స్పానిష్‌ అమ్మాయి.. అనంతపురం అబ్బాయి..!! | Spanish Woman A Young Man From Anantapur Fell In Love Got Married | Sakshi
Sakshi News home page

స్పానిష్‌ అమ్మాయి.. అనంతపురం అబ్బాయి..!!

Published Sat, Nov 23 2019 7:39 AM | Last Updated on Sat, Nov 23 2019 7:45 AM

Spanish Woman A Young Man From Anantapur Fell In Love Got Married - Sakshi

పెళ్లి చేసుకుంటున్న తాడిపత్రి యువకుడు, స్పెయిన్‌ యువతి

సాక్షి, తాడిపత్రి టౌన్‌: స్పెయిన్‌ యువతి, అనంతపురం జిల్లా తాడిపత్రి యువకుడు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రికి చెందిన విజయకుమార్‌ వృత్తిరీత్యా వైద్యుడు. బత్తలపల్లిలోని ఆర్టీటీ ఆస్పుత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. స్పెయిన్‌ దేశానికి చెందిన కార్లా అనే యువతి వృత్తి రీత్యా దంత వైద్య నిపుణురాలు. ఈమె కూడా ఆర్డీటీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత ఇరువురూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి వారి పెద్దలతో చర్చించారు. ఇరువైపుల నుంచి అంగీకారం లభించడంతో శనివారం తాడిపత్రి పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో వీరి వివాహం హిందూ సంప్రదాయంలో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు వధూవరులను ఆశీర్వదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement