జార్ఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండోరోజు గుజరాత్ ఇన్నింగ్స్ తడబడింది.
నాగ్‌పూర్: జార్ఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండోరోజు గుజరాత్ ఇన్నింగ్స్ తడబడింది. ఓవర్‌నైట్ స్కోరు 283/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ 103 పరుగుల తేడాలో మిగతా ఏడు వికెట్లను కోల్పోయి 390 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 214 పరుగులు సాధించింది.
మరోవైపు రాజ్‌కోట్‌లో తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73; 11 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. అంతకుముందు తమిళనాడు 305 పరుగులకు ఆలౌటైంది.