
సాక్షి, బెంగళూరు: మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి ఎట్టకేలకు శనివారం బెంగళూరులో తన లాయర్ చంద్రశేఖర రెడ్డితో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యారు. యాంబిడంట్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, ఈ కేసుతో తనకు అసలు ఏ సంబంధమూ లేదని జనార్దన రెడ్డి చెప్పారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. నేను తప్పు చేశానని నిరూపించేలా పోలీసుల వద్ద ఒక్క పత్రమూ లేదు’ అని అంతకుముందు ఆయన ఓ వీడియో విడుదలచేశారు.
ఆదివారం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) జనార్దన రెడ్డికి నోటీసులు పంపడం తెల్సిందే. ‘యాంబిడంట్ కంపెనీ యజమాని ఫరీద్ ప్రతి ఒక్క రాజకీయ నేతతో ఫోటో దిగుతాడు. బెంగళూరులో ఎంతోమంది నాయకులతో అతనికి పరిచయం ఉంది. నేనెందుకు భయపడాలి, పారిపోవాలి?’ అని అన్నారు. యాంబిడంట్ సంస్థ ఆర్థిక పథకాల పేరుతో వందలాది మంది దగ్గర దాదాపు రూ. 600 కోట్లు వసూలు చేసి అనంతరం మోసానికి పాల్పడింది. ఈ కేసు నుంచి బయటపడేసేందుకు జనార్దన∙రెడ్డి రూ. 18 కోట్లు లంచం అడిగారని ఫరీద్ ఆరోపించడం తెలిసిందే
Comments
Please login to add a commentAdd a comment