సంగారెడ్డి పట్టణంలో ఉద్రిక్తత
సంగారెడ్డి: మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్షకు యత్నించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం దీక్ష చేపట్టేందుకు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్దకు జగ్గారెడ్డి రాగా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల తోపులాటలు, జగ్గారెడ్డి మద్దతుదారుల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.