బెంగళూరు: వచ్చే ఏడాది కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలనే వినియోగించాలని సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యమేనని తనతో కొందరు నిపుణులు చెప్పారని వెల్లడించారు. ఈసీ స్వతంత్ర సంస్థే అయినా అధికార బీజేపీ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆరోపించారు. పాత పద్ధతి అయిన బ్యాలెట్ విధానానికి వెళ్లడంలో సమస్య ఏముందని ప్రశ్నించారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొనడంపై స్పందిస్తూ...చాలా సందర్భాల్లో అంచనాలు తప్పాయని, ఫలితాలు వెలువడే డిసెంబర్ 18న ఏం జరుగుతుందో వేచి చూద్దామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment