నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుర్కపల్లి పోలీస్స్టేషన్లో సోమవారం ఉదయం గౌస్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
బ్లౌడ్తో గొంతు కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతనిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉన్నతాధికారుల వేధింపులతోనే గౌస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే, ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని సీఐ రాఘవరెడ్డి తెలిపారు.