ఓ వ్యక్తి వద్ద 40 కేజీల బంగారం పట్టివేత | 40kg of gold worth Rs 12cr seized in Noida | Sakshi
Sakshi News home page

40 కేజీల బంగారం.. అధికారులు అవాక్కు

Published Tue, Dec 20 2016 9:23 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

ఓ వ్యక్తి వద్ద 40 కేజీల బంగారం పట్టివేత

ఓ వ్యక్తి వద్ద 40 కేజీల బంగారం పట్టివేత

నోయిడా: ఓ ఎగుమతి దారుడి నుంచి ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు 40 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువు దాదాపు పన్నెండు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో బడా బాబుల వద్ద ఉన్న నల్లధనాన్ని బంగారంగా మార్చే చర్యల్లో భాగంగానే అతడు ఇంత పెద్ద బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. నోయిడాలోని స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఎన్‌ఎస్‌ఈజెడ్‌) నుంచి ఇతడు దేశీయ మార్కెట్‌కు బంగారం పంపిణీ దారుడిగా పనిచేస్తున్నాడు.

దుబాయి నుంచి ఎన్‌ఎస్‌ఈజెడ్‌ ఆభరణాలు తయారు చేసి విక్రయించేందుకు గాను బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అనంతరం అదే ఆభరణాలను దుబాయ్‌కు ఎగుమతి చేస్తుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే దేశీయ మార్కెట్లోకి దాదాపు రూ.150 కోట్ల విలువైన బంగారం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్నంత కొంతమంతి బడా బాబుల వద్ద ఉన్న అక్రమ సంపాదనను తెల్లడబ్బుగా మార్చేందుకు ఉపయోగించినట్లు సమాచారం. బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లి అనంతరం రిమాండ్‌కు తరలించారు.
మరోపక్క, మీరట్‌లో ఓ ప్రభుత్వ సంస్థలో ఇంజినీర్‌ గా పనిచేస్తున్న ఆర్‌కే జైన్‌ అనే వ్యక్తి వద్ద నుంచి ఐటీ అధికారులు రూ.2.67కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 17 లక్షలు కొత్త కరెన్సీ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement