అగ్రికల్చర్ వర్సిటీలో ఉద్రిక్తత
- మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి నిర్బంధం
హైదరాబాద్
వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాక సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. మంత్రిని విద్యార్థులు నిర్బంధించటంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న ఒక కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా.. జీవో నంబర్ 45ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, పశువైద్య అధికారుల పోస్టులను డిపార్టుమెంటల్ పరీక్షల ద్వారానే ఎంపిక చేయాలంటూ విద్యార్థులు మంత్రిని సమావేశ మందిరంలో నిర్భంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జి చేసి, విద్యార్థులను చెదరగొట్టారు. దాదాపు రెండు గంటలపాటు విద్యార్థుల నిర్బంధంలోనే మంత్రి గడపాల్సి వచ్చింది. పోలీసుల రక్షణతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.