బెంగళూరు: అద్దెకట్టకపోతే ఇంటి యజమాని ఏం చేస్తాడు.. ఇళ్లు ఖాళీ చేయమని బెదిరిస్తాడు. అప్పటికి కట్టకపోతే ఇంట్లోని సామాను తీసి బయటపడేస్తాడు. కానీ కర్ణాటకలోని ఓ ఇంటి యజమాని మాత్రం తుపాకీతో బెదిరించాడు. అద్దెకట్టడం లేదనే కోపంతో.. వారిని బెదిరించడానికి ఏకంగా గాల్లోకి కాల్పులు జరిపాడు. ఊహించని ఈ ఘటనకి కిరాయిదారు బెదిరిపోయాడు. కర్ణాటక రాష్ట్రం బెల్గామ్ జిల్లాలోని చిక్కోడి ఏరియాలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఇంటి అద్దె అడిగిన యజమానికి కిరాయిదారుడు డబ్బులు లేవని సమాధానం ఇచ్చాడు. దాంతో రెచ్చిపోయిన ఆ ఇంటి ఓనర్ తన జేబులోని రివాల్వర్ తీసి గాల్లోకి రెండు, మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ హఠాత్పరిమాణంతో వణికిపోయిన కిరాయిదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు.
#WATCH Karnataka: A landlord fired shots in the air after a tenant failed to pay rent, in Chikkodi area of Belgaum district yesterday. The person was later taken into custody by the police. pic.twitter.com/8dxXA8ifcI
— ANI (@ANI) June 15, 2020
Comments
Please login to add a commentAdd a comment