శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.97 లక్షల విలువైన 3.26 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు శనివారం సీజ్ చేశారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 28 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.