ఢిల్లీ : కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం ఆదివారం వాయిదా పడింది.
తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో శంభు సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడి వందలాది మంది రైతులు పాదయాత్రగా ఢిల్లీ చలో కార్యక్రమాన్నిపున:ప్రారంభించారు. అయితే రైతులు నిర్వహిస్తున్న ఢిల్లీ చలో కార్యక్రమంపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు శంభు సరిహద్దులో భారీ ఎత్తున మోహరించారు. పాదయాత్రగా తరలివస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
పాదయాత్ర సాగకుండా ఇనుపు కంచెలు ఏర్పాటు చేయడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆదివారం చేస్తున్న ఢిల్లీ చలో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. తమ పాదయాత్రపై సోమవారం తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు.
చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు సరిహద్దు నుంచి ముందుకెళుతున్న రైతులపై పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారు
రైతులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు
టియర్ గ్యాస్ ప్రయోగంతో రైతులు చెల్లాచెదురయ్యారు.
తమకు చెప్పిన 101 మంది ఇతరులు ర్యాలో పాల్గొన్నారంటున్న పోలీసులు
అందుకే అడ్డుకున్నామని సమర్థింపు
#WATCH | Farmers' 'Dilli Chalo' march | Visulas from the Shambhu border where Police use tear gas to disperse farmers
"We will first identify them (farmers) and then we can allow them to go ahead. We have a list of the names of 101 farmers, and they are not those people - they… pic.twitter.com/qpZM8LK1vw— ANI (@ANI) December 8, 2024
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరు కొనసాగిస్తున్నారు.
డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ ఆదివారం(డిసెంబర్8) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది.
#WATCH | Farmers begin their "Dilli Chalo' march from the Haryana-Punjab Shambhu Border, protesting over various demands. pic.twitter.com/9EHUU2Xt1j
— ANI (@ANI) December 8, 2024
‘ఢిల్లీ చలో’ నేపథ్యంలో దేశ రాజధాని శంభు సరిహద్దు వద్ద ఉదయం నుంచే ఉద్రిక్తత నెలకొంది
రైతుల ర్యాలీని అడ్డుకునేందుకు సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్యారికేడ్లను సిద్ధంగా ఉంచారు.
#WATCH | Morning visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers are protesting over various demands. A 'Jattha' of 101 farmers will march towards Delhi today at 12 noon according to farmer leader Sarwan Singh Pandher pic.twitter.com/NG9VfXL6cg
— ANI (@ANI) December 8, 2024
సరిహద్దు వద్ద కవరేజీకి మీడియాకు అనుమతి నిరాకరించిన పోలీసులు
ఇది పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం, కేంద్రం కలిసి చేసి కుట్ర అని ఆరోపించిన రైతులు
గత ఆందోళనల్లో మీడియా ప్రతినిధులు గాయపడ్డారంటున్న పోలీసులు
#WATCH | SSP Patiala, Nanak Singh says, "Media has not been stopped. We have no such intentions. But, it was needed to brief the media. Last time we came to know that 3-4 media people were injured. To avoid that we briefed the media... We will try not to let this happen - but if… https://t.co/bStxTaLs8x pic.twitter.com/iacEB95jHQ
— ANI (@ANI) December 8, 2024
నిజానికి శుక్రవారం నుంచే చలో ఢిల్లీ మలి విడత మొదలైంది.
రైతుల ర్యాలీపై హర్యానా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
ఈ ఘటనలో మొత్తం 16 మంది గాయపడ్డారు.. వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారు:రైతు నేతలు
పలువురు రైతులు గాయపడడంతో శనివారం ర్యాలీని నిలిపివేశాం.
తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు.
మాతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు.
అందుకే చలో ఢిల్లీని ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం.
Comments
Please login to add a commentAdd a comment