మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజీవ్ రహదారిపై నిరసన తెలపడానికి వెళ్తున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకోవడంతో మహిళలు వాగ్వాదానికి దిగారు. దీంతో మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. కొంత మంది మహిళలను బూటు కాళ్లతో తంతూ పోలీసులు లాక్కెళ్లారు. తీవ్రగాయాలపాలైన మహిళలను ఆసుపత్రికి తరలించారు. నిరసన తెలపడానికి వచ్చిన కొంతమందిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.