
సాక్షి, హైదరాబాద్ : నగర శివార్లలో భారీగా గంజాయి పట్టుబడింది. కొబ్బరి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 944 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు 1.8 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. కొబ్బరి కాయల లోడ్ ముసుగులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందిన మేరకు డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment