
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో బూర్గంపహాడ్ మండలంలో డబ్బు పంపిణీ చేశారంటూ ఆమెపై నమోదుచేసిన కేసులో ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు విధించిన 6 నెలల జైలుశిక్ష అమలును నిలిపివేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment