పోరు సాగర్‌ | Fighting Sagar | Sakshi
Sakshi News home page

పోరు సాగర్‌

Published Tue, Jul 26 2016 11:27 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

పోరు సాగర్‌ - Sakshi

పోరు సాగర్‌

  1.  మల్లన్నసాగర్‌పై అనుకూల, ప్రతికూల పోరాటాలు
  2.     కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్ట్ట్‌ల రీడిజై¯ŒS
  3.    పరామర్శకు వెళ్తుంటే అరెస్టులా?æ
  4.    2013 జీఓ ప్రకారమే పరిహారం చెల్లించాలి: కాంగ్రెస్‌ నేతలు
  5.   అడ్డుకున్న పోలీసులు
  6.    కాంగ్రెస్‌  నేతల ముందస్తు అరెస్టు
  7.     పోలీసుల కళ్లుగప్పి గజ్వేల్‌లో ప్రత్యక్షమైన
  8.     డీకే అరుణ, దామోదర్, సబితారెడ్డి
  9.  మల్లన్నసాగర్‌ రాజెక్టు అనుకూల వ్యతిరేక పోరుతో మెతుకుసీమ అట్టుడికింది. లాఠీచార్జిలో గాయపడిన ‘ముంపు’వాసులను పరామర్శించేం దుకు కాంగ్రెస్‌ చేపట్టిన ‘చలో మల్లన్నసాగర్‌’ను పోలీసులు భగ్నం చేయగా.. అదే సమయంలో మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తిచేసి రైతు ఆత్మహత్యలను నివారించాలంటూ టీఆర్‌ఎస్, అనుబంధ రైతు సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. దీంతో పోలీసులు పరుగులు పెట్టారు. బయటి వ్యక్తుల వల్లే ముంపు గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పోలీసులు బయటి వ్యక్తులను, నేతలను అటువైపు వెళ్లకుండా కట్టడి చేశారు. పోలీసుల్ని ఛేదించుకుని వెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలు చేసిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.
    సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

    ‘చలో మల్లన్నసాగర్‌’ భగ్నం..
    పోలీసు లాఠీచార్జిలో గాయపడిన ముంపు బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన చలో మల్లన్నసాగర్‌ కార్యక్రమాన్ని మెదక్‌ జిల్లా పోలీసులు భగ్నం చేశారు. నేతలు ముంపు గ్రామాలకు చేరుకోకుండా కట్టడి చేశారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను, కార్యకర్తలను ముందస్తుగానే అరెస్టు చేసి పోలీసుస్టేçÙన్లలో నిర్బంధించారు. రెండవ రోజు కూడా పోలీసులు రాజీవ్‌ రహదారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే నేతలు ఇదే దారి గుండా వస్తారనే ఆలోచనతో పోలీసులు రహదారిపై చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పంపించారు.

    ప్రధానంగా రంగారెడ్డి జిల్లా్ల శామీర్‌పేట, మెదక్‌ జిల్లా ములుగు మండలం వంటిమామిడి శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షించారు. డీఐజీ అకున్‌ సబర్వాల్, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ చెక్‌పోస్టులను సందర్శించారు. నిన్నటి అనుభవంతో  కాంగ్రెస్‌ నేతలు దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, సబితాఇంద్రారెడ్డి, షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు అద్దంకి దయాకర్, వేణుగోపాల్‌రావు తదితరులు హైదరాబాద్‌ నుంచి పోలీసులకు చిక్కకుండా ‘రింగ్‌’ రోడ్డు మీదుగా...పోలీసు చెక్‌పోస్టుల్లేని గ్రామాల గుండా గూగుల్‌ వ్యపు సాయంతో వర్గల్‌కు చేరుకున్నారు.

    అక్కడి నుంచి సంగాపూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల మీదుగా గజ్వేల్‌ పట్టణంలోకి ప్రవేశించారు. పిడిచెడ్‌ రోడ్డు మార్గంలో ‘ముంపు’ గ్రామాలైన వేములగాట్, కొండపాక మండలం ఎరవ్రల్లికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. పసిగట్టిన పోలీసులు  పిడిచెడ్‌ మార్గంలోని కేసరి హనుమాన్‌ ఆలయం సమీపంలో అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులకు, నేతలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో నేతలు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. అయినా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని చేగుంట పోలీస్‌స్టేçÙన్‌కు తరలించారు. కాగా, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కుకునూర్‌పల్లి వద్ద అటకాయించిన పోలీసులు.. నల్లగొండ జిల్లా తుర్కపల్లి ఠాణాకు తరలించారు.
    పోలీసు వలయంలోనే ముంపు గ్రామాలు
    9 ముంపు గ్రామాలు ఇంకా పోలీసుల గుప్పిట్లోనే ఉన్నాయి. గ్రామస్తులు బయటికి పోకుండా...బయటి వ్యక్తులు ఊర్లోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బయటి వ్యక్తులు గ్రామాల్లోకి రావడం వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని పోలీసులు చెప్తున్నారు.
    ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు
    చేగుంట: కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టులు రీడిజై¯ŒS చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ వెళ్తున్న ఆయనను పోలీసులు అరెస్టు చేసి చేగుంట ఠాణాకు తరలించారు. అక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతులను సీఎం కేసీఆర్‌ మో సం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తడ్కపల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని కాంగ్రెస్‌ ప్రతిపాదించిందని గుర్తుచేశారు.

    కాగా, 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మంచ తలపెట్టిన రిజర్వాయర్‌ను 50 టీఎంసీలకు పెంచడం వెనుక కమీషన్ల వ్యవహారం ఉందని చెప్పారు. మల్ల న్నసాగర్‌ ప్రాజెక్టు రద్దు కోసం ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. 27 ఏళ్ల తన రాజకీయ జీవితం లో ఇలాంటి సీఎంను ఎన్నడూ చూడలేదన్నారు. స మావేశంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యేలు అనిల్, ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, అనంతసాగర్‌ మాజీ సర్పంచ్‌ అంజయ్య, సుప్రభాత్‌రావ్, రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, కనకయ్యతో పాటు పలువురు ఉన్నారు.
    దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది
    టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజాకంటక చర్యల్ని దేశమంతా గమనిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. మల్లన్నసాగర్‌ లాఠీచార్జి బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
    గాంధీభవ¯ŒS నుంచి వెంబడించారు  
    మల్లన్నసాగర్‌ బాధిత రైతులను పరామర్శించడానికి వెళ్తున్న తమను గాంధీభవ¯ŒS నుంచి పోలీసులు వెంబడించారని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రైతులపై లాఠీచార్జీ చేయడంతో మరోసారి దొరల పాలన గుర్తొంచ్చిందన్నారు. మల్లన్నసాగర్‌ బాధితులకు 2013 జీఓ ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  
    పొన్నాల లక్ష్మయ్య అరెస్టు
    జగదేవ్‌పూర్‌: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మల్లన్నసాగర్‌ ముంపు బాధితులకు మద్దతు తెలపడానికి మెదక్‌ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లికి వస్తున్న క్రమంలో కుకునూర్‌పల్లి వద్ద సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌ ఆరెస్టు చేసి నల్లగొండ జిల్లా తుర్కపల్లి పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కొందరు నాయకులు కొంతసేపు ఆందోళన చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement