
విరసం నేత వరవరరావు అరెస్ట్
విరసం నేత వరవరరావును మెదక్ జిల్లా కొండపాక మండలం కోనాయిపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు లాఠీచార్జీలో గాయపడ్డ మల్లన్న సాగర్ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్నా ఆయనను మార్గమధ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగరు ముంపు బాధితులను పరమార్శించడానికి వెళుతున్న విరసం, ప్రజాఫ్రంట్ నాయకులు డా.కాశీం, రవించంద్ర, దేవేంద్ర, గీతాంజలి,నలమాస కృష్ణ, రమణాచారీ, మెంచు రమేష్, కోటి, రమ, స్నేహ,బద్రీ తదితరులను వేములగట్టు పోలీస్ స్టేషన్ కి తరలించారు.