
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం ఏజెన్సీ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తోన్న గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. శనివారం ఎల్‌బీనగర్ క్రాస్‌రోడ్ వద్ద ట్రక్కు (టీఎస్ 12సీ 5662), కారు (ఏపీ 29 ఏబీ 7351) లను తనిఖీ చేశారు. దీనిపై రూ.4,100 పెండింగ్ చలానాలు ఉన్నాయి. ట్రక్కులో పైన ఖాళీ ప్లాస్టిక్ కేసులను ఉంచి, ఎవరికీ అనుమానం రాకుండా అడుగున గంజాయి సంచులను జాగ్రత్తగా అమర్చారు. కానీ, తనిఖీల్లో 1,554 కిలోల 751 గంజాయి సంచులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.3.10 కోట్లు ఉంటుందని అంచనా.
ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. పోలీసుల తనిఖీలను ముం దుస్తుగానే గుర్తించి, ట్రక్కులోని సరుకును తప్పించేందుకు కారును పైలట్ వాహనంగా వాడారు. కానీ, విశ్వసనీయ సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు రెండు వాహనాలను ఆపారు. సరుకు భద్రాచలం సమీపంలోని మోతుగూడెం నుంచి కర్ణాటకలోని బీదర్‌కు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆరుగురిని అరెస్టు చేసిన అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment