
కోల్‌కతా: కర్ణాటక, విదర్భ జట్ల మధ్య మొదలైన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తొలి రోజు బౌలర్లు విజృంభించారు. కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ (5/45), వినయ్ కుమార్ (2/35) ధాటికి విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల కోల్పోయి 36 పరుగులు చేసింది. మరోవైపు పుణేలో ఢిల్లీతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ జట్టు ఏడు వికెట్లకు 269 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment