ballet
-
భావోద్వేగాలు పంచుకుంటున్నారా!..బలైపోవడం ఖాయం!
కొందరు వ్యక్తులు వ్యక్తిగత ఒత్తిడి, చికాకులు, కోపం, నిరాశ ... వంటి భావోద్వేగాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటూ జనాల మద్దతు కోరుకుంటూ ఉంటారు. ఈ విధానం వల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. మానసిక సమస్యలను మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. దీనివల్ల కొత్త ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. యువత, మహిళల్లో ఎక్కువగా ఉండే ఈ సమస్య గురించి, జాగ్రత్తల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! సోషల్ మీడియాలో తమ భావోద్వేగాలు, ఆశనిరాశలు, ఆలోచనలు, ఆవేదనలు, వ్యక్తిగత అనుభవాలు, సమస్యలను విస్తృతంగా పంచుకునే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. ఇతరుల సానుభూతిని కోరుకోవడానికి ఇలా చేస్తుంటారు. దీనికి కొందరు వ్యక్తులు తీర్పులు ఇస్తుంటారు లేదా తప్పుగా అర్థం చేసుకుంటారు. కలిగే నష్టాలు సంఘర్షణ తీవ్రత పెరుగుతుంది అనవసరమైన వాటిపైన శ్రద్ధ నిరంతర సానుభూతి వచనాలను కోరుకుంటారు. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. దీనికన్నా భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి నమ్మదగిన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల నుండి మద్దతు పొందడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే, మీ భావోద్వేగాల పరిస్థితిని మోసగాళ్లు ఓ కంట గమనిస్తుంటారు. వాటిని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు ఫ్రెండ్స్ జాబితాలో చేరి, అనుకూలంగా మాట్లాడుతూ చివరకు ఆర్థికపరమైన నేరాలకు పాల్పడవచ్చు. సానుభూతి కోరుకునేవారు.. ⇔ప్రజల దృష్టిని ఆకర్షించడానికి భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంటారు. లైక్‌లు, కామెంట్స్, ఫాలోవర్స్ ద్వారా మనకున్న ప్రాముఖ్యతను చూసుకుంటారు కాబట్టి చాలామంది ⇔వ్యక్తులు తమ ఫాలోవర్ బేస్‌ను పెంచుకోవడానికి దృష్టిని ఆకర్షించడానికి సోషల్ మీడియాలోకి వస్తారు. ⇔తమ భావోద్వేగాలను సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఎవ్వరికీ కనిపించకుండా వ్యక్తీకరించడానికి సోషల్ మీడియా మాత్రమే అనుకూలంగా భావిస్తారు. ⇔మంచి, చెడు ఏదైనా సోషల్ మీడియాలో ముందుగా విషయాలను పంచుకోవాలనే ఆత్రుత, మనల్ని ఇతరులు గమనిస్తున్నారా లేదా అనే నిరీక్షణ ఉంటుంది. ⇔సోషల్ మీడియాలో ఆలోచనలు, భావాలను పంచుకోవడం వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా అపరిచితుల నుండి కూడా మద్దతు పొందవచ్చు. ⇔కొందరు వ్యక్తులు ఎవ్వరికీ తెలియకుండా అజ్ఞాతంగా ఉంటూ సోషల్ మీడియాలో చురుకుదనాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎందుకంటే వారు తమ వ్యక్తీకరణను అనామకంగా చేస్తారు. ఇది భద్రతా భావాన్ని అందిస్తుంది, తక్షణ పరిణామాల భయం లేకుండా ఉండటమే దీనికి గల కారణం. ⇔మార్పు కోసం వాదించడానికి లేదా ప్రభుత్వాలు, కార్పొరేట్లు, రాజకీయ పార్టీలు తీసుకున్న ముఖ్యమైన విషయాలపై (అంటే విధానాలు లేదా నిర్ణయాలు) దృష్టిని ఆకర్షించడానికి ఇదొక మార్గం. ⇔ఒంటరితనం, సన్నిహిత సంబంధాలు లేకపోవటం లేదా ఎవరితోనైనా మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటే, సోషల్ మీడియా మాత్రమే వారి వ్యక్తీకరణ సాధనంగా పనిచేస్తుంది. ⇔సోషల్ మీడియాలో తమను తాము వ్యక్తీకరించడం, వారి భావాలను పంచుకోవడంలో ఉపశమనం పొందుతుంటారు. ⇔కష్టాలు, సవాళ్లను పంచుకోవడం ద్వారా వ్యక్తులు తమలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వవచ్చు. ⇔కొందరితో వ్యక్తిగతంగా చెప్పలేని విషయాలు ఆన్లైన్లో పంచుకోవడం సుఖంగా ఉంటుంది. ఎలా ఉండాలి.. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విభిన్న రకాల వ్యూవర్స్ మీకు ఉండే అనుకూలమైన సోషల్ మీడియా సైట్‌ను ఎంచుకోవాలి. (ఉదాహరణకు.. వ్యక్తిగత వ్యక్తీకరణల కోసం Facebook, ప్రజల కోసం Twitter ఎంచుకోవచ్చు. సహాయం కోరుతున్నారా, నైపుణ్యాన్ని పంచుకుంటున్నారా లేదా మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకుంటున్నారా అనే దానిపైన స్పష్టత ఉండాలి. మీ ఉద్వేగాల పరిస్థితిని కంప్లైంట్‌గా కాకుండా మీరు ఎలా, ఎందుకు దేనిగురించి భావిస్తున్నారో వివరించడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఇతరులు అర్థం చేసుకునే వీలుంటుంది. మీ భావాలను వ్యక్తపరిచేటప్పుడు, సున్నితమైన లేదా విభజన సమస్యలను తెచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. లేదంటే సంఘర్షణకు దారితీయవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్దిష్ట స్నేహితులు లేదా అనుచరులతో పోస్ట్‌లను పూర్తిగా పబ్లిక్ షేర్ చేయడానికి అనుమతిస్తాయి కాబట్టి గోప్యతా సెట్టింగ్‌లపై నియంత్రణ ఉండాలి. మీ గోప్యతకు భంగం కలిగించే మీ వివరాలను బహిర్గతం చేయకుండా ఉండాలి. (అనగా.. పేరు, చిరునామా, ప్లేస్, టెలిఫోన్ నంబర్, ఇ–మెయిల్, చిరునామా మొదలైన వ్యక్తిగత సమాచారం) ఫీడ్‌బ్యాక్ విషయంలో ఓపెన్‌గా ఉండాలి. గౌరవప్రదంగా ప్రవర్తించాలి. లేకపోతే ప్రతికూల చర్యలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. మీ విజయాలు, జీవిత అనుభవాలు లేదా సంతోషకరమైన క్షణాలను పంచుకోవడం ద్వారా ప్రోత్సాహకరమైన ఉనికిని పొందవచ్చు. మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకోవడం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుందో లేదో, మీరు పోస్ట్ చేసిన దానితో సంతృప్తి చెందుతున్నారో లేదో ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోవాలి. సోషల్ మీడియాలో మీ వ్యక్తీకరణను ఎలా తెలియజేస్తున్నారో స్నేహితుడితో, కుటుంబ సభ్యునితో, థెరపిస్ట్‌తో మాట్లాడటం మేలు చేస్తుంది. వాటిలోని మంచి చెడులను బేరీజు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత ప్రతిష్టకు సమస్యలు ఎదురైతే రిపోర్ట్ చేయడానికి... https://www.facebook.com/help/ 1753719584844061/?helpref=uf_share Instagram:https://help.instagram.com/ contact/ 383679321740945 Twitter: https://help.twitter.com/en/forms/ safety-and-sensitive-content LinkedIn: https://www.linkedin.com/help/ linkedin/answer/a1378278/report-inappropriate-content-messages-or-safety-concerns?lang=en (చదవండి: ఇండియన్ బ్యాలెరినా! బ్యాలె డ్యాన్స్‌లో రాణిస్తున్న హైదరాబాదీ!) -
బ్యాలె డ్యాన్స్‌లో రాణిస్తున్న హైదరాబాదీ!
అంతర్జాతీయ వేదికలపైన ప్రసిద్ధిగాంచిన బ్యాలె డ్యాన్స్‌లో హైదరాబాద్ వాసి13 ఏళ్ల ఇష్నా చౌదరి రాణించడమే కాదు ప్రతిష్ఠాత్మక కెనడా నేషనల్ బ్యాలె స్కూల్ (ఎబీఎస్)లో ప్రవేశానికి ఎంపికైంది. ప్రపంచంలోని టాప్ 10 బ్యాలే స్కూల్స్‌లో ఒకటైన ఎన్బీఎస్ అకడమిక్ కరిక్యులమ్‌లో ప్రవేశం పొందిన మొదటి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది ఇష్నా. ‘వివిధ దేశాలలో ఉన్న నా ఫ్రెండ్స్ ఇండియన్ బ్యాలెరినా’ అని పిలుస్తున్నారు బ్యాలె ఈజ్ బ్యూటిఫుల్ అంటూ తన ఆనందాన్ని తెలియజేస్తోంది. మూడేళ్ల వయసు నుంచే బ్యాలెపై మక్కువ పెంచుకున్న ఇష్నా ప్రముఖ టెలివిజన్ సిరీస్ ‘‘ఏంజెలీనా బ్యాలేరినా’ చూస్తూ తన ఆసక్తిని మరింత పెంచుకుంది. ఐదేళ్ల వయస్సులో ముంబైలో క్లాసికల్ బ్యాలెలో శిక్షణ ప్రారంభించింది. ఏడేళ్ల వయసులో ఇష్నా తల్లిదండ్రులు పూణేకు మారడంతో అక్కడే మూడేళ్లపాటు బ్యాలె ప్రాథమిక దశల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుంది. ఇందులో భాగంగానే లండన్‌ని రాయల్ అకాడమీ ఆఫ్ డ్యాన్స్ గ్రేడెడ్ పరీక్షల్లో విజేతగా నిలిచి, ప్రత్యేకతను సంపాదించుకుంది. వదలని పట్టుదల కరోనా మహమ్మారి విజృంభించడంతో బ్యాలె స్టూడియోలు భౌతికంగా మూసేశారు. ‘‘ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ శిక్షణ సంస్థలు అందించే ఆన్లైన్ క్లాస్లపైన దృష్టి పెట్టాను. ఇందులో భాగంగా వాగనోవా బ్యాలె అకాడమీ ఆఫ్ రష్యా వంటి ప్రముఖ వేదికలు సమ్మర్ ఇంటెన్సివ్ శిక్షణ కోసం ఇష్నాను ఆడిషన్ చేశాయి. ఈ ఆడిషన్స్‌లో అంతర్జాతీయ విద్యార్థులతో కలిసి శిక్షణ పొందాను. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన వాగనోవాలోని బ్యాలేరినాలతో శిక్షణ పొంది, ప్రీ ప్రొఫెషనల్ బ్యాలె ప్రోగ్రామ్ కోసం ఆసియాలోని టాప్ బ్యాలె స్కూల్ అయిన మార్లుపి డ్యాన్స్ అకాడమీ(ఇండోనేషియా)కి ఎంపికయ్యాను. కానీ ఇండోనేషియాకు మకాం మార్చడం కష్టం కాబట్టి మళ్లీ ఆన్ లైన్ తరగతుల ద్వారానే ట్రైనింగ్ తీసుకున్నాను’ అని వివరిస్తుంది ఇష్నా. అవార్డులు.. స్కాలర్షిప్లు బ్యాలెలో ఆసియాలోనే అత్యుత్తమ స్కూల్ అయినటువంటి మార్లుపి డ్యాన్స్ అకాడమీ (ఎమ్డీఏ) క్లాసికల్ బ్యాలెలో ప్రీ ప్రొఫెషనల్ శిక్షణను అందిస్తుంది. ఈ వేదికగా అంతర్జాతీయ స్థాయి డ్యాన్సర్లును తయారు చేసిన ప్రముఖ బ్యాలె శిక్షకురాలు మిస్ జోనాథ ఆధ్వర్యంలో ఇష్నా పదేళ్ల వయసున్నప్పటి నుంచే ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఎన్నో అవార్డులను గెలుచుకుంది. సింగపూర్ యూత్ ఆర్ట్ ఫెస్టివల్లో క్లాసికల్ బ్యాలెలో వెండి, కాంస్య అవార్డులు, సింగపూర్ ఐబీజీపీఎస్లో పొటెన్షియల్ అవార్డు, జకార్తాలోని ఏషియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో మెరిట్ అవార్డు, గ్రేట్ ఇండియా బ్యాలె పోటీలో గోల్డ్‌మెడల్ తదితర అవార్డులను ఇష్నా చౌదరి అందుకుంది. అంతేకాకుండా యూత్ అమెరికన్ గ్రాండ్ ప్రిక్స్ (వైఏజీపీ)లో సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించింది. కెనాన్ డ్యాన్స్ ఫెస్టివల్ సింగపూర్ ఫర్ సమ్మర్ ఇంటెన్సివ్ టు ఆసియా బ్యాలెట్ అకాడమీ (మలేషియా), నేషనల్ బ్యాలె అకాడమీ ఆఫ్ న్యూయార్క్ సమ్మర్ ఇంటెన్సివ్, జువాన్ పాయింట్ ప్రోగ్రామ్ న్యూజిలాండ్ వంటి వేదికల్లో స్కాలర్షిప్లను సైతం పొందింది. జువాన్ పాయింట్లో తన నైపుణ్యాల ఆధారంగా ఆమె స్కాలర్షిప్ను అడ్వాన్స్డ్ పాయింట్ ప్రోగ్రామ్‌కు పొడిగించడం విశేషం. ఎంబీఎస్ కెనడా, ఏఆండ్ఏ బ్యాలె(చికాగో)లో శిక్షణ పొందేందుకు స్కాలర్షిప్ సాధించింది. అంతర్జాతీయ బ్యాలె వేర్ బ్రాండ్ ‘బ్యాలె లైఫ్’కు ఇష్నా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహారిస్తుంది. నిరంతర కృషి ఈ ఏడాది ప్రపంచంలోని టాప్ బ్యాలె అకాడమీలతో వ్యక్తిగతంగా శిక్షణ పొందాలనుకుంది ఇష్నా. ఇందులో భాగంగా బోస్టన్ బ్యాలె (బోస్టన్, ఎమ్ఏ), రష్యన్ మాస్టర్స్ బ్యాలె (అలికాంటే, స్పెయిన్), ప్రతిష్టాత్మక స్కూల్ ఆఫ్ అమెరికన్ బ్యాలె (ఎస్‌ఏబీ, న్యూయార్క్)లో 8 శాతంతో సమ్మర్ ఇంటెన్సివ్‌ల ఆడిషన్లో ఎంపికైంది. నిరంతర కృషితో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఇష్నా., సమ్మర్ ఆఫ్ 2023ని కెనడా నేషనల్ బ్యాలెలో శిక్షణ పొందాలని నిర్ణయించుకుంది. ఇంటెన్సివ్లో తన ప్రదర్శన ఫలితంగా కెనడా ఎన్బీఎస్లో ప్రొఫెషనల్ బ్యాలె ప్రోగ్రామ్ కోసం ఆఫర్ అందుకుంది. 1959లో స్థాపించబడిన ఎన్బీఎస్ ., ఔత్సాహిక యువ నృత్యకారులు, ఉపాధ్యాయుల కోసం ప్రపంచంలోని అగ్రగామి శిక్షణా సంస్థలలో ఒకటి. ఈ వేదికగా శిక్షణ పొందుతున్న మొట్టమొదటి భారతీయ బాలేరినాగా ఇష్నా చౌదరి చరిత్ర సృష్టించింది. – హనుమాద్రి శ్రీకాంత్ (చదవండి: మీకు తెలుసా! ఆ చారిత్రాత్మక భారత రెస్టారెంట్ హఠాత్తుగా మూతపడుతోంది!) -
బీరాలు వీడి బేరాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోస్టల్ బ్యాలెట్ అధికార పార్టీలో ప్రకంపనలు రేపింది. ఉద్యోగులకు ఓటుకు రెండు వేల రూపాయల వరకూ ఆశ చూపినా వారు తోసిరాజని వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓట్లు వేయడం అధికారపార్టీని కలవరపెడుతోంది. జిల్లాలో పోలైన ఓట్లలో 70 నుంచి 80 శాతం ఓట్లు వైఎస్సార్ సీపీకి పడ్డాయని అంచనా. పోస్టల్ బ్యాలెట్లో ట్రెండ్ చూసిన తర్వాత డబ్బుతోనైనా గెలవాలనే అభిప్రాయానికి పలువురు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వచ్చేశారు. గ్రామాలు, కాలనీలు, వార్డుల వారీగా ఓట్ల కొనుగోలుకు సిద్ధ పడుతున్నారు. ఒక్క ఓటు ఉన్నా వారిని వెతికిపట్టుకుని ప్రలోభ పెట్టే పనిలో పడిపోయారు. డబ్బుతో కొనడం.. వినకపోతే బెదిరింపులకు దిగడం వారి వ్యూహంగా మారింది. కొన్నిచోట్ల అధికారులు, ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు మద్దతు పలుకుతుండటంతో వారి అండతో గెలుపొందాలని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ వారి వాహనాలను చెక్‌పోస్ట్‌లలో తనిఖీలు చేయడం లేదు. మరోవైపు గత నెల 24న సమావేశం పేరుతో చెక్‌పోస్టులలో తనిఖీ చేసే సిబ్బందిని నియోజకవర్గ కేంద్రాలకు రప్పించి ఆ సమయంలో డబ్బులు అన్ని ప్రాంతాలకు చేరేలా తెలుగుదేశం నాయకులకు సహకరించినట్లు సమాచారం. అదే విధంగా మద్యం తరలించేందుకు కూడా పోలీసు అధికారులు సాయం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ఒక కీలక విభాగం అధికారి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఎక్కడైనా తెలుగుదేశం నాయకులు డబ్బులు పంచుతూ పట్టుబడినా వారిపై కేసులు లేకుండా పంపించేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు వస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ అధికారిపై అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు విపక్ష పార్టీలు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు అక్రమ సంపాదనతో కూడబెట్టిన డబ్బులతో పాటు తెలుగుదేశం అధిష్టానం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తుండటంతో ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు అయినా ఖర్చు చేసేందుకు తెలుగుదేశం అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు. ఇంటిలోని అన్ని ఓట్లకు ఇంత మొత్తం అంటూ బేరాలకు దిగుతున్నారు. కాదు కూడదు అంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రూపులు వారీ డ్వాక్రా మహిళల అకౌంట్లకు నగదును బదిలీ చేస్తున్నారు. సమావేశాలు పెట్టి మరీ మహిళలకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. మొత్తంగా ఓట్లు పొందేందుకు అధికార పార్టీ నేతలు అన్ని రకాల ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఇంటింటి ప్రచారం కన్నా... అధికార పార్టీ నేతలు ఓట్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికార యంత్రాంగం అండతో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రలోభాల రాజకీయం మితిమీరింది. గ్రామాల్లో డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ, ఆశావర్కర్లను టార్గెట్ చేశారు. నగదు అందచేసి వారి ఓట్లు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు. అందులో భాగంగా డ్వాక్రా మహిళల అకౌంట్ల నంబర్లు తీసుకుని టీడీపీ నాయకులు గ్రూపుకు రూ.10 వేల చొప్పున పలు అకౌంట్లకు జమ చేశారు. పలు మండలాల్లో మహిళలకు మీటింగ్ ఏర్పాటు చేసి వచ్చిన వారికి వెయ్యి రూపాయల నగదు అందచేశారు. ప్రధానంగా మహిళల ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇవికాక మత్స్యకార గ్రామాలు, కొల్లేరు గ్రామాల్లో కట్టుబాట్లను అడ్డుపెట్టుకుని గ్రామంలోని మొత్తం ఓట్లు మాకే వేయాలంటూ పైరవీలు చేస్తున్నారు. ఆయా కుల పెద్దలకు ఎంత డబ్బులైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. గ్రామ కాపులతో బేరం పెడుతున్నారు. మత్స్యకార గ్రామాలను కొంటున్న పరిస్థితులు దెందులూరు, నర్సాపురం నియోజకవర్గాల్లో ఉన్నాయి. నిడదవోలులో తెలుగుదేశం అభ్యర్థ్ధి శేషారావు ఆయా సంఘాల ప్రతినిధులను కలిసి వారికి ఒక్కొక్కరికి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకూ ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఎవరైనా పది ఓట్లు వేయించగలరని తెలిస్తే వారి ఇంటివద్ద వాలిపోతున్నారు. వారికి ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు డబ్బులు ఎరచూపి వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా భీమవరంలో జనసేన కూడా డబ్బులు వెదజల్లి గెలిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. భీమవరంలో పోస్టల్ బ్యాలెట్‌కు రెండు వేల రూపాయల వరకూ జనసేన నాయకులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తెలుగుదేశం నాయకులు బహిరంగంగా నగదు పంపిణీ చేస్తున్నా పట్టించుకోని అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని కూడా కెమెరాలతో వీడియోలు తీస్తున్నారు. -
నెల్లూరులో.. బ్యాలెట్‌కు బెదిరింపులు
నెల్లూరు(పొగతోట): ప్రజాక్షేత్రంలో గెలవలేమని గుర్తించిన టీడీపీ నేతలు ఎన్నికల్లో విజయానికి తొక్కని అడ్డదారులు లేవు. ఓటర్ల ప్రలోభాలకు తెరతీసిన అధికార పక్షం తాజాగా పోస్టల్ బ్యాలెట్‌నూ వదల్లేదు. ఉద్యోగులను బెదిరించి, ప్రలోభ పెట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. ఉదయగిరి, ఆత్మకూరుల్లో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఉద్యోగులు టీడీపీకి ఓటు వేసేలా చేసుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఎన్జీఓ సంఘం రాష్ట్ర నాయకుడు అశోక్‌బాబు గురువారం నెల్లూరులో మకాం వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికార పార్టీకి అనుకూలంగా వేసేలా ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఆయన చర్యలను వ్యతిరేకించిన వారిపై బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. నిబంధనలకు గాలికొదిలేసి అశోక్‌బాబు వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మంత్రి నా రాయణ మరో అడుగు ముందుకేశారు. నగరంలోని అంగన్వాడీలను, మెప్మా సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి తనకు అనుకూలంగా ఓట్లు వేసుకునేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిని బెది రింపులకు సైతం పాల్పడుతున్నట్టు సమాచారం. ఎన్నికల అధికారులు జోక్యం చేసుకోవాలని ప్రజలు, వివిధ రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. ఇక రెండు రోజులే.. పోస్టల్ బ్యాలెట్ తీసుకునేందుకు రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 6వ తేదీలోపు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. ఆర్ఓ కేంద్రాలు పోస్టల్ బ్యాలెట్ తీసుకునే ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 24 వేల మంది ఎన్నికల విధులకు హాజరుకానున్నారు. వీరంతా పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాల్సి ఉంది. గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 5,590 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారు. అందులో 3,679 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుని ఆర్ఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేశారు. ఇంకా సుమారు 18 వేల మందికిపైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగులకు నేరుగా కాని లేదా పోస్టల్ ద్వారా కాని బ్యాలెట్ పంపిస్తారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగులు ఆర్ఓ కార్యాలయాలకు చేరుకోవడంతో రద్దీ పెరిగిపోయింది. ఆర్ఓ కార్యాలయాల వద్ద టీడీపీ అభ్యర్థుల వర్గీయులు చేరి, పోస్టల్ బ్యాలెట్‌ను రూ.2500 నుంచి రూ.4 వేలకు ఇవ్వాలని ప్రలోభాలు పెడుతున్నారు. అలా ఇవ్వమన్న వారిని సంబంధిత శాఖల అధికారుల ద్వారా బెదిరిస్తున్నారు. దీంతో కొంత మంది ఈ చిరాకులు భరించలేక బ్యాలెట్ ఇచ్చి వెళ్లిపోతున్నారు. అందరికీ తెలిసిన ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించి పోస్టల్ బ్యాలెట్ సేకరిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ తీసుకునే ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఉండకూడదని ఎన్నికల అధికారులు ఆదేశించినా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకులు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వని ఉద్యోగులపై ఒత్తిళ్లు చేయిస్తు దౌర్జన్యాలకు దిగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు రెండు రోజులే సమయం ఉండడంతో ఉద్యోగులు పరుగులు తీస్తున్నారు. నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించినఉద్యోగులు కావలి 394 155 ఆత్మకూరు 348 69 కోవూరు 318 292 నెల్లూరు సిటీ 793 787 నెల్లూరు రూరల్ 970 715 సర్వేపల్లి 821 659 గూడూరు 703 0 సూళ్లూరుపేట 753 753 వెంకటగిరి 275 164 ఉదయగిరి 215 85 మొత్తం 5,590 3,679 -
అనుమతి పత్రం లేకుండా ఫొటోలు, వీడియో తీయలేరు!
సాక్షి, కామారెడ్డి అర్బన్: పోలింగ్ స్టేషన్లో వీడియోలు, ఫొటోలు తీయడం సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధం అయినప్పటికీ ఎన్నికల పరిశీలకుడి అనుమతితో ప్రతికా సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు వీడియో చిత్రీకరణ, ఫొటోలు తీయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఓటరు రహస్యంగా ఓటు వేస్తున్న ఫొటోలు, చిత్రీకరణ చేయడం ఎట్టి పరిస్థితిల్లోనూ నేరంగా పరిగణిస్తారు. ఓటరు రహస్య బ్యాలెట్ పద్ధతికి విఘాతం కలగకుండా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పత్రికా సిబ్బంది తమ వీడియో, ఫొటోలను అనధికార వ్యక్తులు, మధ్యవర్తుల ద్వారా తీయడం నేరం అవుతుంది. సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల పక్రియను ఎన్నికల అధికారులే స్వయంగా వీడియో చిత్రీకరణ చేస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా గుర్తింపు పొందిన ఫొటోగ్రాఫర్ స్టేషన్ బయట తమ వంతు కోసం ఎదురు చూస్తున్న ఓటర్లను ఫొటోలు, వీడియో తీయవచ్చు. ఓటింగ్ యంత్రంలో ఓటు వేస్తున్న ఫొటో, వీడియో తీయడం నేరంగా పరిగణిస్తారు. ఎన్నికల సంఘం గుర్తింపు లేకుండా ఎలాంటి వారికి పోలింగ్ స్టేషన్‌లోని అనుమతి లేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ సిబ్బంది అయినా సరే ఎన్నికల సంఘం అనుమతిపత్రం తప్పని సరి. అనుమతి పత్రం లేకుండా అడుగు పెట్టడానికి వీలులేదు. -
ఈవీఎం వద్దు..బ్యాలెటే కావాలి: సిద్ధరామయ్య
బెంగళూరు: వచ్చే ఏడాది కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలనే వినియోగించాలని సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యమేనని తనతో కొందరు నిపుణులు చెప్పారని వెల్లడించారు. ఈసీ స్వతంత్ర సంస్థే అయినా అధికార బీజేపీ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆరోపించారు. పాత పద్ధతి అయిన బ్యాలెట్ విధానానికి వెళ్లడంలో సమస్య ఏముందని ప్రశ్నించారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొనడంపై స్పందిస్తూ...చాలా సందర్భాల్లో అంచనాలు తప్పాయని, ఫలితాలు వెలువడే డిసెంబర్ 18న ఏం జరుగుతుందో వేచి చూద్దామని అన్నారు. -
రైల్వే సమ్మె ‘సైరన్’?
42 ఏళ్ల తరువాత సమ్మెకు సిద్ధం! బ్యాలెట్ ద్వారా హెచ్చరించిన కార్మికులు నెల్లూరు (సెంట్రల్) : రైల్వేలో సమ్మె చేయడం అరుదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంక్‌లు, పోస్టల్, టెలికాం ఉద్యోగులు అప్పుడప్పుడు సమ్మె చేయడం పరిపాటి. కాని రైల్వేలో సమ్మె చేయడం 42 ఏళ్ల క్రితం జరిగింది. రైల్వే సమ్మె జరిగితే కేంద్రమే స్తంభించేపోతుంది. అలాంటి రైల్వేలో సమ్మె సైరన్ మోగనుంది. అందుకు పక్కా ప్రణాళిక కూడా రచిస్తున్నారు. 1974 తరువాత రైల్వే కార్మికులు సమ్మెకు దిగనున్నారు. 9వ వేతన సంఘం సూచించిన విధంగా వేతనాల పెంపును నిరసిస్తూ సమ్మెలోకి వెళ్లనున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ సమ్మె చేసి కేంద్రానికి దిమ్మతిరిగేటట్లు చేయాలని కార్మికులు, ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. బ్యాలెట్‌తో మొదలుపెట్టి.. రైల్వే సమ్మెకు మొదట బ్యాలెట్లో తెలియజెప్పాలని ఇప్పటికే నెల్లూరులోని రైల్వేస్టేషన్లో ఇటీవల బ్యాలెట్ రూపంలో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సిగ్నల్, ఆపరేటింగ్ తదితర అన్ని స్థాయి కార్మికుల అభిప్రాయాలను సైతం తీసుకున్నారు. ఈ అభిప్రాయాలను మొత్తం రైల్వే ఉన్నతాధికారులకు సైతం పంపారు. దీంతో సమ్మెకు ముందు ఇచ్చే నోటీసుగా బ్యాలెట్ పత్రాలతో హెచ్చరిక చేసినట్లు తెలిస్తోంది.40 శాతానికి పెంచాలని..ప్రస్తుత ఇస్తున్న వేతనాలపై 13 నుంచి 14 శాతానికి పెంపునకు వేతన సంఘం ఆమోదించిగా దీన్ని 40 శాతం పెంచాలని రైల్వే కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థగా ఉన్న రైల్వేలో పగలు, రాత్రి తేడా లేకుండా ప్రాణాలకు సై తం పణంగా పెట్టి విధులు చేస్తున్నా.. కనీసం తగిన వేతనం కూడా ఇవ్వకపోవడం అన్యాయమంటున్నారు. రైల్వే స్థంభించనుందా? దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపుగా అన్ని విభాగాల్లో కార్మికులు కలిపి 10 వేల మందికిపైగా ఉన్నారు. రైల్వేలో ప్రధాన కార్మిక సంఘాల పిలుపుతో వీరు సమ్మెలోకి పోతే మాత్రం పూర్తిగా రైల్వే వ్యవస్థ స్తంభించనుంది. బ్యాలెట్లో మెజార్టీ ప్రకారం కార్మికులకు వేతనాలు పెంచే విషయంలో నిర్ణయం తీసుకోకుంటే త్వరలోనే సమ్మె నోటీస్ రైల్వే ఉన్నతాధికారులకు ఇచ్చి సమ్మెలోకి దిగేందుకు సన్నద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
బుల్లెట్ కంటే బ్యాలెట్టే ‘పవర్’
సాక్షి, విజయవాడ : ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని తెలియజెప్పాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, బీజేపీ సీనియర్‌నేత ఎం.వెంకయ్యనాయుడు కోరారు. మంగళవారం విజయవాడ ఎకన్వెన్షన్ సెంటర్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితుడైన డాక్టర్ కంభంపాటి హరిబాబును అధ్యక్షుడుగా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమైందని, ఆలోటును జాతీయపార్టీ బీజేపీ భర్తీ చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని దీన్ని పార్టీ నేతలు, శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోడి ప్రభుత్వం అభివృద్ధి, సుపరిపాలన అనే లక్ష్యాలతో పనిచేస్తోందన్నారు. మున్సిపల్ పాలనలో సంస్కరణలు తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. మోడి ప్రభుత్వ హయాంలో వేగం పెరిగిందని, ఉద్యోగస్తులు బాధ్యతలు పెరిగాయని తెలిపారు. రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీల ఏర్పాటు, ప్రధాన నగరాల్లో మెట్రోరైళ్లు విస్తరణ వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. నరేంద్రమోడి 100 రోజుల పాలన 100 ముందడుగులని కొనియాడారు. సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఏమీ చేసిందని ఇప్పుడే పలువురు ప్రశ్నిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే పున:వ్యవస్థీకరణ చట్టంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను చట్టం చేశామని గుర్తు చేశారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఏపీ నుంచి పరిపాలన సాగించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కొత్త రైల్వే జోన్ ప్రతిపాదనకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలని హరిబాబు సూచించారు. బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి... లబ్బీపేట : రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనతాపార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. నవంబరు 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు చేర్చాలన్నారు. మాజీ గవర్నర్ వి.రామారావు, జాతీయ అధికార ప్రతినిధి నరసింహరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, కృష్ణంరాజు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దాసం ఉమామహేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, శ్రీనివాసరాజు, సినీ నటులు భానుచందర్, సురేష్, శివాజీ, శివాజీరాజ్, విక్కీ తదితరులు పాల్గొన్నారు. నగరానికి చెందిన డాక్టర్ కొడాలి రామకృష్ణ, తుమ్మల పద్మ తదితరులు పార్టీలో చేరారు. -
బుల్లెట్కీ, బ్యాలెట్కీ 'అమ్మ' ఒక్కటే
బుల్లెట్ వర్సెస్ బ్యాలెట్.... తూటా కి ఓటుకి పోటీ... ఈ మాట చాలా సార్లు వింటూనే ఉంటాం. కానీ బుల్లెట్, బ్యాలెట్ ఈ రెండు పదాల మూలం ఒకటే. బాల్ అంటే బంతి అనే పదం నుంచే ఈ రెండూ పుట్టుకొచ్చాయి. గ్రీకు రిపబ్లిక్ లలో ఎవరినైనా సభ్యుడిగా ఎన్నుకోవాలంటే ఇలాగే అందరి అభిప్రాయాలను తెలుసుకునేవారు. చివరికి ఆయన్ని సభ్యుడిగా చేర్చుకోవాలనుకుంటే ఒక తెల్లని బంతిని జారవిడిచేవారు. వద్దనుకుంటే నల్లబంతిని వదిలేవారు. ఇలా నిర్ణయం తీసుకునే ప్రక్రియను క్రమేపీ బ్యాలెట్ అనడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి బ్యాలెట్ పర్యాయపదంగా మారిపోయింది. అలాగే పోటీకి నిలుచున్న అభ్యర్థిని కేండిడేటస్ అనేవారు. దాని అర్థం తెల్లని దుస్తులు ధరించిన వాడు. తమాషా ఏమిటంటే మన దేశంలో తెల్లని దుస్తులు ఇప్పటికీ రాజకీయ నాయకుల ట్రేడ్ మార్క్ గా ఉంటూ వస్తున్నాయి.