సాక్షి, బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, కేఆర్‌పీపీ వ్యవస్థాపకులు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని మళ్లీ సొంత గూటిలోకి చేర్చుకునేందుకు బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారా? రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు విజయేంద్ర గాలితో చర్చలు జరిపారా అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గాలి జనార్దనరెడ్డి లేకపోతే బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలతో పాటు రాష్ట్రంలో మరో ఐదారు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయన ప్రభావంతో పార్టీకి నష్టం జరుగుతుందన్న భయంతో గాలికి బీజేపీ గాలం వేస్తోందని సమాచారం.
పార్టీ బలోపేతానికి
గాలి జనార్దనరెడ్డికి బీజేపీతో అవినాభావ సంబంధం ఉండేది. అయితే గనుల కేసులు, అరెస్టుల నేపథ్యంలో పార్టీతో దూరం పెరిగింది. గత ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మారిన పరిస్థితుల్లో రాష్ట్రంలో బలం పెంచుకోవాలంటే బలమైన నాయకులందరినీ చేర్చుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో గాలి జనార్దనరెడ్డితో విజయేంద్ర సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment