
సాక్షి, కామారెడ్డి అర్బన్: పోలింగ్ స్టేషన్‌లో వీడియోలు, ఫొటోలు తీయడం సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధం అయినప్పటికీ ఎన్నికల పరిశీలకుడి అనుమతితో ప్రతికా సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు వీడియో చిత్రీకరణ, ఫొటోలు తీయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఓటరు రహస్యంగా ఓటు వేస్తున్న ఫొటోలు, చిత్రీకరణ చేయడం ఎట్టి పరిస్థితిల్లోనూ నేరంగా పరిగణిస్తారు. ఓటరు రహస్య బ్యాలెట్ పద్ధతికి విఘాతం కలగకుండా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
- పత్రికా సిబ్బంది తమ వీడియో, ఫొటోలను అనధికార వ్యక్తులు, మధ్యవర్తుల ద్వారా తీయడం నేరం అవుతుంది.
- సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల పక్రియను ఎన్నికల అధికారులే స్వయంగా వీడియో చిత్రీకరణ చేస్తారు.
- శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా గుర్తింపు పొందిన ఫొటోగ్రాఫర్ స్టేషన్ బయట తమ వంతు కోసం ఎదురు చూస్తున్న ఓటర్లను ఫొటోలు, వీడియో తీయవచ్చు. ఓటింగ్ యంత్రంలో ఓటు వేస్తున్న ఫొటో, వీడియో తీయడం నేరంగా పరిగణిస్తారు.
- ఎన్నికల సంఘం గుర్తింపు లేకుండా ఎలాంటి వారికి పోలింగ్ స్టేషన్‌లోని అనుమతి లేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ సిబ్బంది అయినా సరే ఎన్నికల సంఘం అనుమతిపత్రం తప్పని సరి. అనుమతి పత్రం లేకుండా అడుగు పెట్టడానికి వీలులేదు.
Comments
Please login to add a commentAdd a comment