కోల్‌కతాలో14 కేజీల బంగారం పట్టివేత | DRI arrests man with 14 kg of smuggled gold worth Rs 4.1 cr | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో14 కేజీల బంగారం పట్టివేత

Published Tue, Apr 4 2017 11:55 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

DRI arrests man with 14 kg of smuggled gold worth Rs 4.1 cr

న్యూఢిల్లీ: అక్రమంగా తీసుకువచ్చిన కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని కోల్‌కతాలో పట్టుకున్నట్లు రెవెన్యూ ఇంటలిజెన్స్‌ విభాగం(డీఆర్‌ఐ) అధికారులు తెలిపారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏప్రిల్‌ 2వ తేదీన స్థానిక నగేర్‌బజార్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక్కోటి 116 గ్రాముల బరువున్న 120 బంగారు బిస్కెట్లను గుర్తించారు. వీటిలో 62 బిస్కెట్లపై స్విట్జర్లాండ్‌ గుర్తులు, 58 బిస్కెట్లపై యూఏఈలో తయారైనట్లు గుర్తులున్నాయి.
 
ఈ బంగారాన్ని దుబాయి నుంచి బంగ్లాదేశ్‌లోకి తీసుకువచ్చి...అక్కడి నుంచి భారత సరిహద్దు ప్రాంతం బసిర్హాత్‌ వద్ద వీటిని సదరు వ్యకి అందుకున్నట్లు విచారణలో తెలిసింది. దీని విలువ సుమారు రూ. 4 కోట్లు ఉంటుంది. ఇలా ఉండగా, జనవరిలో కూడా ఇక్కడ డీఆర్‌ఐ అధికారులు 41కిలోల అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement