
‘మల్లన్నసాగర్’ నిర్మించాల్సిందే..
సిద్దిపేట, జోగిపేటలో అనుకూల ర్యాలీలు
సిద్దిపేట జోన్/జోగిపేట: జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం బంద్ జరిగితే, సిద్దిపేట, జోగిపేటలలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలంటూ అనుకూల ర్యాలీలు జరిగాయి. జోగిపేటలో మండల టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మీకాంతరావు తదితరు ఆధ్వర్యంలో ర్యాలీ జరగగా.. సిద్దిపేటలో మల్లన్నసాగర్‌ను నిర్మించాలని, ప్రతి పక్షాల బంద్‌ను పట్టణ ప్రజలు తిరస్కరించాలని కోరుతూ పట్టణ టీఆర్‌ఎస్ కౌన్సిలర్ల అధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది.
మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, వెంకట్‌గౌడ్, చిప్ప ప్రభాకర్, ప్రవీణ్, గ్యాదరీ రవీందర్, దీప్తి నాగరాజు, స్వప్నబ్రహ్మం, నర్సింలు,ఉమారాణి,ఐలయ్య, లలిత రామన్నతో పాటు పలువురు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే అవకాశముందని వారు పేర్కొన్నారు.