konaipalli
-
కోనాయిపల్లిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనకు సెంటిమెంట్ అయిన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. సుమారు 12.30 గంటల సమయంలో ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వేంకటేశ్వస్వామిని దర్శించుకుని, నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అర్చకులు సీఎంకు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. స్వామి వారి సన్నిధిలోనే గజ్వేల్, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. మంత్రి హరీశ్‌రావు సైతం నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలుచేసి, వాటిపై సంతకం చేశారు. తర్వాత కేసీఆర్, హరీశ్‌రావు ఆలయం నుంచి బయటికి రాగా.. గ్రామ మహిళలు వారికి తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. సుమారు 1.15 గంటల సమయంలో వారు తిరిగి ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు. -
KCR: కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు
సాక్షి, సిద్ధిపేట: కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని కేసీఆర్ సెంటిమెంట్‌గా భావిస్తారు. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం వాటిపై సంతకాలు చేశారు. నవంబర్ 9వ తేదీన రెండుచోట్ల ఆయన నామినేషన్లు వేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. చదవండి: ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో? -
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
-
నేడు కోనాయిపల్లికి కేసీఆర్
సాక్షి, సిద్దిపేట/నంగునూరు: ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఈ ఆలయం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సెంటిమెంట్. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి వస్తున్నారు. వేంకటేశ్వరస్వామి వద్ద ఆ పత్రాలను ఉంచి పూజలు చేశాక వాటిపై సంతకాలు చేయనున్నారు. వారు ఈ నెల 9న ఆలయానికి రానున్నట్టు ప్రకటించినా ముందుగానే వస్తున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శుక్రవారంతో ముగిసింది. దీంతో ముందుగానే కోనాయిపల్లి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నెల 9న కేసీఆర్ తన నామినేషన్లను దాఖలు చేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. -
కలిసొచ్చిన కోనాయిపల్లి
సాక్షి, నంగునూరు(సిద్దిపేట): కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 33 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు ఓటమి ఎరుగని నేతగా కేసీఆర్ గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను నమ్ముకున్న వెంకన్న ఆశీస్సులు తీసుకొని కొత్త పార్టీని స్థాపించడం.. అనతి కాలంలోనే టీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ లభించింది. నామినేషన్‌కు ముందు వేంకటేశ్వరాలయంలో పూజలు చేస్తే శుభం జరుగుతుందని నమ్మే కేసీఆర్.. నాటి నుంచి నేటి వరకు అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం.. తొలిసారి జరిగిన ఎన్నికల్లోనే టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో ఆయన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఆలయంలో స్వామివారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైతే గుడికి వచ్చి పూజలు చేస్తానని 1985లో కేసీఆర్ మొక్కిన మొక్కు నెరవేరడంతో సుదీర్ఘ కాలంగా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి ఏ కొత్త పని ప్రారంభించినా ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. అలాగే 1985 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో నామినేష్ పత్రాలకు ఆలయంలో పూజలు చేస్తూ ఎమ్మెల్మేగా గెలుపొందారు. 2001లో వెంకన్న ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని సంవత్సరాల్లోనే టీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు రావడంతో సెంటిమెంట్ మరింత బలపడింది. 2004లో కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ముందు కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలపై అక్కడే సంతకం చేశారు. రెండింటిలో భారీ మెజారిటీ సాధించగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా, 2014లో గజ్వేల్ ఎమ్మెల్యే నామినేషన్ వేసే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గెలుపొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గజ్వెల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. సెంటిమెంట్‌ను నమ్ముకున్న కేసీఆర్ బుధవారం వేంకటేశ్వరాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేయనున్నారు. -
ఎస్ఐ తీరుపై ఆగ్రహం
తూప్రాన్, న్యూస్‌లైన్: ఎస్ఐ తీరుపై కోనాయిపల్లివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా లాఠీచార్జి చేశారంటూ మం డిపడ్డారు. అధికారులు వచ్చి ఎస్ఐపై చర్యలు తీసుకునే వరకు పో లింగ్లో పాలొనేది లేదని భీష్మిం చుకు కూర్చున్నారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. తహశీల్దార్ వచ్చి నచ్చజెప్పడంతో రెండుగంటల త ర్వాత పోలింగ్ కొనసాగింది. వివరాలోకి వెళ్తే..మండల పరిధిలోని కోనాయిపల్లి(పీబీ) గ్రామంలో పోలింగ్ జరుగుతుండగా ఉదయం 9 గంటల ప్రాంతంలో మక్తామాసాన్పల్లికి చెం దిన ఎస్ఐఅనిల్రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గుంపుగా ఉన్నారంటూ ఇప్ప యాదగిరిపై లాఠీచార్జి చేశారు. అయితే అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా చేయిచేసుకున్నారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఎస్ఐ తీరును నిరసిస్తూ పోలింగ్‌ను బహిష్కరించారు. అకారణంగా లాఠీచార్జి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ స్వామి, తూప్రాన్ పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో స్థానిక సీఐ సంజయ్‌కుమార్ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు సమాచారం అందించారు. ఎస్ఐపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తిరి గి 11 గంటలకు పోలింగ్‌లో పాల్గొన్నారు. కాసేపు ఎన్నికలను బహిష్కరించిన కూచారంతండావాసులు తమ తాండకు వెళ్లేందుకు సరైన మార్గంలేక రైల్వేలైన్ కింద నుంచి వెళ్లాల్సి వస్తుందంటూ మండల పరి ధిలోని కూచారంతండావాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఈ విషయం తెలిసిన ఎస్ఐ నిరంజన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరకుని తాండ వాసులకు నచ్చజెప్పడంతో వారు శాంతించారు. అనంతరం ఓ టు హక్కును వినియోగించుకున్నా రు. ఇదిలాఉండగా మండలంలో 53 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. మొత్తం 42,103 ఓటర్లు ఉండ గా ఇందులో పురుషులు 21,177, మహిళలు 20,926 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కోక్క పోలింగ్ కేం ద్రంలో ఆరుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఈవీఎం మిషన్ మోరయించడంతో గుండ్రెడ్డిపల్లి గ్రా మంలో గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగే తూప్రాన్ పట్టణంలో పట్టగోడుగుల వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ నెలకొనడంతో ఉద్రిక్తత నేలకొంది. పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
కోనాయిపల్లిలో కేసిఆర్ ప్రత్యేక పూజలు