రైతులపై లాఠీ చార్జీ దుర్మార్గపు చర్య
- రైతుల భూములను లాక్కుంటారా
- ఇదేనా బంగారు తెలంగాణ అంటే ఇదేనా
- సమస్యలు పరిష్కరించని చేతగాని ప్రభుత్వం
- రైతులకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంది
- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావ్
టేక్మాల్ఃరైతులపై లాఠీ చార్జీచేయడం ఎంతో దుర్మార్గపు చర్యయని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సోమవారం టేక్మాల్ ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ... మల్లన్నసాగర్ నిర్మాణమంటూ కడునిరుపేద రైతుల భూములను లాక్కోవడం సమంజసం కాదన్నారు. అడ్డుగా వస్తున్నా రైతులపై ఆడ, మగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా విచక్షణ రహితంగా అధికార అహంతో పోలీసులతో దైర్జన్యంగా కొట్టించడం ఎంటని ప్రశ్నీంచారు. వైఎస్‌ఆర్ హయంలో రైతులకు ఉచిత కరెంట్ రైతే రాజుగా పలు సంక్షేమ పథకాలను అందించి వారి అభివృద్యేద్యేయంగా పని చేశారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటునూ రైతుల పొట్టగొడుతూ, వారిపై దాడులు చేయిస్తుందని, వారి ఆత్మహత్యలకు కారణమవుతుందని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలు తీర్చచేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రైతుల మూడెకరాల భూమని అందిస్తామి, డబుల్ బెడ్‌రూం పలు రకాల సంక్షేమ పథకాల పేర్లను చెబుతూ కాలయాపన చేస్తున్నారేతప్పా ఎవరికి సంక్షేమ పథకాలు అందిచడంలేదని ఆరోపించారు. రైతు రుణమాఫీయంటూ ఇప్పటికి దిక్కులేదన్నారు. రైతు భూములను లాక్కుంటూ వారిపై లాటీ చార్జ్ చేయిస్తూ రైతుల పొట్టగొడుతున్న ఘతన కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని దుయ్యబుట్టారు. ప్రజలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. వారి పక్షాన ప్రభుత్వ వ్యతిరేఖ ఉద్యమాలను చేపట్టెందుకు సిద్దంగా ఉందని హెచ్చరించారు. మల్లన్న సాగర్ ఘటన మళ్లి ఎక్కడ కూడా పున్‌రావృతం అయితే సహించేదిలేదన్నారు.