
సాక్షి, సంగారెడ్డి: నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నిషేధించిన ఔషధాల రవాణాపై డీఆర్‌ఐ అధికారులు శనివారం ప్రత్యేక దాడులు జరిపారు. కర్ణాటకకు చెందిన వ్యక్తుల నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ. 50 కోట్ల విలువైన 46 కిలోల నిషేధిత డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. నిషేధిత డ్రగ్స్‌ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన డ్రగ్స్ ముఠా హైదరాబాద్ మీదుగా చెన్నైకి నిషేధిత డ్రగ్స్‌ను తరలించేందుకు పథకం పన్నినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment