
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ గ్రూపుల లొల్లి మరోసారి బయటపడింది. పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో శుక్రవారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మైకు పట్టుకొని కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ‘నేనే మాట్లాడతా’ అంటూ ఆమె చేతిలో మైకును లాక్కున్నారు.
దీంతో కవిత వెంటనే.. పక్కనే ఉన్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు చెప్పి అసహనం వ్యక్తం చేశారు. అనంతరం.. దీక్షలో కూర్చున్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ ప్రొటోకాల్ ప్రకారం జిల్లా అధ్యక్షురాలి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్‌తో ప్రస్తావించారు.
చదవండి: గవర్నర్‌తో వివాదంపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే!