వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాం శంకుస్థాపన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణీత సమయానికి రాకపోవడం.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గోదాం ప్రాంగణంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.