మీ ఇంట్లో మహిళల్ని అంటే ఊరుకుంటారా? | Vidadala Rajini Fires On Chandrababu Over His Allegations On Her | Sakshi
Sakshi News home page

దమ్ముంటే నా సవాల్‌ స్వీకరించండి: రజిని

Published Fri, Oct 4 2019 8:15 PM | Last Updated on Fri, Oct 4 2019 8:43 PM

Vidadala Rajini Fires On Chandrababu Over His Allegations On Her - Sakshi

ఏదో ఒకరకంగా తనపై నిందలు మోపాలనే యోచనతో.. కోటిని పోలీసులు కొడుతుంటే నేను వీడియో కాల్‌లో చూశాననడం దారుణమని రజిని ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్షి, గుంటూరు : చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు గోబెల్స్‌ను మించిపోయాయని చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి.. కనీస వాస్తవాలు తెలుసుకోకుండా బీసీ మహిళనైన తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారమిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ... సోషల్‌ మీడియాలో కోటి అనే వ్యక్తి తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని తెలిపారు. దీంతో తమ కార్యకర్తలు అతడిపై కేసు పెట్టారని.. ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. అయితే కోటి అరెస్టుతో చంద్రబాబుకు బాధ కలుగుతోందని.. అందుకే ఆయన కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

మీరైతే ఊరుకుంటారా బాబూ?
మీ ఇంట్లో మహిళపై కూడా ఇలా దుష్ప్రచారం చేస్తే మీరు ఊరుకుంటారా అని విడదల రజిని చంద్రబాబును ప్రశ్నించారు. ఏదో ఒకరకంగా తనపై నిందలు మోపాలనే యోచనతో.. కోటిని పోలీసులు కొడుతుంటే నేను వీడియో కాల్‌లో చూశాననడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ప్రత్తిపాటి పుల్లారావులు ఈ ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పేర్కొన్నారు. అలా జరగని పక్షంలో చంద్రబాబు, పుల్లారావు రాజకీయాల నుంచి తప్పుకొంటారా అని సవాల్‌ విసిరారు. వారిద్దరికీ దమ్ముంటే తన సవాల్‌ స్వీకరించాలని రజిని పేర్కొన్నారు.(చదవండి : చంద్రబాబుకు విడదల రజనీ సవాల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement