సాక్షి, బెంగళూరు / న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేస్తామని జనతాదళ్(సెక్యులర్), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లు ప్రకటించాయి. ఈ పొత్తు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని జేడీఎస్ నేత డ్యానిష్ అలీ, బీఎస్పీ నేత సతీశ్‌చంద్ర మిశ్రా తెలిపారు. కర్ణాటకలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో(8 రిజర్వ్‌డ్) బీఎస్పీ పోటీచేస్తుందనీ, మిగిలిన 204 సీట్లలో జేడీఎస్ అభ్యర్థులు పోటీచేస్తారన్నారు. జేడీఎస్, బీఎస్పీ జాతీయ అధ్యక్షులు దేవెగౌడ, మాయావతిలు ఫిబ్రవరి 17న బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారన్నారు.దాదాపు 22 శాతం ఎస్టీ జనాభా ఉన్న కర్ణాటకలో తమ పార్టీకి మంచి పట్టు ఉందని మిశ్రా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment