ఏనుగు పొగ తాగడం చూశారా...? | Amazing Video Wild Elephant Smokes In Karnataka | Sakshi
Sakshi News home page

ఏనుగు పొగ తాగడం చూశారా...?

Published Sat, Mar 24 2018 4:37 PM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

Amazing Video Wild Elephant Smokes In Karnataka - Sakshi

న్యూ ఢిల్లీ : ధూమపానం ఆరోగ్యానికి హానికరం...పొగ తాగరాదు ఇలాంటి వాక్యలు చాలా సందర్భాల్లో వింటూనే వుంటాం. అయితే మనుషులే కాదు ఈ మధ్య జంతువులు కూడా ధూమపానం చేస్తున్నాయి. కోతులు పొగ తాగడం కూడా చూశాం. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలోకి ఏనుగులు వచ్చి చేరాయి. ఇందుకు సంబంధించి వైల్డ్‌ లైఫ్‌ కనజర్వేషన్‌ ఆఫ్‌ ఇండియా.. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు అందరిని తెగ ఆకర్షిస్తుంది. ఒక ఏనుగు పక్కనే మండుతున్న అడవి నుంచి దేన్నో తీసుకుని తన నోట్లో పెట్టుకుంది. తర్వాత పొగను బయటకు వదులుతుంది. చూసేవారికి ఆ దృశ్యం ఏనుగు పొగ తాగుతున్నట్లు ఉంది. అసలు సంగతేంటంటే ఆ ఏనుగు తింటున్నది బొగ్గును. మండుతున్న అడవి నుంచి బొగ్గును తీసుకుని నోట్లో పెట్టుకుంది. తర్వాత ఆ బొగ్గుకు అంటుకుని ఉన్న బూడిదను తన తొండం నుంచి బయటకు వదిలింది. అది కాస్తా చూసేవారికి పొగలా కన్పిస్తుంది.

డబ్ల్యూసీఎస్‌ ఇండియా శాస్త్రవేత్త, ఏనుగుల జీవశాస్త్ర నిపుణుడు డాక్టర్ వరుణ్ గోస్వామి ఈ సంఘటన గురించి వివరిస్తూ బొగ్గులో ఎటువంటి పోషక విలువలు ఉండవు. కానీ అడవి తగలబడినప్పుడు అనేక వృక్షాలు కాలిపోతాయి. అప్పుడు వచ్చే ఆ వాసన జంతువులను ఆకర్షిస్తుంది. అంతేకాక ఇది భేదిమందు(విరోచనకారి మందు)లాగా కూడా పని చేస్తుంది. అందువల్లే జంతువులు బొగ్గు తింటాయి అని డబ్ల్యూసీఎస్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదని అందుకే తాను ఈ వీడియో తీశానని వినయ్‌ కుమార్‌ తెలిపారు. 2016లో తీసిన ఈ వీడియోను ఇప్పుడు పోస్టు చేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని నాగర్‌హోల్‌ జాతీయ పార్కులో జరిగింది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement