Baton charge
-
పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్!
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. వేతనాల పెంపు సహా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో వారితో గొడవకు దిగారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పాయి. కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ముందుగా పాటియాలా బైపాస్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి సంగ్రూర్‌లోని సీఎం భగవంత్ మాన్ ఇంటి వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయటంతో పలువురికి గాయాలయ్యాయి. #WATCH | Punjab Police lathi-charged Mazdoor Union people who were marching towards CM Bhagwant Mann's residence in Sangrur regarding their various demands pic.twitter.com/MkpxdNSNQf — ANI (@ANI) November 30, 2022 ఇదీ చదవండి: ‘కేజ్రీవాల్ సర్ మీ మఫ్లర్ ఏది?’.. ఢిల్లీ సీఎంకు ఎదురైన వింత ప్రశ్న -
లంక విద్యార్ధులపై విరిగిన లాఠీ
కొలంబో: ఆర్థికంగా అధ్వాన్న స్థితికి చేరుకున్న లంకలో సామాజిక పరిస్థితులు కూడా కట్టు తప్పుతున్నాయి. ప్రజాగ్రహాన్ని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం దమనకాండకు దిగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై నిరసనకు దిగిన వర్సిటీ విద్యార్ధులపై ఆదివారం పోలీసులు లాఠీ చార్జ్, బాష్పవాయు ప్రయోగం చేశారు. ఆల్‌పార్టీ ప్రభు త్వం ఏర్పాటుకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం ప్రభుత్వ ఆజ్ఞలు లెక్కచేయని ప్రతిపక్ష సమగి జన బలవెగయ పార్టీ కొలంబోలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. లంకలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ప్రతిపక్ష నేత హర్ష డిసిల్వా ప్రకటించారు. నిరసనలో భాగంగా కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్దకు ప్రతిపక్షాలు లాంగ్‌మార్చ్ నిర్వహించాయి. దేశ పశ్చిమ ప్రాంతంలో పోలీసులు కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనకు 664మందిని అరెస్టు చేశారు. ప్రజాహక్కుల పరిరక్షణకే నిరసనలని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస చెప్పారు. ప్రతిపక్షాలకు మద్దతుగా పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆన్లైన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆల్‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ పరిష్కారాన్ని వెతకాలని మాజీ మంత్రి విమల వీరవంశ సూచించారు. ఈ సూచనపై అధ్యక్షుడు, ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు గుప్పిట్లో ఉంచుకున్నారని, వీరికి ప్రజల్లో మద్దతు పోయిందని మాజీ క్రికెటర్ మహెళ జయవర్ధనే విమర్శించారు. వీరంతా వెంటనే గద్దె దిగాలన్నారు. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో క్రీడలు, యువజన మంత్రి పదవికి నమల్ రాజపక్సా రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. సోషల్ మీడియాపై నిషేధం, ఎత్తివేత ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించిన శ్రీలంక.. తిరిగి 15 గంటల్లోనే ఎత్తివేసింది. 36 గంటల కర్ఫ్యూలో భాగంగా సోషల్ మీడియాపై శనివారం రాత్రి నిషేధం విధించింది. దీన్ని మంత్రులు వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గింది. కిలో బియ్యం రూ.220! శ్రీలంకలో ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఇంధనం, నిత్యావసరాల కోసం జనం భారీగా క్యూ కడుతున్నారు. అయినా ఏ కొందరికో సరుకులు లభిస్తున్నాయి. సూపర్మార్కెట్లలో కిలో బియ్యం రూ. 220, గోధుమలు రూ.190, పంచదార రూ.240, పాల పౌడర్ రూ.1900 చేరడంతో లీటర్ కొబ్బరి నూనె రూ. 850, గుడ్డు రూ.30 పలుకుతున్నాయి. -
మానని గాయం..అదో చీకటిరోజు
వారికి అదో చీకటి రోజు.. వందలాది మంది పోలీసులు ఆ గ్రామాలను చుట్టుముట్టి.. పిల్లా జెల్లా, ముసలి ముతక అని కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. తమ లాఠీలతో అమానుషంగా వ్యవహరించారు. వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణంలో సర్వం త్యాగం చేసిన 18 గ్రామాల నిర్వాసితుల పట్ల నాటి టీడీపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిన తీరు ఇది. ఈ ఘటన జరిగి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ ఇదో మానని గాయంగా నిలిచింది. హిరమండలం/ఎల్.ఎన్.పేట: వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణంలో హిరమండలం, కొత్తూరు మండలాల్లో 18 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞంలో భాగంగా వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయనపై ఉన్న నమ్మకంతో అప్పట్లో నిర్వాసితులు సైతం తమ భూములు ఇచ్చేందుకు, గ్రామాలను ఖాళీ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ మహానేత ఆకస్మిక మరణంతో వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల కర్కశంగా వ్యవహరించింది. ప్యాకేజీ, పరిహారం విషయంలో తీరని అన్యాయం చేసింది. నిజమైన నిర్వాసితులకు కాకుండా తమ పార్టీ చోటా నేతలకు పెద్దపీట వేసింది. కోట్లాది రూపాయలు ప్యాకేజీ, పరిహారం కోసం మంజూరు చేసినట్టు చెప్పుకొచ్చారు. అదే సమయంలో గ్రామాలను ఖాళీ చేయాలని, పొలాల్లో పంటలు పండించవద్దని హుకుం జారీ చేసింది. ఇంకా సమస్యలు పరిష్కరించలేదని, అంతవరకూ పంటలు పండించుకుంటామని నిర్వాసిత గ్రామాల ప్రజలు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో 2017 ఆగస్టు 17న దమ్ములకు సిద్ధమవుతున్న రైతులపై నాటి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు దాడులు చేశారు. వందలాది మంది మోహరించడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. అండగా నిలిచిన గ్రామ ప్రతినిధులపై కేసులు అక్రమంగా బనాయించారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి నాటి టీడీపీ ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టారు. నిర్వాసితులకు అండగా నిలిచారు. ఇప్పటికీ మరువలేకున్నాం నాటి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరిగాయి. వందలాది మంది పోలీసులు గ్రామాల్లో మహిళలు, పిల్లలని చూడకుండా దాడికి తెగబడ్డారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంది. అప్పట్లో జగన్మోహన్రెడ్డి నిర్వాసితులకు అండగా నిలిచారు. అందుకే వైఎస్సార్సీపీకి రుణపడి ఉంటారు. – గొర్లె మోహన్‌రావు, నిర్వాసితుడు, పాడలి అదో చీకటి రోజు నాటి టీడీపీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల కర్కశంగా వ్యవహరించింది. పంట పండించుకుంటామని చెప్పినా వినలేదు. రిజర్వాయర్ నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన వారిపై అమానుషంగా వ్యవహరించింది. పచ్చని పంట పొలాలను ధ్వంసం చేసింది. రక్తపాతం సృష్టించింది. నియోజకవర్గ, జిల్లా పెద్దలు కనీసం పరామర్శకు రాలేదు. ఈ విషయాన్ని ఎప్పటికీ మరువలేరు. – జీ తిరుపతిరావు, నిర్వాసితుడు, పాడలి -
రోడ్లపై వస్తే లాఠీ దెబ్బలు
-
జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జి
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపునకు నిరసనగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ వర్సిటీ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఆయిషీ ఘోష్ సహా దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఫీజులు తగ్గించాలన్న డిమాండ్‌తో జేఎన్‌యూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో నినాదాలు చేసుకుంటూ ముందుకుసాగారు. పార్లమెంటు భవనం వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు సఫ్దర్‌గంజ్ సమాధి వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమీపంలో ఉన్న మూడు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. నెల్సన్ మండేలా మార్గ్, అరబిందోమార్గ్, బాబా గంగానాథ్ మార్గ్‌లలో పలు ఆంక్షలు విధించారు. విద్యార్థుల ఆందోళనలతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, పోలీసుల తీరుపై విద్యార్థులు విరుచుకుపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థుల చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఎమర్జెన్సీ ఇన్ జేఎన్‌యూ’పేరుతో ట్యాగ్ చేశారు. ఈ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. త్రిసభ్య కమిటీ ఏర్పాటు.. జేఎన్‌యూలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటుచేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ కమిటీలో యూజీసీ మాజీ చైర్మన్ వీఎస్ చౌహాన్, ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధ, యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీకి యూజీసీ సహకారం అందించనుంది. -
లాఠీచార్జిపై నేతల ధ్వజం
ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం ఆగస్టు 1 నుంచి మేధావులతో చర్చా వేదికలు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్ గజ్వేల్ రూరల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములను కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జీలు చేస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భూనిర్వాసితుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్ ఆరోపించారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని ఆర్అండ్బీ అతిధిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు హరీష్‌రావు ఏజెంట్లలా తయారయ్యారన్నారని ఆరోపించారు. తాము సిద్దిపేట సబ్జైల్లో ఉన్న మల్లేష్‌ను పలుకరించడం జరిగిందని.. అతన్ని హైదరాబాద్‌లో అరెస్టు చేసి గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు పేర్కొనడం సమంజసం కాదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులను పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం బ్రిటీష్ కాలంలో జలియన్‌వాలా బాగ్ ఉద్యమాన్ని తలపిస్తుందన్నారు. ప్రజాస్వామ్య పాలనలో హరీష్‌రావు హిట్లర్ వారసత్వం పుణికిపుచ్చుకున్నట్లు ప్రజాపోరాటాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ముంపు బాధిత రైతులంతా స్వచ్ఛందంగా ప్రాజెక్టు నిర్మాణానికి భూములిస్తున్నారని గోబెల్ ప్రచారం నిర్వహిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా 30 శాతానికి మించి రైతులు భూములివ్వలేదన్నారు. బ్రిటీష్ కాలంలో అభివృద్ధి పేరుతో దోచుకోగా... నేడు అభివృద్ధి పేరుతో భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు. ‘మల్లన్నసాగర్’ ప్రాజెక్టుకు హరీష్‌రావే కథానాయకుడని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని... ప్రజలకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. ముంపు గ్రామాల్లో స్వచ్ఛందంగా భూములిస్తున్నట్లు వారిచే చెప్పిస్తే తాము దేనికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. 123 జీవో వచ్చి నేటికి సరిగ్గా ఏడాది గడిచిందని. ఈ జీవోతో ఎటువంటి ప్రయోజనం చేకూరదన్నారు. భూములు తీసుకున్న వారికి ఏ ఒక్క కుటుంబానికైనా రూ. 5లక్షల ఉపాధి పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. 123 జీవోకు వ్యతిరేకంగా 150 కేంద్రాలలో నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. 2013 చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మల్లన్న బాధితులను పరామర్శించేందుకు వస్తున్న లాయర్లపై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఆగస్టు 1 నుంచి భూనిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేధావులచే చర్చా వేదికలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌రెడ్డి, నాయకులు సాగర్, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులున్నారు. -
పోరు సాగర్
మల్లన్నసాగర్‌పై అనుకూల, ప్రతికూల పోరాటాలు కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్ట్ట్ల రీడిజై¯ŒS పరామర్శకు వెళ్తుంటే అరెస్టులా?æ 2013 జీఓ ప్రకారమే పరిహారం చెల్లించాలి: కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టు పోలీసుల కళ్లుగప్పి గజ్వేల్‌లో ప్రత్యక్షమైన డీకే అరుణ, దామోదర్, సబితారెడ్డి మల్లన్నసాగర్ రాజెక్టు అనుకూల వ్యతిరేక పోరుతో మెతుకుసీమ అట్టుడికింది. లాఠీచార్జిలో గాయపడిన ‘ముంపు’వాసులను పరామర్శించేం దుకు కాంగ్రెస్ చేపట్టిన ‘చలో మల్లన్నసాగర్’ను పోలీసులు భగ్నం చేయగా.. అదే సమయంలో మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తిచేసి రైతు ఆత్మహత్యలను నివారించాలంటూ టీఆర్ఎస్, అనుబంధ రైతు సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. దీంతో పోలీసులు పరుగులు పెట్టారు. బయటి వ్యక్తుల వల్లే ముంపు గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పోలీసులు బయటి వ్యక్తులను, నేతలను అటువైపు వెళ్లకుండా కట్టడి చేశారు. పోలీసుల్ని ఛేదించుకుని వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ‘చలో మల్లన్నసాగర్’ భగ్నం.. పోలీసు లాఠీచార్జిలో గాయపడిన ముంపు బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో మల్లన్నసాగర్ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా పోలీసులు భగ్నం చేశారు. నేతలు ముంపు గ్రామాలకు చేరుకోకుండా కట్టడి చేశారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ముందస్తుగానే అరెస్టు చేసి పోలీసుస్టేçÙన్లలో నిర్బంధించారు. రెండవ రోజు కూడా పోలీసులు రాజీవ్ రహదారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే నేతలు ఇదే దారి గుండా వస్తారనే ఆలోచనతో పోలీసులు రహదారిపై చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పంపించారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా్ల శామీర్‌పేట, మెదక్ జిల్లా ములుగు మండలం వంటిమామిడి శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షించారు. డీఐజీ అకున్ సబర్వాల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ చెక్‌పోస్టులను సందర్శించారు. నిన్నటి అనుభవంతో కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, సబితాఇంద్రారెడ్డి, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు అద్దంకి దయాకర్, వేణుగోపాల్‌రావు తదితరులు హైదరాబాద్ నుంచి పోలీసులకు చిక్కకుండా ‘రింగ్’ రోడ్డు మీదుగా...పోలీసు చెక్పోస్టుల్లేని గ్రామాల గుండా గూగుల్ వ్యపు సాయంతో వర్గల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి సంగాపూర్ పాలిటెక్నిక్ కళాశాల మీదుగా గజ్వేల్ పట్టణంలోకి ప్రవేశించారు. పిడిచెడ్ రోడ్డు మార్గంలో ‘ముంపు’ గ్రామాలైన వేములగాట్, కొండపాక మండలం ఎరవ్రల్లికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. పసిగట్టిన పోలీసులు పిడిచెడ్ మార్గంలోని కేసరి హనుమాన్ ఆలయం సమీపంలో అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులకు, నేతలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో నేతలు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. అయినా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని చేగుంట పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. కాగా, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కుకునూర్‌పల్లి వద్ద అటకాయించిన పోలీసులు.. నల్లగొండ జిల్లా తుర్కపల్లి ఠాణాకు తరలించారు. పోలీసు వలయంలోనే ముంపు గ్రామాలు 9 ముంపు గ్రామాలు ఇంకా పోలీసుల గుప్పిట్లోనే ఉన్నాయి. గ్రామస్తులు బయటికి పోకుండా...బయటి వ్యక్తులు ఊర్లోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బయటి వ్యక్తులు గ్రామాల్లోకి రావడం వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు చేగుంట: కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టులు రీడిజై¯ŒS చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ వెళ్తున్న ఆయనను పోలీసులు అరెస్టు చేసి చేగుంట ఠాణాకు తరలించారు. అక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతులను సీఎం కేసీఆర్ మో సం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తడ్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రతిపాదించిందని గుర్తుచేశారు. కాగా, 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మంచ తలపెట్టిన రిజర్వాయర్‌ను 50 టీఎంసీలకు పెంచడం వెనుక కమీషన్ల వ్యవహారం ఉందని చెప్పారు. మల్ల న్నసాగర్ ప్రాజెక్టు రద్దు కోసం ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. 27 ఏళ్ల తన రాజకీయ జీవితం లో ఇలాంటి సీఎంను ఎన్నడూ చూడలేదన్నారు. స మావేశంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యేలు అనిల్, ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, అనంతసాగర్ మాజీ సర్పంచ్ అంజయ్య, సుప్రభాత్రావ్, రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, కనకయ్యతో పాటు పలువురు ఉన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాకంటక చర్యల్ని దేశమంతా గమనిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. మల్లన్నసాగర్ లాఠీచార్జి బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. గాంధీభవ¯ŒS నుంచి వెంబడించారు మల్లన్నసాగర్ బాధిత రైతులను పరామర్శించడానికి వెళ్తున్న తమను గాంధీభవ¯ŒS నుంచి పోలీసులు వెంబడించారని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రైతులపై లాఠీచార్జీ చేయడంతో మరోసారి దొరల పాలన గుర్తొంచ్చిందన్నారు. మల్లన్నసాగర్ బాధితులకు 2013 జీఓ ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పొన్నాల లక్ష్మయ్య అరెస్టు జగదేవ్‌పూర్: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు మద్దతు తెలపడానికి మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లికి వస్తున్న క్రమంలో కుకునూర్‌పల్లి వద్ద సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ ఆరెస్టు చేసి నల్లగొండ జిల్లా తుర్కపల్లి పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కొందరు నాయకులు కొంతసేపు ఆందోళన చేశారు. -
‘మల్లన్నసాగర్’ నిర్మించాల్సిందే..
సిద్దిపేట, జోగిపేటలో అనుకూల ర్యాలీలు సిద్దిపేట జోన్/జోగిపేట: జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం బంద్ జరిగితే, సిద్దిపేట, జోగిపేటలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలంటూ అనుకూల ర్యాలీలు జరిగాయి. జోగిపేటలో మండల టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీకాంతరావు తదితరు ఆధ్వర్యంలో ర్యాలీ జరగగా.. సిద్దిపేటలో మల్లన్నసాగర్‌ను నిర్మించాలని, ప్రతి పక్షాల బంద్‌ను పట్టణ ప్రజలు తిరస్కరించాలని కోరుతూ పట్టణ టీఆర్ఎస్ కౌన్సిలర్ల అధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, వెంకట్‌గౌడ్, చిప్ప ప్రభాకర్, ప్రవీణ్, గ్యాదరీ రవీందర్, దీప్తి నాగరాజు, స్వప్నబ్రహ్మం, నర్సింలు,ఉమారాణి,ఐలయ్య, లలిత రామన్నతో పాటు పలువురు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే అవకాశముందని వారు పేర్కొన్నారు. -
రైతులపై లాఠీ చార్జీ దుర్మార్గపు చర్య
రైతుల భూములను లాక్కుంటారా ఇదేనా బంగారు తెలంగాణ అంటే ఇదేనా సమస్యలు పరిష్కరించని చేతగాని ప్రభుత్వం రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ అండగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావ్ టేక్మాల్ఃరైతులపై లాఠీ చార్జీచేయడం ఎంతో దుర్మార్గపు చర్యయని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సోమవారం టేక్మాల్ ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ... మల్లన్నసాగర్ నిర్మాణమంటూ కడునిరుపేద రైతుల భూములను లాక్కోవడం సమంజసం కాదన్నారు. అడ్డుగా వస్తున్నా రైతులపై ఆడ, మగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా విచక్షణ రహితంగా అధికార అహంతో పోలీసులతో దైర్జన్యంగా కొట్టించడం ఎంటని ప్రశ్నీంచారు. వైఎస్ఆర్ హయంలో రైతులకు ఉచిత కరెంట్ రైతే రాజుగా పలు సంక్షేమ పథకాలను అందించి వారి అభివృద్యేద్యేయంగా పని చేశారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటునూ రైతుల పొట్టగొడుతూ, వారిపై దాడులు చేయిస్తుందని, వారి ఆత్మహత్యలకు కారణమవుతుందని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలు తీర్చచేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రైతుల మూడెకరాల భూమని అందిస్తామి, డబుల్ బెడ్రూం పలు రకాల సంక్షేమ పథకాల పేర్లను చెబుతూ కాలయాపన చేస్తున్నారేతప్పా ఎవరికి సంక్షేమ పథకాలు అందిచడంలేదని ఆరోపించారు. రైతు రుణమాఫీయంటూ ఇప్పటికి దిక్కులేదన్నారు. రైతు భూములను లాక్కుంటూ వారిపై లాటీ చార్జ్ చేయిస్తూ రైతుల పొట్టగొడుతున్న ఘతన కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని దుయ్యబుట్టారు. ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. వారి పక్షాన ప్రభుత్వ వ్యతిరేఖ ఉద్యమాలను చేపట్టెందుకు సిద్దంగా ఉందని హెచ్చరించారు. మల్లన్న సాగర్ ఘటన మళ్లి ఎక్కడ కూడా పున్రావృతం అయితే సహించేదిలేదన్నారు. -
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజీవ్ రహదారిపై నిరసన తెలపడానికి వెళ్తున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకోవడంతో మహిళలు వాగ్వాదానికి దిగారు. దీంతో మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. కొంత మంది మహిళలను బూటు కాళ్లతో తంతూ పోలీసులు లాక్కెళ్లారు. తీవ్రగాయాలపాలైన మహిళలను ఆసుపత్రికి తరలించారు. నిరసన తెలపడానికి వచ్చిన కొంతమందిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అగ్రికల్చర్ వర్సిటీలో ఉద్రిక్తత
- మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి నిర్బంధం హైదరాబాద్ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాక సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. మంత్రిని విద్యార్థులు నిర్బంధించటంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న ఒక కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. జీవో నంబర్ 45ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, పశువైద్య అధికారుల పోస్టులను డిపార్టుమెంటల్ పరీక్షల ద్వారానే ఎంపిక చేయాలంటూ విద్యార్థులు మంత్రిని సమావేశ మందిరంలో నిర్భంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జి చేసి, విద్యార్థులను చెదరగొట్టారు. దాదాపు రెండు గంటలపాటు విద్యార్థుల నిర్బంధంలోనే మంత్రి గడపాల్సి వచ్చింది. పోలీసుల రక్షణతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. -
క్షణ క్షణం
హైదరాబాద్ యూనివర్సిటీ వీసీగా అప్పారావు బాధ్యతలు చేపట్టడం అత్యంత గోప్యంగా, ప్రణాళికాబద్ధంగా సాగిపోయింది. విద్యార్థులకు, ఫ్యాకల్టీకి ఏమాత్రం అనుమానం రాకుండా తంతు కానిచ్చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ విద్యార్థులు ఆందోళనకు దిగితే... కట్టడి చేసేందుకు వీలుగా పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం చోటు చేసుకున్న పరిణామాల క్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే... ఉదయం 8 గంటలకు గచ్చిబౌలి స్టేడి యానికి వీసీ అప్పారావు చేరుకున్నారు. 8.05 గంటలకు లైఫ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ గోపాల్, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రకాశ్‌బాబు, మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ రాజశేఖర్‌తో పాటు కొందరు ప్రొఫెసర్లు అక్కడే అప్పారావును కలుసుకున్నారు. 8.15 గంటలకు నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సమాచారం. 8.30: అనుకున్నట్లుగానే వర్సిటీకి తన కుటుంబసభ్యులతో చేరుకున్న అప్పారావు వీసీగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం వీసీ లాడ్జీ దగ్గర సమావేశం కావడానికి 150 కుర్చీలు, టెంట్ వే యడానికి ఏర్పాట్లు చేశారు. 9 గంటలకు అప్పారావు వర్సిటీలోని వీసీ లాడ్జీకి చేరుకునేలా సిబ్బందికి రాజగోపాల్ సూచించారు. 9.15: 9.30 గంటలకల్లా వీసీ లాడ్జీ వద్దకు క్రమశిక్షణ సంఘం చైర్మన్ అలోక్ పాండే తదితరులు చేరుకునేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అదే సమయానికి లైఫ్‌సెన్సైస్ విద్యార్థులు అక్కడికి చేరుకుని వీసీకి శుభాకాంక్షలు తెలిపారు. 10.00: వీసీ వచ్చిన విషయుం తెలుసుకున్న విద్యార్థులు వీసీలాడ్జ్ వద్దకు చేరుకున్నారు. లోనికి వెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. 10.45: పోలీసులు రంగప్రవేశం..విద్యార్థులను చెదరగొట్టారు. 11.15 : వీసీ లాడ్జ్ వుుందు విద్యార్థులు ధర్నా..వీసీ ఉన్న గదిలోకి వెళ్లేందుకు యుత్నం..అడ్డుకున్న పోలీసులు12.00 : వీసీకి వుద్దతుగా నాన్‌టీచింగ్ సిబ్బంది ఆందోళన.. వారిని అడ్డుకున్న విద్యార్థులు.. సా 5.30 : వీసీ చాంబర్ వెనుక విద్యార్థులు ఆందోళన.. స్పెషల్ బెటాలియున్ పోలీసులు రాక.. విద్యార్థులపై లాఠీచార్జి..పరిస్థితి ఉద్రిక్తం రాత్రి 8.00: యుూనివర్శిటీ గేట్ల వుూసివేత..వర్శిటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు -
దడఖాస్తులు
♦ దరఖాస్తుల సమర్పణకు భారీ క్యూ ♦ జనసంద్రమైన కలెక్టరేట్ ఆవరణ ♦ లైన్లలో తోపులాట, పోలీసుల లాఠీచార్జి ♦ సొమ్మసిల్లిన నలుగురు, పలువురికి గాయాలు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జనం కలెక్టరేట్‌కు పోటెత్తుతున్నారు. గ్రేటర్లో లక్ష ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం.. వెనువెంటనే జిల్లా యంత్రాంగం దరఖాస్తుల స్వీకరణకు తెరలేపడంతో ఉదయం నుంచే కలెక్టరేట్ జనసంద్రంగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అర్జీదారులు భారీ క్యూలో గంటల తరబడి నిలబడి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. గురువారం అధికసంఖ్యలో జనం రావడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. క్యూలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో పలువురు గాయపడగా.. నలుగురు సొమ్మసిల్లి పడిపోయారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : రెండు పడకగదుల ఇళ్ల కోసం వస్తున్న అర్జీదారులతో కలెక్టరేట్ జాతరను తలపిస్తోంది. గురువారం జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు గాయపడగా.. నలుగురు అక్కడే సొమ్మసిల్లారు. ఈ ఘటనతో అధికారులు దరఖాస్తుల స్వీకరణ నిలిపివేసి గేట్లు వేయడంతో అక్కడున్న జనం పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు కలగజేసుకుని అర్జీదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని కాంపౌండ్ వాల్ లోపలున్న అధికారులకు అందజేశారు. గేటు ఎదుట నిరసన.. మధ్యాహ్నం తర్వాత దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్ వేయడంతో సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన అర్జీదారులు కొంత గందరగోళంలో పడ్డారు. కార్యాలయం లోపలికి వెళ్లి ఉన్నతాధికారులను కలుస్తామని ముందుకొచ్చిన కొందరిని పోలీసులు అడ్డుకుని బయటకు తోసేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం మూసివేయడంతో పలువురు గేటు ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమ నుంచి దరఖాస్తులు తీసుకోవాల్సిందిగా నినాదాలు చేశారు. అయితే అధికారులు మాత్రం స్థానికంగా వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహిస్తామని, అక్కడే దరఖాస్తులు సమర్పించాలని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాలకనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెబుతున్నారు. పది ప్రత్యేక కౌంటర్లు.. గురువారం ఒక్కరోజే 13,840 అర్జీలు హౌజింగ్ అధికారులు స్వీకరించారు. గత ఐదు రోజులుగా సాగుతున్న దరఖాస్తుల జాతరతో ఏకంగా 48,500 మంది అర్జీలు పెట్టుకోవడం గమనార్హం. దరఖాస్తుదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అధికారులు ప్రత్యేకంగా పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. పది మంది సిబ్బంది ఈ కౌంటర్లలో అందుబాటులో ఉండి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఉదయం కార్యాలయం తెరిచేలోపే కలెక్టరేట్ వెనుకభాగంలో రైల్వే స్టేషన్ పార్కింగ్ నుంచి అర్జీదారులు బారులు తీరుతున్నాయి. ప్రస్తుతం కలెక్టరేట్లో 48,500 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రతి సోమవారం మండలాల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలోనూ ఇళ్లకోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం దాదాపు మంగళం పాడడంతో వీరంత డబుల్ బెడ్రూం ఇళ్లను ఆశిస్తున్నారు. ఇలా మండలస్థాయిలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో మరో 20వేల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. డబుల్బెడ్రూం ఇళ్లకోసం జిల్లాలో ఇప్పటివరకు మొత్తంగా 70వేల వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. -
‘డబుల్’ ఆశ...
దరఖాస్తుల సమర్పణకు భారీ క్యూ జన సంద్రమైన కలెక్టరేట్ ప్రాంగణం లైన్లలో తోపులాట.. పోలీసుల లాఠీచార్జి సొమ్మసిల్లిన నలుగురు... కొందరికి గాయాలు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు జనం పోటెత్తుతున్నారు. గ్రేటర్లో లక్ష ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం.. వెంటనే జిల్లా యంత్రాంగం దరఖాస్తులస్వీకరణకు తెర లేపడంతో ఉదయం నుంచే కలెక్టరేట్ జనసంద్రంగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అర్జీదారులు భారీ క్యూలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. గురువారం అధిక సంఖ్యలో జనం రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్యూలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ క్రమంలో కొందరు గాయపడగా.. నలుగురు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. రంగారెడ్డి జిల్లా: గ్రేటర్లో రెండు పడక గదుల ఇళ్ల కోసం వస్తున్న అర్జీదారులతో కలెక్టరేట్ జాతరను తలపిస్తోంది. గురువారం జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు గాయపడగా.. నలుగురు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనతో అధికారులు దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసి గేట్లు వేయడంతో జనం పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు కల్పించుకొని... దరఖాస్తులు తీసుకుని కాంపౌండ్ వాల్ లోపలున్న అధికారులకు అందజేశారు. గేటు ఎదుట నిరసన.. మధ్యాహ్నం తర్వాత దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్ వేయడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు గందరగోళానికి గురయ్యారు. కార్యాలయం లోపలికి వెళ్లి ఉన్నతాధికారులను కలుస్తామని ముందుకొచ్చిన కొందరిని పోలీసులు అడ్డుకుని బయటకు తోసేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం మూసివేయడంతో పలువురు గేటు ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమ దరఖాస్తులు తీసుకోవాల్సిందిగా నినాదాలు చేశారు. అధికారులు మాత్రం స్థానికంగా వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహిస్తామని, అక్కడే దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెబుతున్నారు. -
ఆదివాసీలపై లాఠీచార్జి?
ఠాణా నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ అభ్యంతరం తెలిపిన రాళ్లగెడ్డ వాసులు అడ్డుకున్న గిరిజనులను కొట్టిన పోలీసులు విశాఖపట్నం: మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం రాళ్లగెడ్డలో బుధవారం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు తెలిసింది. ఈ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గిరిజనులపై పోలీసులు లాఠీచార్జి చేసినట్టు సమాచారం. చింతపల్లి మండలం బలపం పంచాయతీ రాళ్లగెడ్డ గ్రామంలోని గిరిజనులకు సంబంధించిన భూమిలో పోలీసుస్టేషన్ నిర్మించాలని ఇదివరకే పోలీసుశాఖ నిర్ణయించింది. దీనిపై అప్పట్లోనే గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ జీవనోపాధికి, వ్యవసాయం చేసుకోవడానికి ఈ భూములొక్కటే ఆధారంగా ఉన్నాయని వారు పోలీసు అధికారులకు వివరించినట్లు తెలిసింది. అయినప్పటికీ గిరిజనుల అభ్యర్థనలను పట్టించుకోని అధికారులు ఇక్కడే పోలీసు స్టేషన్ నిర్మాణం చేపట్టేందుకు గురువారం భూమి పూజ నిర్వహించడంతో గ్రామస్తులు వ్య తిరేకించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జి చేసినట్లు తెలిసింది. రూరల్ ఎస్పీతోపాటు చింతపల్లి డీఎస్పీ రాఘవేంద్ర, అన్నవరం ఎస్ఐ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిసింది. -
పోలీస్ ఔట్ పోస్టును అడ్డుకున్న గ్రామస్తులు
నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామంలోని వెంకటేశ్వరనగర్‌లో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయటాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫలితంగా శనివారం ఉదయం స్థానికులు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. స్థానికులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. నిరసన వ్యక్తం చేసిన 15 మందిని రెస్ట్ చేశారు. నిరుపయోగంగా ఉన్న ధర్మశాల స్థలంలో పోలీస్ ఔట్ పోస్ట్ నిర్మించేందుకు పోలీసులు శనివారం ఉదయం ప్రయత్నించారు. దాంతో అక్కడికి చేరిన ఒకవర్గం ప్రజలు దానిని అడ్డుకున్నారు. 1950లో ధర్మశాల స్థలాన్ని ఎవరో దాత ఇచ్చారని ఒక వర్గం పేర్కొంటోంది. అయితే ధర్మశాల స్థలంలో పోలీస్ ఔట్ పోస్ట్ నిర్మాణం కోసం గ్రామ సభలో ఆమోదించామని సర్పంచ్ చెబుతున్నారు. -
గోదాం శంకుస్థాపనలో రేవంత్ ధూంధాం.
-
గోదాం శంకుస్థాపనలో రేవంత్ ధూంధాం.
కొడంగల్‌లో లాఠీచార్జి, ఎమ్మెల్యే అరెస్ట్.. విడుదల సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాం శంకుస్థాపన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణీత సమయానికి రాకపోవడం.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గోదాం ప్రాంగణంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలు.. గురువారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో మార్కెట్ గోదాం శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిర్ణీత సమయానికి వచ్చారు. భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాకపోవడంతో అసహనానికి గురైన రేవంత్.. గోదాం వద్ద గల ప్రాంగణంలో చొచ్చుకొని వెళ్లడానికి ప్రయత్నించారు. శంకుస్థాపన జరిగే వరకు ఎవరూ లోపలకు వెళ్లరాదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెదరగొట్టేందుకు యత్నిస్తుండగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్ తరలించగా ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి, ఇతర కార్యకర్తలను కొడంగల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాదాపు గంటసేపు ఉద్రిక్త పరి స్థితి నెలకొంది. రేవంత్‌ను అరెస్టు చేసిన తర్వాత కొద్దిసేపటికే మంత్రి జూపల్లి సభా ప్రాంగణానికి వచ్చారు. స్థానిక శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని.. ఆయనను తీసుకురావాలని నారాయణపేట డీఎస్పీకి మంత్రి సూచించారు. అయితే కార్యక్రమానికి రావడానికి రేవంత్ నిరాకరించారని డీఎస్పీ చెప్పడంతో జూపల్లి గోదాం శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి రాకుండా అధికార పార్టీ అడ్డుకుందన్న ప్రచారం కోసమే రేవంత్‌రెడ్డి తపన పడుతున్నారే తప్ప ప్రజలకు జరిగే మేలులో పాల్గొనాలన్న ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మంత్రి జూపల్లి పర్యటన ముగిసిన అనంతరం రేవంత్‌రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. కేసీఆర్‌ను దించేవరకూ నిద్రపోను: రేవంత్ దౌల్తాబాద్: తెలంగాణ సెంటిమెంటుతో రాజకీయపబ్బం గడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కుర్చీదించే వరకు తాను నిద్రపోనని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి విడుదల అయిన అనంతరం గాంధీ కూడలిలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను బయటపెడితే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులను అడ్డంపెట్టుకుని అక్రమ కేసులు బనాయించి నిర్బంధిస్తున్నారని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల లిక్కర్ మాఫియాతో ముఖ్యమంత్రి ముడుపులు తీసుకుని ఇంటింటికీ చీప్ లిక్కర్ పంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై, అక్రమాలపై పోరాటం సాగిస్తామన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కొడంగల్‌లో జూపల్లి చిచ్చు రేపి రణరంగాన్ని సృష్టిం చారన్నారు. టీఆర్ఎస్ పాలనలో టీడీపీ ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండాపోయిందని చెప్పారు. జూపల్లి గూండాగిరీ చేస్తున్నారు: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గూండాగిరీ చేస్తున్నారని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు అక్రమమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎర్రబెల్లి గురువారం విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఢిల్లీ వెళ్లి ప్రయత్నించాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం విపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. శుక్రవారం తన నియోజకవర్గం పాలకుర్తిలో మంత్రి కార్యక్రమం ఉందని, అయితే, తనకు ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదని కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు. -
ఆర్టీసీ కార్మికులపై లాఠీ ప్రతాపం
- ఆర్టీసీ కార్మికులపై పోలీసు జులుం - గాయపడ్డ మహిళా కండక్టర్లు - మూడో రోజు సమ్మె ఉద్రిక్తం - బస్సులను అడ్డుకున్న కార్మికులు - బలవంతంగా బస్సులు నడిపిన పోలీసులు - అన్యాయమన్న కార్మిక సంఘాలు న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై చిత్తూరు పోలీసులు శుక్రవారం జులుం ప్రదర్శించారు. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా దొరికిన వారిని దొరికినట్టే కొట్టి రోడ్డున పడేశారు. పోలీసుల లాఠీల దెబ్బకు పలువురు ఆర్టీసీ కార్మికులు స్పృహతప్పి పడిపోయారు. పలువురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనలో పోలీసు చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, చిత్తూరు: న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై చిత్తూరు పోలీసులు శుక్రవారం జులుం ప్రదర్శించారు. మహిళా ఉద్యోగినులని కూడా చూడకుండా దొరికిన వారిని దొరికినట్టే కొట్టి రోడ్డున పడేశారు. పోలీసుల లాఠీల దెబ్బకు పలువురు ఆర్టీసీ కార్మికులు స్పృహతప్పి పడిపోయారు. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనలో పోలీసు చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఒత్తిడితో గురువారం నుంచే బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు యత్నించారు. ఆ మేరకు కాంట్రాక్ట్ కార్మికులపై ఒత్తిడి పెంచారు. ఆటోడ్రైవర్లతో బస్సులు నడిపించాలని చూశారు. ఆర్టీసీ కార్మికులు వారిని అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బంద్ ప్రభావం కనిపించకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు పోలీసు బలగాల అండతో శుక్రవారం బస్సులను బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేయడంతో ఘర్షణ తలెత్తింది. సమ్మె విఫలం కాకూడదన్న ఉద్దేశంతో ఉన్న కార్మికులు మండుటెండను సైతం లెక్కచేయక బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీగా మోహరించిన పోలీసులు కార్మికులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఊహించని ఈ ఘటనలో పలువురు కార్మికులు దెబ్బలు తినాల్సి వచ్చింది. మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా మగ పోలీసులతో పాటు మహిళా పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ దాడిలో కండక్టర్లు ఉష, నిత్య తీవ్రంగా గాయపడ్డారు. నిత్య చెవి నుంచి రక్తస్రావం ఆగలేదు. పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడమేగాక ఏకంగా పోలీసు స్టేషన్‌ను ముట్టడించి గంట పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసేవరకు వచ్చింది. గాంధీబొమ్మ సెంటర్లో రాస్తారోకోతో గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. దాడికి పాల్పడ్డ పోలీసులను సస్పెండ్ చేయాలంటూ యూనియన్ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్టీసీ కార్మికులపై ‘లాఠీ’ ప్రతాపం
హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు డిమాండ్ చేస్తూ.. ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజైన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉధ్రుతంగా సాగింది. కొన్ని చోట్ల పోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తంగా మారింది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై చిత్తూరు పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. పురుషులు, మహిళలనే విచక్షణ లేకుండా తరిమి తరిమి చితకబాదారు. దీంతో యూనియన్ నేతలతో కలసి కార్మికులు పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. మరోపక్క లాఠీచార్జ్ ఘటన జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనేలా చేసింది. పలు జిల్లాల్లో బస్సులను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేశారు. సమ్మెకు మద్దతు పలుకుతున్న ప్రజాసంఘాల నేతల్ని కూడా అరెస్ట్ చేశారు. విజయనగరంలోనూ పోలీసులు రెచ్చిపోయారు. ఆర్టీసీ కార్మికులను విచ్చలవిడిగా అరెస్ట్ చేశారు. ఫలితంగా రోడ్డు రవాణా సమ్మె.. రాష్ట్రంలో పతాకస్థాయికి చేరింది. మరోపక్క, తాత్కాలిక ప్రాతిపదికన విశాఖపట్నం డిపోలో నియమితుడైన ఓ డ్రైవర్ రోడ్డు ప్రమాదానికి పాల్పడ్డాడు. నేడు వంటా వార్పూ..: శనివారం ఏపీ వ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ఆవరణల్లోనూ ‘వంటా వార్పూ’ చేపట్టాలని యూని యన్ నే తలు పిలుపునిచ్చారు. కార్మికులపై పోలీసుల లాఠీ చార్జీకి నిరసనగా ఈయూ నేత కె.పద్మాకర్ ఆర్టీసీ డైరక్టర్ పదవికి రాజీనామా చేశారు. -
ఆర్టీసీ కార్మికులను చావబాదారు
-
జమ్మూ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం
జమ్మూజ: మ్మూలో సోమవారం జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం నెలకొంది. ర్యాలీలో పాల్గొనేందుకు ఊహించనంత పెద్దసంఖ్యలో యువకులు రావడంతో తోపులాట జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక దశలో లాఠీలు కూడా ఝుళిపించారు. దొరికనవారిని దొరికినట్టు లాగిపడేశారు. పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
వేడుకున్నారు.. ఉరికించారు !
♦ కార్మికులపై కనికరం చూపించని ఖాకీలు ♦ విచక్షణారహితంగా లాఠీచార్జి ♦ పలువురికి గాయూలు..అదుపులోకి 56 మంది.. ఏటూరునాగారం (మంగపేట) : ‘గతంలో కార్మికుల పక్షాన నాయకులు కలిశారు... ఈ సారి కార్మికులందరం ఉప ముఖ్యమంత్రి, స్థానిక మంత్రిని కలిసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని విన్నవించుకుంటాం..’ అని పోలీసులను బిల్ట్ కార్మికులు వేడుకున్నారు. వారి మనసు కరగలేదు. ‘కమలాపురం నుంచి వచ్చినం.. మా కుటుంబాల దీనావస్థను తెలియజేస్తాం.. మాకు మంత్రులను కలిసే అవకాశం ఇవ్వాలి..’ అని కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఖాకీలు ససేమిరా అంటే ససేమిరా అన్నారు. దీంతో కార్మికుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. అరుునా.. కార్మిక పెద్దలు సముదారుుస్తూ పోలీసులను బతిమిలాడారు. కేవలం ప్రతినిధులనే పంపిస్తాం... అని ఖాకీలు ఖరాకండిగా చెప్పారు. ఈ క్రమం లో ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు అటుగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ తన వాహనంలో వస్తున్నారు. అప్పటికే అసహనంతో ఉన్న కార్మికులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. ఇదే వారు చేసిన పొరపాటు కావొచ్చు. ఏటూరునాగారం, మంగపేట ఎస్సైలు వినయ్‌కుమార్, ముష్కం శ్రీనివాస్ స్పెషల్, సీఆర్పీఎఫ్, సివిల్ పోలీ సులు విరుచుకుపడ్డారు.. ఒక్కసారిగా లాఠీల కు పనిజెప్పారు. కార్మికులు చెల్లాచెదురు కాగా.. పోలీసుల దెబ్బలతో పలువురికి గాయూలయ్యూరుు. ఈ క్రమంలో సీఐ కిశోర్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని కార్మికులను శాంతింప జేసేందుకు ప్రయత్నించారు. ‘మా సమస్యను చెప్పుకునేందుకు వస్తే అడ్డుకోవడమే కాకుండా... లాఠీలతో కొడతారా అంటూ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో మరోసారి పోలీ సులు కార్మికులను చితక బాదారు. ఆ తర్వాత 56 మందికి పైగా కార్మికులను బలవంతంగా లారీలో ఎక్కించి మంగపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
లా విద్యార్థుల రగడ
సాక్షి, చెన్నై : బ్రాడ్ వేలోని అంబేద్కర్ లా కళాశాల పురాతనమైనది. మెట్రో రైలు పనులకు ఈ భవనం ఆటంకం కల్పిస్తోంది. దీంతో అక్కడి లా కళాశాలను మరో చోటకు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గ ఏర్పాట్లను న్యాయశాఖ అధికారులు వేగవంతం చేశారు. శ్రీ పెరంబదూరుకు ఈ కళాశాలను తరలించే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారన్న సమాచారంతో విద్యార్థుల్లో ఆగ్రహం రేగింది. రెండు మూడు రోజులుగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాల తరలింపు ఖాయం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నగరంలో ఉన్న కళాశాలను మరో చోటకు మార్చడంతో ద్వారా శ్రమతో పాటుగా తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులు మధ్యాహ్నం రోడ్డెక్కారు. ట్రాఫిక్ పద్మవ్యూహం: కళాశాలను తొలగించేందుకు వీలు లేదని, అందుకు తగ్గ పనుల్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది లా విద్యార్థులు బ్రాడ్వే మార్గంలో బైఠాయించారు. ఈ హఠాత్పరిణామంతో ఆ పరిసరాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను బుజ్జగించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. ఈ క్రమంలో పలుమార్లు విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్యుద్ధం చోటు చేసుకుంది. విద్యార్థులు 4 గంటల పాటుగా బైఠాయించడంతో ఉత్తర చెన్నై పరిసరాల్లో పాటుగా, మెరీనా తీరం, మౌంట్ రోడ్డు పరిసరాలు ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కాయి. పలు మారా్గాల్లో వాహనాల్ని టేక్ డైవర్షన్లు తీసుకునే రీతిలో ఏర్పాట్లు చేసినా, చిన్న చిన్న సందుల్లో సైతం వాహనాలు ఆగాయి. ఎక్కడికక్కడ వాహనాలు పలు ప్రాంతాల్లో ఆగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పలేదు. ఓ దశలో విద్యార్థుల్ని బుజ్జగించే ప్రయత్నంలో కొందరు పోలీసు సిబ్బంది దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణ బయలు దేరింది. అదే సమయంలో కొందరు విద్యార్థులు పోలీసులపై తిరగబడ్డట్టు, దాడికి దిగినట్టు సమాచారం. దీంతో విద్యార్థులపై లాఠీలు ఝుళిపించి చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం బయలు దేరింది. ఆ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 4 గంటల ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు వాహన చోదకులు తంటాలు పడగా, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చెమటోడ్చాల్సి వచ్చింది. లాఠీచార్జ్‌పై ఆగ్రహం: లా విద్యార్థులపై లాఠీ చార్జిని న్యాయవాద సంఘాలు, విద్యార్థి సం ఘాలు ఖండిస్తున్నాయి. కనిపించిన వారిని ఇష్టానుసారంగా పోలీసులు చితగ్గొట్టడాన్ని తీవ్రంగా పరిగణించాయి. అరెస్టు చేసిన క్రమంలో, వ్యాను లో ఎక్కుతున్న విద్యార్థులపై సైతం పోలీసులు లాఠీ ఝుళిపించడాన్ని వ్యతిరేకిస్తూ, విద్యార్థి సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. -
రైతులకు సీఎం క్షమాపణలు చెప్పాలి
లాఠీచార్జి ఘటనపై కిషన్ రెడ్డి హైదరాబాద్ : మెదక్ జిల్లాలో విద్యుత్ కోతలకు నిరసనగా రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. బాధిత రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బాధిత రైతులను తీసుకొచ్చి వారి సమక్షంలో విలేకరులతో మా ట్లాడారు. బాధ్యులను శిక్షించడంతోపాటు సం ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా గడవక ముందే పని తీరు ఏమిటో ప్రజలకు కనిపిస్తోందన్నారు. సమస్యలను పరి ష్కరించాలంటే సీఎం తమను కొత్త బిచ్చగాళ్లని అంటున్నారని, ప్రజల కోసం బిచ్చమెత్తేందుకూ సిద్ధమేనన్నారు. సమావేశంలో నేతలు కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.