నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామంలోని వెంకటేశ్వరనగర్‌లో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయటాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫలితంగా శనివారం ఉదయం స్థానికులు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. స్థానికులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. నిరసన వ్యక్తం చేసిన 15 మందిని రెస్ట్ చేశారు. నిరుపయోగంగా ఉన్న ధర్మశాల స్థలంలో పోలీస్ ఔట్ పోస్ట్ నిర్మించేందుకు పోలీసులు శనివారం ఉదయం ప్రయత్నించారు. దాంతో అక్కడికి చేరిన ఒకవర్గం ప్రజలు దానిని అడ్డుకున్నారు. 1950లో ధర్మశాల స్థలాన్ని ఎవరో దాత ఇచ్చారని ఒక వర్గం పేర్కొంటోంది. అయితే ధర్మశాల స్థలంలో పోలీస్ ఔట్ పోస్ట్ నిర్మాణం కోసం గ్రామ సభలో ఆమోదించామని సర్పంచ్ చెబుతున్నారు.