Vidharba
-
పట్టుబిగించిన విదర్భ
ఇండోర్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్ చేరిన విదర్భ జట్టు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో పటిష్ట స్థితిలో నిలిచింది. అక్షయ్ వాడ్కర్ అద్భుత సెంచరీకి తోడు ఆదిత్య సర్వతే, సిద్ధేశ్ నేరల్లు అర్ధశతకాలు సాధించడంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి విదర్భ 156 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 528 పరుగులు చేసింది. అంతకుముందు 206/4తో ఆట కొనసాగించిన విదర్భ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ వికెట్లను త్వరగానే కోల్పోయింది. సీనియర్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ (78), వాఖరే (17) త్వరగానే పెవిలియన్ చేరినా... వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ (243 బంతుల్లో 133 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. ఆదిత్య సర్వతే (79; 11 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 169 పరుగులు జోడించిన అతను.. సర్వతే అవుటైన అనంతరం సిద్ధేశ్ నెరల్ (92 బంతుల్లో 56 బ్యాటింగ్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అభేద్యమైన 113 పరుగుల జతచేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మూడో రోజు మొత్తం కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 322 పరుగులు చేయడం విదర్భ ఆధిపత్యాన్ని చూపి స్తోంది. ఢిల్లీ బౌలర్లలో సైనీకి 3, ఆకాశ్‌కు 2 వికెట్లు దక్కాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 233 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో ఢిల్లీ కోలుకొని మ్యాచ్‌ను ‘డ్రా’ దిశగా నడిపించగలిగినా కూడా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విదర్భ మొదటి సారి రంజీ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
ఒకే రోజు 13 వికెట్లు
కోల్‌కతా: కర్ణాటక, విదర్భ జట్ల మధ్య మొదలైన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తొలి రోజు బౌలర్లు విజృంభించారు. కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ (5/45), వినయ్ కుమార్ (2/35) ధాటికి విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల కోల్పోయి 36 పరుగులు చేసింది. మరోవైపు పుణేలో ఢిల్లీతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ జట్టు ఏడు వికెట్లకు 269 పరుగులు చేసింది. -
సమైక్య మహారాష్ట్రే మా నినాదం
గడ్కరీ వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్ రావుత్ ముంబై: సమైక్య మహారాష్ట్రే శివసేన నినాదమని ఆ పార్టీ నేత సంజయ్ రావుత్ స్పష్టం చేశారు. ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటుకు తాము వ్యతిరేకమని, అందుకు ప్రజల మద్దతు కూడా లేదని రావుత్ పేర్కొన్నారు. విదర్భ ఏర్పాటు కావాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరమని, ఇతర పార్టీల మద్దతు కూడా కూడగట్టాల్సి ఉందని కేంద్ర నౌకాయాన మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై రావుత్ పైవిధంగా స్పందించారు. మరాఠీ మాట్లాడే ప్రజలందరిని మోడీ సర్కారు ఏకం చేస్తుందని తాము బలంగా విశ్వసిస్తున్నామని, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెల్గావ్ను కూడా మహారాష్ట్రలో కలపేందుకు మోడీ సర్కారు సహాయసహకారాలు అందిస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. అఖండ మహారాష్ట్రకే శివసేన కట్టుబడి ఉందని, విదర్భను మహారాష్ట్ర నుంచి వేరు చేయడాన్ని శివసేన ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదన్నారు. -
రేపు తొలి అంకం
సాక్షి, ముంబై: తొలి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఎన్నికలు జరిగే విదర్భ ప్రాంతంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇన్ని రోజులు కనిపించిన రాజకీయ నాయకుల సందడి, రోడ్ షోలు, ఇంటిఇంటికి ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల పదిన నాగపూర్, భండారా, గోండియా, రాంటెక్, యావత్మల్-వాషీమ్, వార్ధా, అకోలా, బుల్దానా, గడ్చిరోలి-చిమూర్, అమరావతి, చంద్రపూర్ లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవీఎం యంత్రాలు, బూత్ అధికారులు, సిబ్బంది దాదాపు అన్నిపోలింగ్ కేంద్రాల వద్దకి చేరుకుంటున్నారు. పొలింగ్ జరిగే కేంద్రాల వల్ల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్రమ మద్యం, డబ్బుల సరఫరాపై నిఘా వేశారు. ఎన్నికలకు మరొక్కరోజు మాత్రమే ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు శతాథా ప్రయత్నించే అవకాశముందన్న సమాచారం మేరకు ఖాకీలు ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న గడ్చిరోలి-చిమూర్, చంద్రాపూర్ ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పారా మిలటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. చివరి రోజు అభ్యర్థుల కోలాహలం... ఎన్నికల ప్రచారానికి చివరి రోజైనా మంగళవారం ఆయా పార్టీల అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. తమకు ఓటేస్తే నియోజకవర్గాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అభ్యర్థించారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీలిచ్చారు. యువత, మహిళలు, వృద్ధులు...ఇలా అందరిని కలిసి ఓటేయ్యాలని కోరారు. అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్... ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఏఏ ప్రాంతంలో ఎవరి ఓట్లు ఎటు, కుల సమీకరణాలు ఎలా ఉన్నాయి, తాము ఇచ్చిన హామీలకు ఎంత మంది ప్రజలు ఆకర్షితులయ్యే అవకాశముంది తదితర అంశాలపై చర్చిస్తూ లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమ పార్టీ సారథుల ప్రభావం పొలింగ్పై ఎంతమేరకు ప్రభావం చూపనుందనే దానిపై కూడా చర్చించుకుంటున్నారు. విదర్భలోని పది స్థానాల్లో మహాకూటమి, ప్రజాసామ్య కూటమి మధ్య ప్రధాన పోరు జరిగే అవకాశం కనబడుతోంది. కొన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఉన్నా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపొవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. విదర్భ ప్రాంతంలో ఏర్పడిన కరువు, అతివృష్టి వల్ల పంటలు కోల్పోయిన రైతులు ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది కూడా ప్రధానం కానుంది. స్థానిక రాజకీయ వాతావరణ పరిస్థితులను చూస్తే మహాకూటమి, ప్రజాస్వామ్య కూటమి చెరో ఐదు సీట్లు దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది. విదర్భలోని పది లోక్‌సభ స్థానాలకు పోటీచేసే 201 మంది అభ్యర్థుల్లో 90 మంది ఇండిపెండెంట్లు, 15 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. నమోదిత రాజకీయ పార్టీల నుంచి 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు స్థాన్లాల్లో కాంగ్రెస్, మూడు స్థానాల్లో ఎన్సీపీ, ఆరు స్థానాల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో శివసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ వాద్ పార్టీ పది స్థానాల్లో బరిలో ఉండగా, సీపీఐ ఒకే స్థానంలో పోటీ చేస్తోంది. నాగపూర్ లోక్‌సభ నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విలాస్ ముత్తెంవార్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ముత్తెంవార్‌కు బీజేపీ అభ్యర్థి నితిన్ గడ్కారీతో పాటు ఆప్ అభ్యర్థిని అంజలి దమనియా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. వార్ధా లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ దత్తా మెఘే కుమారుడు సాగర్ మెఘేలకు గట్టి పోటీ ఎదురవుతోంది. అలాగే భండారా, గోండియా నుంచి బరిలో ఉన్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్, రాంటెక్ నుంచి కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్, యావత్మల్-వాషీమ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న రాష్ట్ర మంత్రి శివాజీరావ్ మోఘే గెలుపు కోసం శాయశక్తులూ ఒడ్డుతున్నారు. వార్ధా, అకోలా, బుల్దానా, గడ్చిరోలి-చిమూర్, అమరావతి, చంద్రపూర్లోనే అందరూ అభ్యర్థులు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షులు కేజ్రీవాల్‌తోపాటు పలువురు ప్రముఖ నాయకులు ఇప్పటికే వివిధ బహిరంగ సభల్లో పాల్గొని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక హామీలను గుప్పించారు. -
విదర్భకు ఓకే.. గూర్ఖాలాండ్‌కు నో!
బోడోలాండ్నూ సమర్థించను: జైరామ్ ‘తెలంగాణకు’ హామీ ఇచ్చాం సీమాంధ్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నాం న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి విదర్భను విడదీయాలన్న డిమాండ్‌ను సమర్థిస్తానని ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ సోమవారం ప్రకటించారు. అయితే వ్యూహాత్మక కారణాల రీత్యా పశ్చిమబెంగాల్లోని గూర్ఖాలాండ్ డిమాండ్‌ను మాత్రం సమర్థించబోనన్నారు. అలాగే అసోంలోని బోడోలాండ్ డిమాండ్‌నూ సమర్థించనన్నారు. విదర్భ డిమాండ్ కూడా గతంలో ఎప్పట్నుంచో ఉన్నదేనన్నారు. ఎన్సీపీతో పాటు బీజేపీ కూడా అందుకు సానుకూలమేనని, కేవలం శివసేనను ఒప్పిస్తే సరిపోతుందని ఒక చానల్ ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ను కూడా నాలుగు ముక్కలు చేయాలని రెండు రోజుల క్రితమే జైరాం గట్టిగా డిమాండ్ చేయడం తెలిసిందే. ప్రస్తుత రూపంలో ఉత్తరప్రదేశ్ పాలన కష్టసాధ్యమని జైరామ్ చెప్పారు. ఆ రాష్ట్రంలో ఏకంగా 20 కోట్ల జనాభా, 74 లేదా 75 జిల్లాలు, 800 బ్లాకులు ఉన్నాయన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా యూపీని సమర్ధంగా పాలించలేదన్నారు. అందుకే ఆ రాష్ట్ర విభజనను తాను సమర్థిస్తున్నానన్నారు. అరుుతే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీది కానీ, భారత ప్రభుత్వానిది కానీ కాదని చెప్పారు. తెలంగాణకు, ఎన్నికలకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని తాననుకోనన్నారు. ఎన్నికలకు, తెలంగాణ ఏర్పాటుకు సంబంధం లేదన్నారు. 60 ఏళ్ల క్రితం నుంచే తెలంగాణ అంశం ఉందని, ఇటీవల పదేళ్లలో కూడా ఇది తీవ్రంగా ఉందని, 2004లో తెలంగాణ ఏర్పాటుకు తాము హామీ ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయూలు ఉన్నప్పటికీ ఇచ్చినమాటకు కట్టుబడి ముందుకు వెళ్లామన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు, ఆందోళనలు పూర్తిగా దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ సీమాంధ్రకు మంచి అభివృద్ధి ప్యాకేజీ లభించిందని చెప్పారు. సీమాంధ్రకిచ్చిన ప్రత్యేక హోదాను జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) ధ్రువీకరించనుందని తెలిపారు. హైదరాబాద్‌లో వస్తున్న ఆదాయమంతా సీమాంధ్ర కోల్పోరుు తెలంగాణకు జమ అవుతుందని చెప్పారు. వనరులు కూడా తగ్గిపోతాయని, ఈ దృష్ట్యానే ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు తెలిపారు.