సాక్షి,పల్నాడు జిల్లా : అధికారం శాశ్వతం కాదు. గుర్తుంచుకోండి అని మాజీ మంత్రి విడుదల రజిని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావు పేట జైల్లో ఉన్న వైఎస్సార్ సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డిని పరామర్శించారు. అనంతరం విడదల రజిని మీడియాతో మాట్లాడారు.
‘వైఎస్సార్‌సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తే ఆయనపై అక్రమ కేసులు పెట్టారు. నరసరావుపేట జైలుకు పంపారు. కోటిరెడ్డికి 75 ఏళ్లు. సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్తే ఆ అధికారులను కోటిరెడ్డి కొట్టినట్టు, కులం పేరుతో దూషించినట్లు అక్రమ కేసులు బనాయించారు.
ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే కోటిరెడ్డిపై కేసులు పెట్టారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అది ఖచ్చితంగా రాజకీయ నాయకులు, పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. వైఎస్సార్‌సీపీ నేతలు ఓ పథకం ప్రకారం జైలుకు పంపుతున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి. రోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఆనవాళ్లు దొరకడం లేదు. పోలీసులు మహిళలపై జరుగుతున్న దాడులపై దృష్టి పెట్టకుండా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దృష్టి పెట్టారు’ అని విడదల రజిని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment