youngers
-
బంగారాన్ని మించి.. ‘స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాం’
న్యూఢిల్లీ: ఒకవైపు మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నప్పటికీ.. మరోవైపు మెజారిటీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఏంజెల్ వన్‌కు చెందిన ‘ఫిన్‌వన్’ అధ్యయనంలో వెల్లడైంది.58 శాతం మంది స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే, 39 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌ను అనుసరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 13 పట్టణాలకు చెందిన 1,600 మంది యువతీ, యువకుల పెట్టుబడుల ప్రాధాన్యతలు, ఆర్థిక అక్షరాస్యత, టెక్నాలజీ, ఫైనాన్షియల్ టూల్స్ వినియోగాన్ని విశ్లేషించిన అనంతరం ఫిన్‌వన్ నివేదికను విడుదల చేసింది. » పొదుపునకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. 93 శాతం మంది తమ ఆదాయంలో ఎంతో కొంత ఆదా చేస్తుండగా, కొంత మంది 20–30 శాతం వరకు పొదుపు చేస్తున్నారు. » ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బంగారం కంటే స్టాక్స్‌లో పెట్టుబడులకే 45 శాతం మంది ప్రాధాన్యం చూపుతున్నారు. » పెట్టుబడికి అధిక భద్రత ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు 22 శాతం మంది, రికరింగ్ డిపాజిట్ల వైపు 26 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. » అధిక రాబడులతోపాటు స్థిరమైన రాబడులకూ యువత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇది తెలియజేస్తోందని ఈ నివేదిక పేర్కొంది. » యువతరం టెక్ సాయాన్ని తీసుకుంటోంది. 68 శాతం మంది ఆటోమేటెడ్ సేవింగ్ టూల్స్ వాడుతున్నారు. » 85 శాతం మంది పెరిగిపోయిన జీవన వ్యయం.. ముఖ్యంగా ఆహారం, యుటిలిటీలు, రవాణా వ్యయాలను ప్రస్తావించారు. -
48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది
సిమ్లా: ట్రెక్కింగ్‌లో భాగంగా పర్వతారోహణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువతీయువకుల జాడను కనిపెట్టడంతో వారి పెంపుడు శునకం ఎంతగానో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు అది అక్కడే ఉండి అరుస్తూ సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్‌లో ఈ ఘటన జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన 30 ఏళ్ల అభినందన్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ప్రణీత వాలా సోమవారం బిర్ బిల్లింగ్ వద్ద ట్రెక్కింగ్‌కు బయల్దేరారు. ట్రెక్కింగ్ చేసి తిరుగుపయనంలో కిందకు దిగి వస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. అపస్మారకస్థితిలో గంటలకొద్దీ సమయం మంచులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ వేళ వీరితోపాటు పెంపుడు శునకం వెంట వచి్చంది. వీరు పడిపోవడంతో గమనించి ఘటనాస్థలికి పరుగున వచ్చింది. 48 గంటలపాటు అక్కడే సాయం కోసం అరుస్తూ నిల్చుంది. గాలిస్తున్న సహాయక బృందాలు ఎట్టకేలకు వీరి జాడను గుర్తించాయి. ఆ ప్రాంతంలో జర్మన్ షెపర్డ్ జాతి శునకం ఒకటి ఆపకుండా అరుస్తుండటంతో అటుగా వెళ్లి వీరి జాడను కనిపెట్టగలిగామని సహాయక బృందం తెలిపింది. -
చీకటిపై రణం చేసిన... గెలుపు వ్యాకరణం
చిన్నవయసులోనే డిప్రెషన్ బారిన పడిన షర్మిన్ తల్లిదండ్రుల సహాయంతో ఆ చీకటి నుంచి బయటపడింది. ‘ఆట–మాట–పాట’లలో తన ప్రతిభ చూపింది. సృజనాత్మకతకు మెరుగులు దిద్దే ఏఐ–ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘ఇన్‌స్టోరీడ్’తో ఇన్స్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకుంది. ‘కస్టమర్స్ కొనుగోలు నిర్ణయాలు లాజిక్ మీద కాదు ఎమోషన్స్‌పై ఆధారపడి ఉంటాయి’ అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని ఏఐ–ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘ఇన్‌స్టోరీడ్’ను ప్రారంభించింది షర్మిన్ అలి. ఈ ప్లాట్‌ఫామ్ సోలోప్రెన్యూర్స్, ఫ్రీలాన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్, క్లయింట్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేసే ఏజెన్సీలకు బాగా ఉపయోగపడుతుంది. ‘కంటెంట్ రైటర్స్ కస్టమర్ మనసులోకి పరకాయప్రవేశం చేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది’ అంటున్న షర్మిన్ ‘ఇన్‌స్టోరీడ్’ ప్రారంభించడానికి ముందు ఎంతోమంది న్యూరో మార్కెటర్స్, న్యూరో సైంటిస్టులతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఏఐ పవర్డ్ టూల్‌ను రూపొందించడానికి పద్దెనిమిది నెలల కాలం పట్టింది.ఇంతకీ ఈ టూల్ చేసే పని ఏమిటి? మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు, మన కంటెంట్ మనకు బాగానే ఉంటుంది. ‘నిజంగా ఈ కంటెంట్ బాగుందా? మార్పు, చేర్పులు ఏమైనా చేయాలా?’ అనే సందేహం వచ్చినప్పుడు ఈ టూల్‌కు పనిచెప్పవచ్చు. ‘ఈ వాక్యం సరిగ్గా లేదు’ ‘ఈ పదానికి బదులు మరో పదం వాడితే బాగుంటుందేమో’ ‘ఇలాంటి హెడ్‌లైన్స్ చాలా వచ్చాయి. వేరే హెడ్‌లైన్‌కు ప్రయత్నించండి’ ‘టు మెనీ నెగెటివ్ వర్డ్స్. మీ భావం సరిగ్గా చేరడం లేదు’ ‘ఇందులో భాషా దోషాలు కనిపిస్తున్నాయి’.....ఇలాంటి సలహాలు ఎన్నో ఇస్తుంది ఈ ఏఐ టూల్. కొన్నిసార్లు అనుకోకుండా మనం రాసిన వాక్యం, ఎవరో రాసిన వాక్యంలా ఉండి కాపీ కొట్టారు అనే ముద్ర పడడానికి అవకాశం ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కూడా ‘ఇన్‌స్టోరీడ్’ టూల్ హెచ్చరించి వేరే వాక్యాలు రాసుకునేలా చేస్తుంది. ‘చాలామంది నన్ను అడిగే ప్రశ్న...మీ ప్లాట్‌ఫామ్ ద్వారా కాపీరైటర్స్ అవసరం లేకుండా చేయవచ్చా? అది అసాధ్యం అని చెబుతాను. మానవసృజనకు ప్రత్యామ్నాయం లేదు. మా ప్లాట్‌ఫామ్ సృజనకు మెరుగులు పెట్టి మరింత చక్కగా తీర్చిదిద్దేలా చేస్తుంది’ అంటోంది షర్మిన్. షర్మిన్ ‘ఇన్‌స్టోరీడ్’కు శ్రీకారం చుట్టినప్పుడు ‘ఇది సక్సెస్ అవుతుందా?’ అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే తన ప్రాజెక్ట్ మీద ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు షర్మిన్. ఆమె నమ్మకం నిజమైంది. బెంగళూరు కేంద్రంగా మొదలుపెట్టిన ‘ఇన్‌స్టోరీడ్’కు వేలాది మంది యూజర్స్ ఉన్నారు. ‘ఇన్‌స్టోరీడ్’కు ముందు అమెరికాలో డాటాసైన్స్, ఎనలటిక్స్ రంగాలలో పనిచేసింది షర్మిన్ పశ్చిమబెంగాల్లోని కూచ్ బెహార్లో పుట్టిన షర్మిన్ అహ్మదాబాద్‌లో పెరిగింది. ‘ఆడుతూ పాడుతూ పెరిగినదే అందమైన బాల్యం’ అంటుంటారు. అయితే షర్మిన్ మాత్రం చిన్న వయసులోనే డిప్రెషన్ బారిన పడింది. భూకంపం, వరదలు, మతకలహాలు....మొదలైన వాటి ప్రభావంతో కుంగుబాటు అనే చీకట్లోకి వెళ్లిపోయింది. రకరకాల ప్రయత్నాలు చేసి ఆ చీకటి నుంచి షర్మిన్ను బయటికి తీసుకువచ్చారు తల్లిదండ్రులు. అది మొదలు...ఆటలు, పాటలు, నృత్యాలలో చురుగ్గా పాల్గొనేది. ఇంజనీరింగ్ ఫైనలియర్లో ఉన్నప్పుడు ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ ఎలక్టివ్‌గా తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనేది తన కలగా మారింది. ‘ఇన్‌స్టోరీడ్’తో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గెలుపు జెండా ఎగరేసింది. ఎంటర్ప్రెన్యూర్గానే కాదు నటి, రచయిత్రి, మోటివేషనల్ స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది షర్మిన్ అలి. -
మరణంలోనూ వీడని స్నేహబంధం.. అందరూ యువకులే
సాక్షి, చెన్నై: తమతో చదువుకున్న సహచరుల్ని కలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి లగ్జరీ కారు లో చెన్నైకు వచ్చిన మిత్రులను రోడ్డు ప్రమాదం కబలించింది. వివరాలు.. ఆదివారం వేకువజామున శివారులోని పెరుంగళత్తూరులో ఆగి ఉన్న లారీని లగ్జరీ కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు మిత్రులు అక్కడికక్కడే మరణించారు. సేలం జిల్లా మేట్టూరుకు చెందిన నవీన్(23), రాజా హరీస్ (22), తిరుచ్చికి చెందిన అజయ్ (23), పుదుకోట్టైకు చెందిన రాహుల్(22) ఈ ఏడాది తురైపాక్కంలోని ఓ ప్రైవేటు వర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ ముగించారు. చెన్నైలో ఉన్న తమ మిత్రుల్ని కలుసుకోవాలని నవీన్ ఇటీవల నిర్ణయించాడు. రాజా, అజయ్, రాహుల్‌తో కలిసి లగ్జరీ కారులో శనివారం చెన్నైకు వచ్చాడు. వీరంతా కారపాక్కంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. పలువురు మిత్రుల్ని కలిశారు. టీ నగర్లో షాపింగ్ కూడా చేశారు. చెన్నైకు చెందిన మిత్రుడు అరవింద్ శంకర్‌ను తమ వెంట గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారు. అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో వారందరూ కలసి లగ్జరీ కారులో చెన్నై శివారుల్లో చక్కర్లు కొట్టేందుకు బయలుదేరారు. చదవండి: ‘వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి’ ఘటనా స్థలంలోనే.. వండలూరు నుంచి పెరుంగళత్తూరు వైపుగా కారులో స్నేహితులందరూ వేగంగా దూసుకొచ్చారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో జీఎస్టీ రోడ్డులోని ఐటీ కారిడార్ సమీపంలోకి రాగానే, కారు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఇనుము లోడుతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అతివేగంగా ఢీకొనడంతో క్షణాల్లో కారు పూర్తిగా ధ్వంసమైంది. తాంబరం, క్రోంపేట పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకుని ఉన్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అప్పటికే కారులో ఉన్న ఐదుగురు మరణించారు. దీంతో మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోం పేట జీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తీన్మార్ మల్లన్న కేసులో తెరపైకి మాజీ రౌడీషీటర్ -
యువకుల సాహసం.. వెంటనే చెరువులో దూకి..
సాక్షి, హైదరాబాద్ : కుటుంబంలో చిన్నపాటి గొడవలతో కొంత మంది విచక్షణ కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటన గురువారం దూలపల్లిలో చోటుచేసుకుంది. దూలపల్లి కమ్మరిబస్తీ గుడిసెల్లో ఉండే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకునేందుకు పక్కనే ఉన్న లింగయ్య చెరువులో దూకింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇద్దరు యువకులు వెంటనే చెరువులోకి దూకి మహిళను కాపాడికి ఒడ్డుకు తీసుకు వచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
డ్రగ్స్: వీరే టార్గెట్.. జాగ్రత్త తప్పనిసరి
గుంటూరు నగరానికి చెందిన రోహిత్ (పేరు మార్చాం) పదో తరగతి, ఇంటర్మీడియట్లో బాగా చదివేవాడు. స్కూల్, కాలేజీ టాపర్. ఇంటర్ పూర్తవ్వగానే ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ (బీటెక్)లో చేరాడు. మొదటి సంవత్సరం సెకండ్ క్టాస్లో పాసయ్యాడు. రెండో సంవత్సరం నుంచి బ్యాక్ లాగ్స్ మొదలయ్యాయి. ఉదయం కళశాలకు అని చెప్పి వెళ్లిన వాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. చదువుపై కూడా శ్రద్ధ తగ్గింది. కుటుంబ సభ్యులతో సరిగా మాట్లాడటం మానేశాడు. వారితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడు. ఒక రోజు గుంటూరు అర్బన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ నుంచి రోహిత్ తండ్రికి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడని పోలీసులు చెప్పారు. దీంతో రోహిత్ తల్లిదండ్రులు షాకయ్యారు. ఇది కేవలం ఒక్క రోహిత్ తల్లిదండ్రుల విషయంలోనే కాదు. మత్తు పదార్థాలకు బానిసలైన అనేక మంది విద్యార్థుల కుటుంబాలకు ఎదురైన ఘటన. సాక్షి, గుంటూరు: చదువు కోవాల్సిన వయసు పక్కదారి పడుతోంది. పుస్తకాల ఉండాల్సిన బ్యాగుల్లో మత్తు పదార్థాలు కనిపిస్తున్నాయి. జల్సాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తు చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. గుంటూరు నగరంలో కొందరు కాలేజీ యువకులు గంజాయితో పాటు మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారు. ఆ మత్తులో మునగడమే కాకుండా వాటి విక్రయాల్లోనూ కూరుకుపోతున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొస్తున్న మత్తు పదార్థాల మాఫియా వాటిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు యువతను పావులుగా వాడుతోంది. మాయమాటలు నమ్మి.. జిల్లాలో ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతర విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో కొందరు గంజాయి మత్తులో జోగుతున్నారు. అప్పటి వరకూ పాఠశాలలు, కాలేజీల్లో చదివి ఉన్నత విద్యాల కోసం యూనివర్సిటీలు, ఇతర కళాశాలల్లో చేరడం, అదో కొత్త కలల ప్రపంచంలా కనిపించే సరికి చెడు వ్యసనాలకు అలవాటుపడుతున్నారు. తెలిసీ తెలియని వయసులో కొందు కేటుగాళ్ల మాటలు నమ్మి తరగతులకు డుమ్మా కొట్టి సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ల టార్గెట్ వీళ్లే.. సంపన్న, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలను టార్గెట్ చేస్తూ గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుంటూరు, చిలకలూరిపేట, మంగళగిరి, తాడేపల్లి, నరసరావుపేట సహా పలు ప్రాంతాల్లోని ప్రైవేట్ కళాశాలలు, యూనివర్సిటీల వద్ద మకాం వేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల ముటా సభ్యులు మాటలు కలిపి విద్యార్థులతో స్నేహం చేస్తున్నారు. వారితో పరిచయాలు పెంచుకుని బర్త్‌డే, వీకెండ్ అంటూ నమ్మ బలికి పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. పార్టీలకు వచ్చిన విద్యార్థులను ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావ్ అంటూ మాయమాటలు చెప్పి మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు తీసుకునేలా ఉసుగొలుపుతున్నారు. అనంతరం వారిని గంజాయి రవాణా, ఇతరత్రా కార్యకలాపాల్లో పావులుగా వాడుకుంటున్నారు. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, సరఫరా చేస్తున్న వారిలో 50 శాతానికిపైగా ఇంజనీరింగ్ విద్యార్థులే ఉన్నట్టు పోలీస్, ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. విచ్చలవిడిగా లభ్యం.. గత కొద్ది రోజుల కిందట నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న విదేశీ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులతో సంబంధాలున్న గుంటూరు నగరానికి చెందిన ఓ హోటల్ యజమాని కుమారుడు, ఫిరంగిపురం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విదేశీ ముఠా సభ్యులను మత్తు పదార్థాలు జిల్లాకు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు. ఇక్కడ ఎవరెవరికీ విక్రయిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీయగా అధిక శాతం మంది బీటెక్, డిగ్రీ, ఇతర విద్యార్థులే వినియోగం, విక్రయం సాగిస్తున్నట్టు తేలింది. ఇదే తరహాలో అనేక ఘటనల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, వినియోగిస్తూ, సరఫరాచేస్తూ కాలేజీ విద్యా ర్థులు పట్టుబడ్డారు. గడిచిన రెండు నెలల్లో ఈ తర హా 18కేసులు నమోదయ్యాయి. విచ్చలవిడిగా రూ.100–200లకే గంజాయి సిగరెట్లు, ఇతర మ త్తు పదార్థాలు లభిస్తుండటంతో విద్యార్థులు వా టికి బానిసలుగా మారి పెడదోవపడుతున్నారు. తల్లిదండ్రులు గుర్తించాలి ► కాలేజీలకు వెళ్లిన పిల్లలు ఏ సమయానికి తిరిగి ఇంటికి వస్తున్నారు. పార్టీలు, పర్యటనలని తరచూ ఎక్కడికైనా వెళ్తున్నారా? అని గమనించాలి. ► బ్యాక్‌లాగ్స్ నమోదవుతున్నాయంటే అందుకు గల కారణాలను లోతుగా విశ్లేషించాలి. ► చదువుల్లో వెనుకబడుతున్నప్పుడు కళాశాలలోని లెక్చరర్లతో మాట్లాడాలి. ► ఎవరెవరితో తిరుగుతున్నారో ఓ కంట కనిపెట్టాలి. అవసరం ఉన్న మేరకే డబ్బు ఇవ్వాలి. ఇచ్చిన డబ్బు ఎందుకోసం ఖర్చుపెట్టారో ప్రశ్నించాలి. ► ముఖ్యంగా పిల్లలతో సన్నిహితంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వారి బాధలను, ఇబ్బందులను తెలుసుకుంటూ సలహాలు ఇస్తూ ప్రోత్సహించాలి. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు యువత చెడు వ్యసనాల బాట పట్టొద్దు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయేతలు వాళ్ల అవసరాలాకు వాడుకోవడం కోసం మీతో సన్నిహితంగా మెలుగుతారు. యవత దీన్ని గుర్తుంచుకోవాలి. మత్తుకు బానిసలుగా మారితే భవిష్యత్తు నాశనం అవుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిరంతర నిఘా ఉంచాలి. –పీహెచ్డీ రామకృష్ణ, గుంటూరు అర్బన్ ఎస్పీ -
స్పానిష్ అమ్మాయి.. అనంతపురం అబ్బాయి..!!
సాక్షి, తాడిపత్రి టౌన్: స్పెయిన్ యువతి, అనంతపురం జిల్లా తాడిపత్రి యువకుడు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రికి చెందిన విజయకుమార్ వృత్తిరీత్యా వైద్యుడు. బత్తలపల్లిలోని ఆర్టీటీ ఆస్పుత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. స్పెయిన్ దేశానికి చెందిన కార్లా అనే యువతి వృత్తి రీత్యా దంత వైద్య నిపుణురాలు. ఈమె కూడా ఆర్డీటీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత ఇరువురూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి వారి పెద్దలతో చర్చించారు. ఇరువైపుల నుంచి అంగీకారం లభించడంతో శనివారం తాడిపత్రి పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో వీరి వివాహం హిందూ సంప్రదాయంలో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు వధూవరులను ఆశీర్వదించారు. -
డబ్బులు డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా..
హైద్రాబాద్ : విద్యార్థి సంఘ నాయకులం అని చెప్పి రామంతపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్ చేసిన యువకులు కటకటాలపాలయ్యారు. వటపల్లి రాజేష్, అజరుద్దీన్, ప్రసాద్ అనే వ్యక్తులు కళాశాల యాజమాన్యాన్ని రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న అంబర్పేట్ పోలీసులు ఈ ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
జువనైల్ హోం నుంచి యువకుల పరారీ
సాక్షి దినపత్రిక వాహనం డ్రై వర్‌పై దౌర్జన్యం పారిపోతూ పట్టుబడిన వైనం మంగళగిరి : చిన్నతనంలోనే పలు నేరాలు చేసిన యువకులు జువనైల్ హోమ్ నుంచి తప్పించుకుని మళ్లీ నేరం చేసి పారిపోతూ పోలీసులకు పట్టుబడిన ఘటన ఇది. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జువనైల్ హోమ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు యువకులు మంగళవారం అర్ధరాత్రి హోం తాళాలు పగులకొట్టి తప్పించుకున్నారు. వారు గుంటూరులోనే ఒక ద్విచక్రవాహనాన్ని దొంగలించి దానిపై విజయవాడ బయలుదేరారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో వినుకొండ వెళుతున్న సాక్షి పత్రిక ఆటోను చినకాకాని ఎన్ఆర్ఐ ఆస్పత్రి వద్ద నిలిపి ఆటో డ్రై వర్‌పై దాడి చేసి అతడి వద్ద ఉన్న రూ. వెయ్యి నగదు, సెల్‌ఫోన్ తీసుకున్నా. ఫోన్లో సిమ్ తీసిపడేసి మళ్లీ గుంటూరు వైపు వెళ్లారు.ఇంతలో ఆటో డ్రై వర్కు తెలిసిన వ్యక్తి అటుగా రావడంతో ఇద్దరు కలిసి వారిని వెంబడించారు. పోలీసులు అభి భావించిన యువకులు గుంటూరు వెళ్లి ద్విచక్రవాహనం అక్కడ వదిలేశారు. మళ్లీ ఆటోలో విజయవాడ బయలుదేరారు. హోం నుంచి తప్పించుకున్న విషయాన్ని పోలీసులు సెట్ ద్వారా అన్ని పోలీస్స్టేషన్లకు తెలపడంతో అప్రమత్తమైన తాడేపల్లి పోలీసులు వారధి వద్ద ఆటోను ఆపగా ఐదుగురు యువకుల ప్రవర్తన అనుమానస్పదంగా ఉండడంతో స్టేషన్‌కు తరలించారు. ఆటోడ్రై వర్ తన్నీరు శ్రీనివాస్ మంగళగిరి రూరల్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఆటోడ్రై వర్‌పై దాడి చేసింది తాడేపల్లి పోలీసుల అదుపులో ఉన్న యువకులేనని గుర్తించి వారిని మంగళగిరి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
19న టీపీఎల్ సన్నాహక క్రికెట్ మ్యాచ్
పలువురు సెలబ్రెటీస్ హాజరు ఆదిలాబాద్ టైగర్స్ ఫ్రాంచైజీ వెంకటేశ్ శ్రీరాంపూర్ : తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) పోటీలకు జిల్లా జట్టును సన్నద్ధం చేయడానికి ఈ నెల 19న సన్నాహక క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ టైగర్స్ జట్టు ఫ్రాంచైజీ బి.వెంకటేశ్ తెలిపారు. మంగళవారం ఆయన శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ క్రీడాకారులను వెలికితీయడానికి ఐపీఎల్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో టీపీఎల్ ఏర్పడిందన్నారు. ఫిబ్రవరి నెలలో మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తయ్యిందన్నారు. రెండో సీజన్ టోర్నీ అక్టోబర్‌లో ఉండబోతున్నట్లు తెలిపారు. మొదటి సీజన్లో జిల్లా జట్టు రెండు లీగ్ మ్యాచ్‌లో పాల్గొందని, ఇందులో ఫెయిర్ ఫ్లే అవార్డును గెలుచుకొందన్నారు. సీజన్ 2 కోసం సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు. దీని కోసం క్రీడాకారులకు ఆటపై అవగాహన పెంచడం, లీగ్‌లో మరింత రాణించడం కోసం సెలబ్రెటీస్‌తో ప్రత్యేక మ్యాచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19న సైబర్ సిటీ చాంప్స్ వర్సెస్ ఆదిలాబాద్ టైగర్స్ మధ్య సన్నాహక మ్యాచ్ జరుగనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాబుఖాన్ మైదానంలో ఈ పోటీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి నగర కమిషనర్ సీపీ ఆనంద్, సినీ హీరోశ్రీకాంత్, టీవీ ఆరిస్టులు ప్రభాకర్, ఓంకార్‌తో పాటు జిల్లా ఎమ్మెల్సీ పురాణంసతీశ్, స్కేటింగ్ వరల్డ్ చాంపియన్, అర్జున అవార్డు గ్రహీత అనుప్‌కుమార్ యామిలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సన్నాహక మ్యాచ్‌ను లైవ్ ద్వారా కూడా చూసే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా జట్టు మేనేజర్ ముత్యం వెంకటస్వామి, అడ్వైజర్ రేగళ్ల ఉపేందర్‌లు పాల్గొన్నారు.