ఎయిరిండియాలో లంచాల బాగోతం!! | Canadian police charges three in Air India bribery case | Sakshi
Sakshi News home page

ఎయిరిండియాలో లంచాల బాగోతం!!

Published Fri, Jun 6 2014 11:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

ఎయిరిండియాలో లంచాల బాగోతం!!

ఎయిరిండియాలో లంచాల బాగోతం!!

ఎయిరిండియాలో మరో లంచాల బాగోతం వెలుగుచూసింది. అసలే నష్టాల్లో మునిగి తేలుతున్న ఈ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ప్రతిష్ఠ దీంతో మరింత మసకబారింది. దాదాపు 600 కోట్ల రూపాయల విలువ చేసే బయోమెట్రిక్ సెక్యూరిటీ వ్యవస్థకు సంబంధించిన కాంట్రాక్టు పొందేందుకు భారతీయ అధికారులకు లంచం ఇవ్వచూపారన్న ఆరోపణలతో ఇద్దరు అమెరికన్లు, ఒక భారతీయ బ్రిటిష్ వ్యాపారవేత్తలపై కెనడా పోలీసులు కేసులు పెట్టారు.

శైలేష్ గోవిందియా అనే ఎన్నారై వ్యాపారవేత్తతో పాటు క్రిప్టోమెట్రిక్స్ కెనడా ఇంక్ మాజీ సీఈవో రాబర్ట్ బర్రా, కంపెనీ మాజీ సీఓఓ డారియో బెరినిలపై అంతర్జాతీయ దర్యాప్తు అనంతరం కేసులు పెట్టారు. ముగ్గురు నిందితులపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగం విదేశీ ప్రభుత్వాధికారుల లంచాల చట్టం కింద కేసులు పెట్టడంతో వీరిపై కెనడా వ్యాప్తంగా వారంట్లు జారీ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement