karnata
-
ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సవాల్
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ ఆరోపణలు చేయడంపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ లో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాని చేసిన ఆరోపణలను నిరూపించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. అవి నిజమని రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే వాటిని నిరూపించలేకపోతే ప్రధాని మోదీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కర్ణాటక ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని, దీని ద్వారా వచ్చిన సొమ్మును కాంగ్రెస్ మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తోందని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రం కాంగ్రెస్ రాజ కుటుంబానికి డబ్బులు అందించే ఏటీఎంగా మారిపోతుందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ రాజ కుటుంబానికి ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలు ఏటీఎంలుగా మారిపోయాయన్నారు.మహారాష్ట్రలో ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వసూళ్లకు పాల్పడుతున్నదని, కర్ణాటకలో ప్రభుత్వ వసూళ్లు రెట్టింపయ్యాయని ప్రజలు చెబుతున్నారన్నారు. కర్ణాటకలోని లిక్కర్ వ్యాపారుల నుంచి రూ.700 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని మోదీ ఆరోపించారు.తాజాగా ప్రధాని మోదీ ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. దేశ ప్రధాని ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. ప్రధానికి తానొక సవాల్ విసురుతున్నానని, ఆయన చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేనిపక్షంలో ప్రధాని రాజకీయాల నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.ఇదిలావుండగా కర్ణాటక వైన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇటీవల ఎక్సైజ్ విభాగంపై తీవ్ర ఆరోపణలు చేసింది. లైసెన్సులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు ఆరోపించింది. గత ఏడాది కాలంలో ఇలా 1000 లైసెన్సులను అక్రమంగా కేటాయించారని, ఫలితంగా రూ. 300-700 కోట్ల కుంభకోణం జరిగిందని వైన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది.ఇది కూడా చదవండి: Maharashtra: తొలిసారి ఆ గ్రామంలో ఎన్నికల పండుగ -
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్ట్
తుమకూరు: కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్డీఎల్)కు సంబంధించిన లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఎం.విరూపాక్షప్పను ఎట్టకేలకు లోకాయుక్త పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు, ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. తుమకూరు నుంచి బెంగళూరు వస్తుండగా మార్గమధ్యంలోనే విరూపాక్షను అదుపులోకి తీసుకున్నట్లు లోకాయుక్త ఐజీ తెలిపారు. విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మార్చి 2న ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. విరూపాక్ష నివాసంపై జరిపిన దాడుల్లో మరో రూ.8.23 కోట్లు దొరికాయి. అనంతరం కోర్టు ప్రభుత్వ రంగ కేఎస్‌డీఎల్‌కు చైర్మన్‌గా కూడా ఉన్న విరూపాక్షకు బెయిలిచ్చింది. అయితే, ప్రధాన ముద్దాయిగా ఉన్న విరూపాక్షప్ప కేసు విచారణలో సహకరించడం లేదంటూ లోకాయుక్త పిటిషన్ వేయగా కోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. -
‘ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది’
బెంగళూరు: దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ సత్య ప్రధాన్ తన ట్విట్టర్లో షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో ఎన్డీఆర్ఎఫ్ సభ్యుల మధ్య ఓ గొర్రెల కాపరి, అతడి పెంపుడు కుక్క కూర్చొని ఉన్నాయి. కరోనాను దృష్టిలో పెట్టుకుని వీరంతా చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి ఉన్నారు. ‘భారీ వరదలతో కృష్ణానది పొంగిపొర్లుతోంది. ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు ఈ గొర్రెల కాపారిని కాపాడారు. వరదల కారణంగా ఈ కుర్రాడు తన గొర్రెలను వదిలేసి వచ్చాడు. కానీ పెంపుడు కుక్కను మాత్రం తనతో పాటు తీసుకొచ్చాడు’ అంటూ సత్య ప్రధాన్ ట్వీట్ చేశారు. (కుండపోత వర్షాలు: కొండచరియలు విరిగి...) ✅This image will stay etched in my memories ✅This shepherd boy was rescued by @NDRFHQ from raging waters of Krishna ✅He was sad to leave many sheep behind ✅But had presence of mind to bring the dog so sheep graze freely & dog is fed by him ✅Happy to have helped the boy🙏🏻 pic.twitter.com/VLgvMZdjKv — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) August 9, 2020 అంతేకాక ‘ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తే.. ‘గొర్రెలు ఎక్కడైనా స్వేచ్ఛగా మేస్తాయి. కానీ కుక్క అలా కాదు. దానికి నేనే భోజనం పెట్టాలి. అందుకే దాన్ని నా వెంట తీసుకొచ్చాను. గొర్రెలను వదిలేసినందుకు బాధగా ఉంది. కానీ అవి ఎలాగైనా బతుకుతాయనే నమ్మకంతోనే కుక్కను తీసుకొచ్చాను’ అన్నాడు. క్లిష్ట సమయంలో ఈ గొర్రెల కాపరి అద్భుతమైన సమయస్ఫూర్తి చూపాడు. ఈ సంఘటన, ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి’ అంటూ సత్య ప్రధాన్ ఈ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. అంతేకాక ‘కష్టాలు వచ్చినప్పుడు మనిషిలోని పోరాట పటిమ, కరుణ వెల్లడవుతాయి. మనిషి నమ్మకానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిస్తుంది’ అన్నారు సత్య ప్రధాన్. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షాల వల్ల తీరప్రాంత జిల్లాలు, కొన్ని ఉత్తర జిల్లాలు, కొడగు జిల్లా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. (ముంబైని ముంచెత్తిన వర్షాలు) వర్షం పరిమాణం కొంత వరకు తగ్గింది.. కాని పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. కొడగు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. -
అద్దెకట్టలేదని కాల్పులు
బెంగళూరు: అద్దెకట్టకపోతే ఇంటి యజమాని ఏం చేస్తాడు.. ఇళ్లు ఖాళీ చేయమని బెదిరిస్తాడు. అప్పటికి కట్టకపోతే ఇంట్లోని సామాను తీసి బయటపడేస్తాడు. కానీ కర్ణాటకలోని ఓ ఇంటి యజమాని మాత్రం తుపాకీతో బెదిరించాడు. అద్దెకట్టడం లేదనే కోపంతో.. వారిని బెదిరించడానికి ఏకంగా గాల్లోకి కాల్పులు జరిపాడు. ఊహించని ఈ ఘటనకి కిరాయిదారు బెదిరిపోయాడు. కర్ణాటక రాష్ట్రం బెల్గామ్ జిల్లాలోని చిక్కోడి ఏరియాలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఇంటి అద్దె అడిగిన యజమానికి కిరాయిదారుడు డబ్బులు లేవని సమాధానం ఇచ్చాడు. దాంతో రెచ్చిపోయిన ఆ ఇంటి ఓనర్ తన జేబులోని రివాల్వర్ తీసి గాల్లోకి రెండు, మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ హఠాత్పరిమాణంతో వణికిపోయిన కిరాయిదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు. #WATCH Karnataka: A landlord fired shots in the air after a tenant failed to pay rent, in Chikkodi area of Belgaum district yesterday. The person was later taken into custody by the police. pic.twitter.com/8dxXA8ifcI — ANI (@ANI) June 15, 2020 -
టాయ్లెట్లో ఐదడుగుల తాచుపాము
-
టాయిలెట్లో అనుకోని అతిథి..భయంతో!
బెంగళూరు : టాయ్లెట్లోకి పాము చొరబడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బెంగుళూరులోని జేపీ నగర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ ఇంట్లోని టాయ్లెట్లో ఐదడుగుల తాచుపాము కనిపించింది. భయబ్రాంతులకు గురైన ప్రమోద్ వెంటనే వన్యప్రాణి సంరక్షణ బృందానికి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో బృందంలోని ఓ వ్యక్తి ఆయన నివాసానికి చేరుకొని పామును బయటికి తీశారు. ఈ తతంగాన్నంతా ప్రమోద్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో వ్యక్తి దైర్యంగా టాయ్‌లెట్ నుంచి పామును బయటికి తీయడం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. దీనిని తీయడానికి మొదట చేతిని ఉపయోగించి, తరువాత ఒక వస్తువుతో తీసి సంచిలో వేసి తీసుకెళ్లాడు. -
ఏనుగు పొగ తాగడం చూశారా...?
న్యూ ఢిల్లీ : ధూమపానం ఆరోగ్యానికి హానికరం...పొగ తాగరాదు ఇలాంటి వాక్యలు చాలా సందర్భాల్లో వింటూనే వుంటాం. అయితే మనుషులే కాదు ఈ మధ్య జంతువులు కూడా ధూమపానం చేస్తున్నాయి. కోతులు పొగ తాగడం కూడా చూశాం. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలోకి ఏనుగులు వచ్చి చేరాయి. ఇందుకు సంబంధించి వైల్డ్ లైఫ్ కనజర్వేషన్ ఆఫ్ ఇండియా.. ఫేస్బుక్లో పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు అందరిని తెగ ఆకర్షిస్తుంది. ఒక ఏనుగు పక్కనే మండుతున్న అడవి నుంచి దేన్నో తీసుకుని తన నోట్లో పెట్టుకుంది. తర్వాత పొగను బయటకు వదులుతుంది. చూసేవారికి ఆ దృశ్యం ఏనుగు పొగ తాగుతున్నట్లు ఉంది. అసలు సంగతేంటంటే ఆ ఏనుగు తింటున్నది బొగ్గును. మండుతున్న అడవి నుంచి బొగ్గును తీసుకుని నోట్లో పెట్టుకుంది. తర్వాత ఆ బొగ్గుకు అంటుకుని ఉన్న బూడిదను తన తొండం నుంచి బయటకు వదిలింది. అది కాస్తా చూసేవారికి పొగలా కన్పిస్తుంది. డబ్ల్యూసీఎస్ ఇండియా శాస్త్రవేత్త, ఏనుగుల జీవశాస్త్ర నిపుణుడు డాక్టర్ వరుణ్ గోస్వామి ఈ సంఘటన గురించి వివరిస్తూ బొగ్గులో ఎటువంటి పోషక విలువలు ఉండవు. కానీ అడవి తగలబడినప్పుడు అనేక వృక్షాలు కాలిపోతాయి. అప్పుడు వచ్చే ఆ వాసన జంతువులను ఆకర్షిస్తుంది. అంతేకాక ఇది భేదిమందు(విరోచనకారి మందు)లాగా కూడా పని చేస్తుంది. అందువల్లే జంతువులు బొగ్గు తింటాయి అని డబ్ల్యూసీఎస్ ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదని అందుకే తాను ఈ వీడియో తీశానని వినయ్ కుమార్ తెలిపారు. 2016లో తీసిన ఈ వీడియోను ఇప్పుడు పోస్టు చేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని నాగర్హోల్ జాతీయ పార్కులో జరిగింది. -
కర్ణాటకలో బీఎస్పీతో జేడీఎస్ జట్టు
సాక్షి, బెంగళూరు / న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేస్తామని జనతాదళ్(సెక్యులర్), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లు ప్రకటించాయి. ఈ పొత్తు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని జేడీఎస్ నేత డ్యానిష్ అలీ, బీఎస్పీ నేత సతీశ్‌చంద్ర మిశ్రా తెలిపారు. కర్ణాటకలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో(8 రిజర్వ్డ్) బీఎస్పీ పోటీచేస్తుందనీ, మిగిలిన 204 సీట్లలో జేడీఎస్ అభ్యర్థులు పోటీచేస్తారన్నారు. జేడీఎస్, బీఎస్పీ జాతీయ అధ్యక్షులు దేవెగౌడ, మాయావతిలు ఫిబ్రవరి 17న బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారన్నారు.దాదాపు 22 శాతం ఎస్టీ జనాభా ఉన్న కర్ణాటకలో తమ పార్టీకి మంచి పట్టు ఉందని మిశ్రా అన్నారు. -
ఒకే రోజు 13 వికెట్లు
కోల్‌కతా: కర్ణాటక, విదర్భ జట్ల మధ్య మొదలైన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తొలి రోజు బౌలర్లు విజృంభించారు. కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ (5/45), వినయ్ కుమార్ (2/35) ధాటికి విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల కోల్పోయి 36 పరుగులు చేసింది. మరోవైపు పుణేలో ఢిల్లీతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ జట్టు ఏడు వికెట్లకు 269 పరుగులు చేసింది. -
ఈవీఎం వద్దు..బ్యాలెటే కావాలి: సిద్ధరామయ్య
బెంగళూరు: వచ్చే ఏడాది కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలనే వినియోగించాలని సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యమేనని తనతో కొందరు నిపుణులు చెప్పారని వెల్లడించారు. ఈసీ స్వతంత్ర సంస్థే అయినా అధికార బీజేపీ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆరోపించారు. పాత పద్ధతి అయిన బ్యాలెట్ విధానానికి వెళ్లడంలో సమస్య ఏముందని ప్రశ్నించారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొనడంపై స్పందిస్తూ...చాలా సందర్భాల్లో అంచనాలు తప్పాయని, ఫలితాలు వెలువడే డిసెంబర్ 18న ఏం జరుగుతుందో వేచి చూద్దామని అన్నారు. -
భర్త ముందే.. భార్యపై ఘోరం
సాక్షి, బెంగళూరు/ దొడ్డబళ్లాపుర: కామాంధులు చెలరేగిపోతున్నారు. ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వివరాలు... తుమకూరుకు చెందిన 26 ఏళ్ల వివాహిత ఉపాధి కోసం నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లికి వచ్చి ఓ గార్మెంట్ పనిచేస్తోంది. వారం రోజుల క్రితం స్థానిక దూబరహళ్లి గ్రామంలో ఇంటిని అద్దెకు తీసుకుంది. ఆమె ఉద్యోగానికి వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే ఆటోడ్రైవర్ వెంటపడే వాడు. ఎన్ని సార్లు చెప్పినా పద్ధతి మార్చుకోలేదు. నవంబర్ 19న కూడా వెంకటేష్ ఆమె వెంట పడ్డాడు. సహనం కోల్పోయిన మహిళ చెప్పుతో వెంకటేష్‌ను కొట్టింది. గ్రామస్తుల మధ్య తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని అతడు స్నేహితులైన రౌడీషీటర్ రాఘవేంద్ర, పునీత్, విజయ్ కుమార్‌తో కలిసి అదే రోజు రాత్రి మహిళ ఇంటికి వచ్చాడు. ఆమె భర్తను మారణాయుధాలతో బెదిరించి అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బంధువులు, స్నేహితుల సూచనల మేరకు 21వ తేదీన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన వెంకటేష్, రాఘవేంద్ర, పునీత్‌లను శనివారం అరెస్టు చేశారు. విజయ్‌కుమార్ పరారీలో ఉన్నాడు. కాగా ఈ కేసుకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. బాధితురాలికి ప్రధాన నిందితుడైన వెంకటేష్‌కు మధ్య మొదటి నుంచి సన్నిహిత సంబంధముందని తెలుస్తోంది -
ఐఏఎస్ మృతిపై అట్టుడికిన సభ
► అనురాగ్ తివారి వ్యవహారంపై చర్చకు బీజేపీ పట్టు ► విధానసభలో ఇరుపక్షాల వాగ్వాదం సాక్షి, బెంగళూరు: కర్ణాటక క్యాడర్ యువ ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అనుమానాస్పద మరణం గురువారం విధానసభలో ప్రతిధ్వనించింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ ఆరంభమైన వెంటనే విపక్షాల ఒత్తిడి మేరకు స్పీకర్ కోళివాడ స్వల్పకాలిక చర్చకు అవకాశమివ్వగా, బీజేపీ పక్ష నేత జగదీష్‌శెట్టర్ మాట్లాడుతూ...‘రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా ఉత్తమ సేవలు అందించిన అనురాగ్ తివారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీనిపై మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ విషయమై చట్టసభల్లో చర్చించాల్సిన అవసరం ఉంది.’ అని డిమాండ్ చేశారు. స్పీకర్ కోళివాడ స్పందిస్తూ ఈ కేసును ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తుండటం వల్ల చట్టసభలో చర్చించడానికి అవకాశం లేదన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శెట్టర్ గతంలో సీబీఐకు అప్పగించిన పలు కేసులను ఇదే సభలో చర్చించామన్నారు. న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మాట్లాడుతూ బీజేపీ నాయకులు చావును కూడా రాజకీయం చేస్తున్నారని ఘాటు వాఖ్యలు చేశారు. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుకు సంబంధించి చట్టసభలో చర్చించడం వల్ల ప్రయోజం ఏమీ ఉండబోదన్నారు. అనురాగ్ తివారి అనుమానాస్పద విషయం పై చర్చకు అనుమతివ్వాల్సిందేనని బీజేపీ పట్టుబట్టారు. ఇందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీంతో విపక్ష బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి ధర్నాకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో ఒత్తిడికి తలొగ్గిన స్పీకర్ కోడివాళ ఈ విషయమై విషయాన్ని ప్రస్తావించడానికి మాత్రం అవకాశం కల్పించారు. జగదీ శెట్టర్ మాట్లాడుతూ...‘బాధిత కుటుంబ సభల్యులు ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నారు. వారిని కనీసం ప్రభుత్వం అధికారికంగా మాట్లాడి వారికి సాంత్వన చేకూర్చాలి. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం సరికాదు. అది మానవత్వం అనిపించుకోదు.’ అని పేర్కొన్నారు. చివరకు స్పీకర్ సూచనతో చర్చను ముగించారు.