
సాక్షి,బళ్లారి: బీజేపీలోకి మళ్లీ చేరాలనే ఆలోచన తనకు లేదని, కలలో కూడా బీజేపీలో చేరాలనుకోనని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. గురువారం కొప్పళ జిల్లా గంగావతిలో ఆయన కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితులోను తాను బీజేపీలో చేరే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. విజయేంద్ర బీజేపీ అధ్యక్షుడైనందుకు అభినందించానని, ఇందులో రాజకీయ ఉద్దేశం లేదన్నారు.
తాను ఎవరికీ తల వంచే వ్యక్తిని కాదని, అప్పట్లో తాను సోనియాగాంధీకే భయపడలేదని అన్నారు. కేఆర్‌పీపీని బలోపేతం చేసి, రాష్ట్రంలో 8 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. అన్ని స్థానాల్లో గెలుపొందేందుకు ప్రయత్నిస్తామన్నారు. బీజేపీ ఉనికిని కాపాడుకునేందుకు, కాంగ్రెస్ నాయకులు కేసుల నుంచి దొడ్డిదారిన బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీరాముని పేరు చెప్పుకుని అఽధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు అంజనాద్రి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment