రైతులకు సీఎం క్షమాపణలు చెప్పాలి
లాఠీచార్జి ఘటనపై కిషన్ రెడ్డి
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో విద్యుత్ కోతలకు నిరసనగా రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. బాధిత రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బాధిత రైతులను తీసుకొచ్చి వారి సమక్షంలో విలేకరులతో మా ట్లాడారు.
బాధ్యులను శిక్షించడంతోపాటు సం ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా గడవక ముందే పని తీరు ఏమిటో ప్రజలకు కనిపిస్తోందన్నారు. సమస్యలను పరి ష్కరించాలంటే సీఎం తమను కొత్త బిచ్చగాళ్లని అంటున్నారని, ప్రజల కోసం బిచ్చమెత్తేందుకూ సిద్ధమేనన్నారు. సమావేశంలో నేతలు కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.