. ఆటోడ్రై వర్ తన్నీరు శ్రీనివాస్ మంగళగిరి రూరల్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఆటోడ్రై వర్‌పై దాడి చేసింది తాడేపల్లి పోలీసుల అదుపులో ఉన్న యువకులేనని గుర్తించి వారిని మంగళగిరి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement