సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇం టెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జాంబియాకు చెందిన మహిళ మాదకద్రవ్యాలు తీసుకొ స్తున్నట్లు నిఘావర్గాల ద్వారా డీఆర్‌ఐకి సమా చారం అందింది. ఖతార్ ఎయిర్‌వేస్ ద్వారా జోహన్నెస్‌బర్గ్, దోహా మీదుగా సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న విమానంలో ఆమె హైదరాబాద్ చేరుకుంది.
లగేజీని తనిఖీ చేయగా, అధికారులకు అనుమానాస్పద పొడి లభించింది. దాన్ని పరీక్షించి హెరాయిన్ అని నిర్ధారించారు. 3.2 కిలోల బరువున్న దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. గతనెలలో జూన్ 6న ఇద్దరు ఆఫ్రికా మహిళల నుంచి రూ.78 కోట్ల విలువైన, జూన్ 21న జాంబియాకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.20 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment