ఎస్‌ఐ తీరుపై కోనాయిపల్లివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా లాఠీచార్జి చేశారంటూ మండిపడ్డారు.
తూప్రాన్, న్యూస్‌లైన్: ఎస్‌ఐ తీరుపై కోనాయిపల్లివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా లాఠీచార్జి చేశారంటూ మం డిపడ్డారు. అధికారులు వచ్చి ఎస్‌ఐపై చర్యలు తీసుకునే వరకు పో లింగ్‌లో పాలొనేది లేదని భీష్మిం చుకు కూర్చున్నారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. తహశీల్దార్ వచ్చి నచ్చజెప్పడంతో రెండుగంటల త ర్వాత పోలింగ్ కొనసాగింది. వివరాలోకి వెళ్తే..మండల పరిధిలోని కోనాయిపల్లి(పీబీ) గ్రామంలో పోలింగ్ జరుగుతుండగా ఉదయం 9 గంటల ప్రాంతంలో మక్తామాసాన్‌పల్లికి చెం దిన ఎస్‌ఐఅనిల్‌రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గుంపుగా ఉన్నారంటూ ఇప్ప యాదగిరిపై లాఠీచార్జి చేశారు.
అయితే అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా చేయిచేసుకున్నారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఎస్‌ఐ తీరును నిరసిస్తూ పోలింగ్‌ను బహిష్కరించారు. అకారణంగా లాఠీచార్జి చేసిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ స్వామి, తూప్రాన్ పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఎస్‌ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో స్థానిక సీఐ సంజయ్‌కుమార్ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు సమాచారం అందించారు. ఎస్‌ఐపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తిరి గి 11 గంటలకు పోలింగ్‌లో పాల్గొన్నారు.
కాసేపు ఎన్నికలను బహిష్కరించిన కూచారంతండావాసులు
తమ తాండకు వెళ్లేందుకు సరైన మార్గంలేక రైల్వేలైన్ కింద నుంచి వెళ్లాల్సి వస్తుందంటూ మండల పరి ధిలోని కూచారంతండావాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఈ విషయం తెలిసిన ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరకుని తాండ వాసులకు నచ్చజెప్పడంతో వారు శాంతించారు. అనంతరం ఓ టు హక్కును వినియోగించుకున్నా రు. ఇదిలాఉండగా మండలంలో 53 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. మొత్తం 42,103 ఓటర్లు ఉండ గా ఇందులో పురుషులు 21,177, మహిళలు 20,926 మంది ఓటర్లు ఉన్నారు.
ఒక్కోక్క పోలింగ్ కేం ద్రంలో ఆరుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఈవీఎం మిషన్ మోరయించడంతో గుండ్రెడ్డిపల్లి గ్రా మంలో గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగే తూప్రాన్ పట్టణంలో పట్టగోడుగుల వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ నెలకొనడంతో ఉద్రిక్తత నేలకొంది. పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.